Latest Updates
-
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే.. -
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్! -
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.! -
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి -
వయసు పైబడితేనే అల్జీమర్స్ వస్తుందా.. మతిమరుపునకు దారితీసే ప్రమాదకర కారకాలివే.! -
ఉద్యోగం వదిలి వ్యాపారం చేస్తే... ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
నాన్‌వెజ్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వెజ్ ప్రియుల కోసం స్పెషల్ లివర్ ఫ్రై.. రెస్టారెంట్ టేస్ట్‌తో.! -
అమ్మమ్మల నాటి చిట్కా..గ్యాస్, ఎసిడిటి,అజీర్తి సమస్యలకు చెక్! -
కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? అయితే నీరసం రానివ్వని ఈ సగ్గుబియ్యం వడలు ట్రై చేయండి! -
పెళ్లిళ్లు, పండుగల్లో అమ్మాయిలూ జాగ్రత్త.. మెహందీ పెట్టుకుంటే పొట్ట ఇన్ఫెక్షన్ల ప్రమాదం.!
Planets Transit in january 2022:జనవరిలో 4 గ్రహాల రవాణాతో ఈ రాశులకు అద్భుత ఫలితాలు...!
జనవరి నెలలో నాలుగు గ్రహాలు తమ స్థానాన్ని మార్చుకోనున్నాయి. ఈ సందర్భంగా ఈ రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ రాశులేవో చూడండి.
Planets Tranist in January 2022: మరికొద్ది నిమిషాల్లో మనమంతా 2021 సంవత్సరానికి గుడ్ బై చెప్పబోతున్నాం. అదే సమయంలో 2022 కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం.

ఈ నేపథ్యంలో జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, జనవరి నెలలో నాలుగు పెద్ద గ్రహాలు తమ స్థానాలను మార్చుకోనున్నాయి. కొన్ని నేరుగా ప్రయాణం చేయనుండగా.. మరికొన్ని గ్రహాలు తిరోగమనం చెందనున్నాయి. ఇలా గ్రహాలు ఒక నిర్దిష్ట వ్యవధిలో ఒక రాశి నుండి మరొక రాశికి మారనున్నాయి. ఈ గ్రహాల సంచారం చాలా ముఖ్యమైన సంఘటనగా పరిగణించబడుతుంది.

జనవరి నెలలో నాలుగు గ్రహాలు తమ స్థానాలను మార్చుకోవడం వల్ల రాశిచక్రాలపై కచ్చితంగా ప్రభావం పడుతుంది. అయితే ఈ నాలుగు గ్రహాల మార్పు వల్ల కొన్ని రాశుల వారికి శుభ ప్రదమైన ఫలితాలు రానున్నాయట. ఈ సందర్భంగా ఏయే గ్రహాలు తమ స్థానాలను మార్చుకోనున్నాయి. ఏ రాశుల వారికి శుభ ఫలితాలొస్తాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఏయే గ్రహాలంటే..
జనవరి నెలలో మొత్తం నాలుగు గ్రహాలు తమ స్థానాలను మారనున్నాయి. అందులో ప్రధానమైన గ్రహాలు సూర్యుడు, అంగారకుడు, శుక్రుడు మరియు బుధ గ్రహాలు ఉన్నాయి.

మకరంలోకి సూర్యుడు..
సూర్యుడు ధనస్సు రాశి నుండి మకరరాశిలోకి జనవరి 14వ తేదీ మధ్యాహ్నం 2:43 గంటలకు ప్రవేశించనున్నాడు. ఇదే రాశిలో 13 ఫిబ్రవరి 2022న తెల్లవారుజామున 03:41 వరకు ఈ రాశిలో నివాసం ఉండనున్నాడు. ఇలా సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోకి మారితే సంక్రాంతి అని అంటారు. సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి అని అంటారు. హిందూ పంచాంగం ప్రకారం, ఈ సమయం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈరోజున ఉదయాన్నే లేచి స్నానం చేస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుంది చాలా మంది నమ్ముతారు.

ధనస్సులోకి అంగారకుని సంచారం..
16 జనవరి 2022న శనివారం సాయంత్రం 4:50 గంటలకు అంగారకుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇదే రాశిలో 26 ఫిబ్రవరి 2022 సాయంత్రం 4:08 గంటల వరకు కుజుడు ఇదే రాశిలో నివాసం ఉండనున్నాడు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, అంగారకుడిని కోపం, యుద్ధం, క్రీడలు, భూమి, రక్తం మొదలైన వాటికి కారకంగా పరిగణిస్తారు. మేషరాశి మరియు వృశ్చికరాశికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు. ధనస్సు రాశిలోకి కుజుడు రవాణా చేసే సమయంలో కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి.

శుక్రుని సంచారం..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శుక్రుడిని సంపద, ఐశ్వర్యం మరియు అన్ని రకాల భౌతిక ఆనందాలను ఇచ్చే శుక్రగ్రహం 29 జనవరి 2022న శనివారం మధ్యాహ్నం 02:14 గంటలకు సంచారం చేయనున్నాడు. శుక్రుడు 41 రోజుల పాటు సంచార స్థితిలో ఉంటాడు. ప్రస్తుతం, శుక్రుడు ధనస్సులో తిరోగమన స్థితిలో ఉన్నాడు.

ఈ రాశులకు సానుకూల ఫలితాలు..
ఈ నాలుగు గ్రహాల రవాణా వల్ల మేష రాశి వారికి అద్భుతమైన ఫలితాలు రావొచ్చు. ఆంగ్ల నూతన సంవత్సరం తొలి నెలలో మీకు అద్భుతంగా ఉంటుంది. మిధున రాశి ఉద్యోగులకు జనవరి నెలలో ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపించొచ్చు. విద్యార్థులు ఉన్నత విద్యలో మంచి ఫలితాలను సాధిస్తారు. ఇదే సమయంలో సింహ రాశి మరియు కన్య రాశి వారికి మంచిగా ఉంటుంది. పని ప్రదేశంలో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, జనవరి నెలలో నాలుగు గ్రహాలు తమ స్థానాన్ని మారనున్నాయి. ముందుగా జనవరి 14వ తేదీన సూర్యుడు ధనస్సు రాశి నుండి మకరరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఆ తర్వాత బుధుడు మకరంలోకి తిరోగమనం చెందనున్నాడు. ధనస్సు రాశిలోకి అంగారకుడు, శుక్రుడు ధనస్సు రాశిలోకి తిరోగమనం చెందనున్నాడు.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, జనవరి నెలలో నాలుగు పెద్ద గ్రహాల మార్పుతో ఐదు రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఆ రాశుల వివరాలు ఇలా ఉన్నాయి. 1. మేషరాశి 2. మిధున రాశి 3.సింహ రాశి 4.కన్య రాశి



Click it and Unblock the Notifications