For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Planet Transit in June 2022 :జూన్ నెలలో 5 గ్రహాల రవాణా.. ఏయే తేదీల్లో మారనున్నాయంటే...

2022 సంవత్సరంలో జూన్ నెలలో ఏయే గ్రహాలు తమ స్థానాలు ఏ తేదీల్లో మారనున్నాయి.

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాలు తమ స్థానాన్ని మారిన ప్రతిసారీ ప్రతి ఒక్క రాశిపై కొంత ప్రభావం పడుతుంది. ఇలాంటి సమయంలో కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు రాగా.. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలొస్తాయి.

Planet Transit in June 2022 Dates and Effects in Telugu

వచ్చే మాసం అంటే జూన్ నెలలో చాలా గ్రహాలు తమ దిశను మార్చుకోనున్నాయి. అంటే మొత్తం 5 గ్రహాలు తమ స్థానం నుండి మరో స్థానానికి వెళ్లనున్నాయి. ముందుగా జూన్ 2వ తేదీన అంటే గురువారం నాడు అంగారకుడు మిధునం నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు.

Planet Transit in June 2022 Dates and Effects in Telugu

ఆ మరుసటి రోజే అంటే జూన్ 3వ తేదీన శుక్రవారం నాడు వృషభరాశి నుండి బుధుడు తిరోగమనం చెందనున్నాడు. జూన్ 15వ తేదీన సూర్యుడు వృషభ రాశి నుండి మిధున రాశిలోకి ప్రయాణం చేయనున్నాడు.

Planet Transit in June 2022 Dates and Effects in Telugu

జూన్ 20వ తేదీన గురుడు కుంభ రాశి నుండి తిరోగమనం చెందనున్నాడు. చివరగా జూన్ 22వ తేదీన శుక్రుడు మిధున రాశి నుండి కర్కాటక రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఈ గ్రహాల రవాణా వల్ల ఎవరెవరిపై ఎలాంటి ప్రభావం పడుతుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Shani Jayanti 2022 Daan: శని మహాదశ కష్టాల నుండి ఉపశమనం కావాలంటే ఇవి దానం చేయండి...Shani Jayanti 2022 Daan: శని మహాదశ కష్టాల నుండి ఉపశమనం కావాలంటే ఇవి దానం చేయండి...

జూన్ 2న అంగారకుడి రవాణా..

జూన్ 2న అంగారకుడి రవాణా..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, జూన్ రెండో తేదీన అంటే గురువారం నాడు, అంగారకుడు(కుజుడు)మిధున రాశి నుండి కర్కాటక రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి కృషి, ధైర్యం, బలం మరియు శక్తికి కారకంగా పరిగణించబడుతుంది.

జూన్ 3న బుధుడి తిరోగమనం..

జూన్ 3న బుధుడి తిరోగమనం..

జూన్ మూడో తేదీన శుక్రవారం రోజున వృషభ రాశి నుండి తిరోగమన దిశలో ప్రయాణం చేయనున్నాడు. ఇలా బుధుడు తిరోగమనం చేయడం వల్ల ఈ రాశి విద్యార్థులు విద్యా రంగంలో విజయం సాధిస్తారు. అంతేకాదు వ్యాపారులు, ఉద్యోగులు తమకు సంబంధించిన రంగాల్లో విజయం సాధిస్తారు. ఎందుకంటే బుధుడిని తెలివితేటలు, మేధస్సుకు ప్రతీకగా పరిగణిస్తారు.

జూన్ 15న సూర్యుడి సంచారం..

జూన్ 15న సూర్యుడి సంచారం..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో గ్రహాలన్నింటికీ అధిపతిగా సూర్యుడిని భావిస్తారు. ఎంతో ప్రాధాన్యత ఉన్న సూర్యుడు జూన్ 15వ తేదీన అంటే బుధవారం రోజున వృషభరాశి నుండి మిధున రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఎవరి జాతకంలో సూర్యుని స్థానం బలంగా ఉంటుందో వారికి ప్రతి రంగంలో గౌరవం మరియు కీర్తి లభిస్తుంది. మరోవైపు, సూర్యుడి స్థానం బలహీనంగా ఉండే వారి జీవితంలో కొంత ప్రతికూల ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి.

జూన్ 20న గురుడి సంచారం..

జూన్ 20న గురుడి సంచారం..

గ్రహాలన్నింటికీ గురువుగా గురుడిని పరిగణిస్తారు. జూన్ 20వ తేదీన అంటే సోమవారం నాడు గురుడు కుంభ రాశి నుండి తిరోగమనం చెందనున్నాడు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గురుడిని సంపద, శ్రేయస్సుకు ప్రతీకగా భావిస్తారు. అంతేకాదు వైవాహిక జీవితం, పిల్లలు, విద్య మొదలైన వాటికి కారకంగా పరిగణించబడుతుంది.

జూన్ 22న శుక్రుడి రవాణా..

జూన్ 22న శుక్రుడి రవాణా..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో శుక్రుడిని ఆనందం, సంపద మరియు కీర్తికి కారకంగా పరిగణిస్తారు. ఎవరి జాతకంలో అయితే శుక్రుడి స్థానం బలంగా ఉంటుందో వారి జీవితంలో సంతోషం పెరుగుతుంది. అంతటి ప్రాధాన్యత ఉన్న శుక్రుడ మిధున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో ఎవరి జాతకంలో అయితే శుక్రుని స్థానం బలహీనంగా ఉంటుందో వారికి ఆర్థిక పరమైన సమస్యలు రావొచ్చు.

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం కేవలం ఊహాలు మరియు ఇంటర్నెట్లో దొరికిన సమాచారం ఆధారంగా ప్రచురించబడింది. ఇక్కడున్న సమాచారాన్ని బోల్డ్ స్కై.తెలుగు నిర్ధారించడం లేదు. మీరు ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు, మీ వ్యక్తిగత జ్యోతిష్య నిపుణుడిని సంప్రదించి నిర్ణయం తీసుకోగలరు.

FAQ's
  • 2022లో జూన్ నెలలో ఎన్ని గ్రహాలు తమ స్థానాలను మారనున్నాయి?

    జూన్ నెలలో మొత్తం 5 గ్రహాలు తమ స్థానం నుండి మరో స్థానానికి వెళ్లనున్నాయి. ముందుగా జూన్ 2వ తేదీన అంటే గురువారం నాడు అంగారకుడు మిధునం నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఆ మరుసటి రోజే అంటే జూన్ 3వ తేదీన శుక్రవారం నాడు వృషభరాశి నుండి బుధుడు తిరోగమనం చెందనున్నాడు. జూన్ 15వ తేదీన సూర్యుడు వృషభ రాశి నుండి మిధున రాశిలోకి ప్రయాణం చేయనున్నాడు. జూన్ 20వ తేదీన గురుడు కుంభ రాశి నుండి తిరోగమనం చెందనున్నాడు. చివరగా జూన్ 22వ తేదీన శుక్రుడు మిధున రాశి నుండి కర్కాటక రాశిలోకి సంచారం చేయనున్నాడు.

English summary

Planet Transit in June 2022 Dates and Effects in Telugu

Here we are talking about the Planet transit in june 2022 dates and effects in Telugu. Have a look
Story first published:Wednesday, May 25, 2022, 15:52 [IST]
Desktop Bottom Promotion