Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
Zodiac Signs :వచ్చే నెలలో ఆరు గ్రహాల సంచారం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..మీ రాశి ఉందేమో చూసెయ్యండి..!
2021లో ఫిబ్రవరి మాసంలో గ్రహాల మార్పు వల్ల ఏ రాశుల వారికి లాభమో ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వచ్చే నెలలో అంటే ఫిబ్రవరి 2021లో ఆరు గ్రహాలు తమ స్థానాలను మారనున్నాయి. ఈ గ్రహాల రవాణాలో ముందుగా బుధ గ్రహంతో ప్రారంభమవుతుంది.

బుధుడు ఫిబ్రవరి మాసంలో 4వ తేదీన తన దిశను మార్చుకోనున్నాడు. ఫిబ్రవరి 9న శని గ్రహం మకరంలోకి ఆగమనం చేయనున్నాడు. ఈ గ్రహాలతో పాటు సూర్యుడు ఫిబ్రవరి 12వ తేదీన కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. మరో రెండు రోజుల తర్వాత అంటే 14వ తేదీ గురుడు మకర రాశిలోకి అడుగుపెట్టనున్నాడు.

మరో వారం రోజులకు అంటే, ఫిబ్రవరి 21వ తేదీన బుధుడు తిరోగమనం చెంది మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఆ మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 22వ తేదీన అంగారకుడు వ్రుషభరాశిలోకి సంచారం చేయనున్నాడు. ఇలా ఆరు గ్రహాలు తమ స్థానాల నుండి మరో స్థానానికి రవాణా చేయనున్నందున ద్వాదశ రాశిచక్రాలపై తీవ్ర ప్రభావం పడనుంది.

అయితే ఈ గ్రహాల సంచారం వల్ల ఏ రాశుల వారికి సానుకూల ఫలితాలు వస్తాయి.. ఏ రాశుల వారికి ప్రతికూల ఫలితాలొస్తాయి.. ఎవరెవరికి ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, వ్యాపార విషయాలలో సానుకూలంగా మరియు ప్రతికూలంగా ఉంటుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేషరాశి..
ఫిబ్రవరి నెలలో ఆరు గ్రహాల మార్పు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. మీ పెండింగులో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. మీ కుటుంబ వాతావరణం బాగుంటుంది. ఈ సమయంలో మీరు స్నేహితులతో సరాదాగా గడుపుతారు. మీ వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. విద్యార్థులు కూడా విద్యా రంగంలో విజయం సాధిస్తారు.

మిధున రాశి..
ఫిబ్రవరి మాసంలో ఆరు గ్రహాలు తమ దిశను మార్చుకున్నప్పుడు, ఈ రాశి వారికి శుభప్రదమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులకు పెట్టుబడుల విషయంలో అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మీరు ఈ సమయంలో ప్రభావశీల వ్యక్తులను కలుస్తారు. మీరు నిర్ణయాలను చాలా వేగంగా, కచ్చితమైన వాటిని తీసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మీ ప్రేమ జీవితంలో సంబంధం బలంగా ఉంటుంది. మీరు కుటుంబ బాధ్యతల కోసం ముందుకు వస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.

సింహ రాశి..
ఈ రాశి వారికి ఫిబ్రవరిలో ఆరు గ్రహాల మార్పు వల్ల చాలా అనుకూలంగా ఉంటుది. విద్యార్థులకు ఉన్నత విద్య చదివేందుకు మార్గం సుగమం అవుతుంది. ఈ సమయంలో మీకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. మీకు ఆకస్మిక లభించే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి ఆదాయం పెరగడంతో మనస్సు సంతోషంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగులు కార్యాలయంలో మీ లక్ష్యాలను సాధించడానికి మీకు సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. మీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది. మీ ఆస్తి సంబంధిత విషయాల్లో కూడా సానుకూల ఫలితాలొస్తాయి.

కన్య రాశి..
ఫిబ్రవరిలో ఆరు గ్రహాల మార్పు వల్ల ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో మీరు చాలా శక్తితో నిండి ఉంటారు. మీరు చాలా ఆశాజనకంగా కనిపిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీ వ్యక్తిగత జీవితంలో ప్రేమ, ఆనందం, శుభఫలితాలను పొందుతారు. మరోవైపు మీ కుటుంబ సమస్యలలో పరిష్కారం లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు విజయం లభిస్తుంది. మీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మీ ప్రియమైన వారితో మంచి సమయాన్ని గడుపుతారు.

మకర రాశి..
వచ్చే నెలలో గ్రహాల మార్పు వల్ల ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో మీ తోబుట్టువులతో మంచి సమయాన్ని గడుపుతారు. ఆధ్యాత్మికత వైపు మీకు ఆసక్తి పెరుగుతుంది. మీ మనస్సు మతపరమైన పనుల్లో నిమగ్నమై ఉంటుంది. మీరు ప్రభుత్వ పథకాల ప్రయోజనాన్ని అందుకుంటారు. మీ నైపుణ్యాలను మెరుగుపరచుకుంటారు. భవిష్యత్తులో మీ అనుభవాల జ్ణానం మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధం బలంగా ఉంటుంది. మీ పిల్లలు ప్రయోజకులు అవ్వడంతో మీరు చాలా సంతోషిస్తారు.

కుంభ రాశి..
ఆరు గ్రహాల మార్పు వల్ల ఈ రాశి వారికి ఊహించని ఫలితాలు ఎదురవుతాయి. మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఉద్యోగులకు ఈ సమయంలో పదోన్నతి లభించే అవకాశం ఉంటుంది. మీరు అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఆర్థిక పరంగా మాత్రం కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. మరోవైపు వివాహితులకు ఈరోజు కొన్ని అవకాశాలు లభిస్తాయి. వ్యాపారులకు ఈ సమయం అద్భుతమైన అవకాశాలు వస్తూనే ఉంటాయి. నిరుద్యోగుల ఉద్యోగ అన్వేషణ పూర్తవుతుంది. మీరు ఆకస్మిక ప్రయోజనాలను పొందుతారు. భవిష్యత్తును ప్రకాశవంతంగా మార్చుకునేందుకు మీరు చాలా ప్రభావవంతంగా పనిచేస్తారు.



Click it and Unblock the Notifications