Latest Updates
-
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి
Planet Transit in June 2022 :జూన్ నెలలో 5 గ్రహాల సంచారం.. ఈ రాశులకు ధన లాభం...!
2022 సంవత్సరంలో జూన్ నెలలో ఏయే గ్రహాలు తమ స్థానాలు మారనున్నాయి.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాలు తమ స్థానాన్ని మారిన ప్రతిసారీ ప్రతి ఒక్క రాశిపై కొంత ప్రభావం పడుతుంది. ఇలాంటి సమయంలో కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు రాగా.. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలొస్తాయి.

వచ్చే మాసం అంటే జూన్ నెలలో చాలా గ్రహాలు తమ దిశను మార్చుకోనున్నాయి. అంటే మొత్తం 5 గ్రహాలు తమ స్థానం నుండి మరో స్థానానికి వెళ్లనున్నాయి. ముందుగా జూన్ 2వ తేదీన అంటే గురువారం నాడు అంగారకుడు మిధునం నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు.

ఆ మరుసటి రోజే అంటే జూన్ 3వ తేదీన శుక్రవారం నాడు వృషభరాశి నుండి బుధుడు తిరోగమనం చెందనున్నాడు. జూన్ 15వ తేదీన సూర్యుడు వృషభ రాశి నుండి మిధున రాశిలోకి ప్రయాణం చేయనున్నాడు.

జూన్ 20వ తేదీన గురుడు కుంభ రాశి నుండి తిరోగమనం చెందనున్నాడు. చివరగా జూన్ 22వ తేదీన శుక్రుడు మిధున రాశి నుండి కర్కాటక రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఈ నేపథ్యంలో జూన్ మాసంలో ఐదు గ్రహాల సంచారం వల్ల ఏ రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడుతుంది.. ఏ రాశుల వారికి ఆర్థిక పరంగా అద్భుతంగా ఉంటుంది. ఏ రాశుల ఉద్యోగులకు ప్రమోషన్ వంటి శుభవార్తలు వినిపిస్తాయనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం...

వృషభ రాశి..
జూన్ మాసంలో ఐదు గ్రహాల రవాణా కాలంలో వృషభ రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. ఈ సమయంలో మీరు కోరుకున్న కోరికలన్నీ ఫలితాలన్నీ నెరవేరుతాయి. గ్రహాల సంచారం వేళ ఆర్థిక పరంగా అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. వ్యాపారులు కూడా ఈ కాలంలో మంచి లాభాలను పొందుతారు. మీ ఆదాయాన్ని పెంచుకోవడంలో కూడా విజయం సాధిస్తారు. ఆరోగ్య పరంగా ఈ కాలంలో అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మానసికంగా ఎలాంటి ఆందోళనలు ఉండవు.

సింహ రాశి..
ఈ రాశి వారికి జూన్ మాసంలో అద్భుతంగా ఉంటుంది. పని విషయంలో మీరు కోరుకున్న మార్పులు జరుగుతాయి. వ్యాపారంలో ఏదైనా పెద్ద ఒప్పందం ఫైనల్ అవుతుంది. ఈ కాలంలో మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ఈ కాలంలో బదిలీ కూడా దక్కే అవకాశం ఉంది. అంతేకాదు కార్యాలయంలో మీకు సహోద్యోగుల నుండి సహకారం లభించే అవకాశం ఎక్కువగా ఉంది. మహిళల నుండి మీకు ఆర్థిక లాభం కూడా రావొచ్చు. విద్యార్థులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది.

తుల రాశి..
ఈ రాశి వారికి జూన్ నెలలో శుభ ఫలితాలొస్తాయి. ఈ కాలంలో ఉపాధి రంగంలో ఉండే వారికి పురోగతి లభించడమే కాక విశేష ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మీరు చేపట్టే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఈ నెలలో విద్యార్థులు విద్యపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరంగా ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారిలో ఉద్యోగులకు జూన్ మాసంలో విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. మీ ఆఫీసులో ప్రమోషన్ గురించి శుభవార్త వినిపిస్తుంది. వ్యాపారులకు ఈ కాలంలో మంచి పురోగతి లభిస్తుంది. విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ నెలలో ఎలాంటి ఆటంకాలు ఉండవు.

ధనస్సు రాశి..
ఈ రాశి వారికి కూడా జూన్ నెలలో గ్రహాల రవాణా కారణంగా ఆర్థిక పరంగా సానుకూల ఫలితాలొస్తాయి. వ్యాపారులకు మరియు ఉద్యోగులకు ఈ కాలంలో ధన లాభం వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులకు కొత్త ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. దీంతో మీకు భవిష్యత్తులో ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు దక్కుతాయి. ఈ సమయంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ తిరిగి దక్కుతాయి. అయితే ఆరోగ్యం విషయంలో కళ్లకు సంబంధించిన కొన్ని సమస్యలు ఉండొచ్చు. కాబట్టి కళ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
గమనిక : ఇక్కడ అందించిన సమాచారం కేవలం ఊహాలు మరియు ఇంటర్నెట్లో దొరికిన సమాచారం ఆధారంగా ప్రచురించబడింది. ఇక్కడున్న సమాచారాన్ని బోల్డ్ స్కై.తెలుగు నిర్ధారించడం లేదు. మీరు ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు, మీ వ్యక్తిగత జ్యోతిష్య నిపుణుడిని సంప్రదించి నిర్ణయం తీసుకోగలరు.
జూన్ నెలలో మొత్తం 5 గ్రహాలు తమ స్థానం నుండి మరో స్థానానికి వెళ్లనున్నాయి. ముందుగా జూన్ 2వ తేదీన అంటే గురువారం నాడు అంగారకుడు మిధునం నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఆ మరుసటి రోజే అంటే జూన్ 3వ తేదీన శుక్రవారం నాడు వృషభరాశి నుండి బుధుడు తిరోగమనం చెందనున్నాడు. జూన్ 15వ తేదీన సూర్యుడు వృషభ రాశి నుండి మిధున రాశిలోకి ప్రయాణం చేయనున్నాడు. జూన్ 20వ తేదీన గురుడు కుంభ రాశి నుండి తిరోగమనం చెందనున్నాడు. చివరగా జూన్ 22వ తేదీన శుక్రుడు మిధున రాశి నుండి కర్కాటక రాశిలోకి సంచారం చేయనున్నాడు.



Click it and Unblock the Notifications











