Latest Updates
-
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే..
Rashi Parivartan 2022: మే మాసంలో 4 గ్రహాల రవాణాతో ఈ రాశులకు అద్భుత ప్రయోజనాలు...!
2022 సంవత్సరంలో మే నెలలో 4 గ్రహాల రవాణా వల్ల ఈ రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయట. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవ గ్రహాలు మానవ జీవితంపై కచ్చితంగా ప్రభావం చూపుతాయి. ఏప్రిల్ నెలలో మొత్తం తొమ్మిది గ్రహాలు రవాణా చేయగా.. మే మాసంలో నాలుగు గ్రహాలు తమ స్థానాలను మారనున్నాయి.

సూర్యుడు, అంగారకుడు(కుజుడు), బుధుడు మరియు శుక్రుడు ఒక రాశి నుండి మరో రాశిలోకి సంచారం చేయనున్నాయి. ఈ సందర్భంగా ఏయే గ్రహాలు ఎప్పుడు మారనున్నాయి.. ఈ రాశి చక్రాల రవాణా వల్ల కొన్ని రాశుల వారికి ఆర్థిక, మానసిక సమస్యలు ఎదురుకావొచ్చు. మరి కొందరికి శుభ ఫలితాలు రావొచ్చు. ఈ సందర్భంగా 2022 సంవత్సరంలో మే నెలలో నాలుగు గ్రహాల రవాణా కారణంగా ద్వాదశ రాశులలోని కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయట. ఆ రాశుల జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...

స్థానాలు మారే గ్రహాలివే..
2022 సంవత్సరంలో మే నెలలో ముందుగా చంద్రుడు ఒకటిన్నర రోజులో తన స్థానాన్ని మారనున్నాడు. సూర్యుడు ప్రతి ఒక్క నెలలో తన స్థానం మారుతూ ఉంటాడు. ఏప్రిల్ 14 నుండి మేషరాశిలో సంచారం ప్రారంభించాడు.
మే 14వ తేదీ వరకు ఇదే రాశిలో ఉండి.. అనంతరం మే15వ తేదీన వృషభరాశిలోకి సంచారం చేయనున్నాడు. కుజుడు మే17వ తేదీన మీనరాశిలోకి సంచారం చేయనున్నాడు. ఇదే రాశిలో జూన్ 27 వరకు నివాసం ఉండనున్నాడు. అనంతరం బుధుడు మే 10వ తేదీన తిరోగమనం చెందనున్నాడు. జూన్ 3న సరైన మార్గంలో ప్రయాణించనున్నాడు. శుక్రుడు మే 23వ తేదీన మీనరాశిని వదిలి మేషరాశిలో సంచారం చేయనున్నాడు. ఈ సందర్భంగా ఏయే రాశులపై ఎలాంటి ప్రభావం పడుతుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

కన్య రాశి..
ఈ రాశి వారికి గ్రహాల మార్పు కారణంగా శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి. ఈ నెలలో శని మార్పు లేనందున శని భగవానుడి ప్రభావం పెద్దగా ఉండదు. ఎందుకంటే శని గ్రహం జూన్ 5న కుంభరాశిలో తిరోగమనం చెంది, 13 జులై 2022న తిరిగి మకరంలోకి ప్రవేశం చేయనున్నాడు. ఈ కాలంలో మీరు పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా కొన్ని ప్రయోజనాలు రావొచ్చు.

తుల రాశి..
ఈ రాశి వారికి మే మాసంలో నాలుగు గ్రహాల సంచారం కారణంగా అద్భుత ప్రయోజనాలు రావొచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. మీకు పదోన్నతి గురించి కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. ఆదాయ పరంగా మెరుగ్గా ఉంటుంది. అయితే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మకర రాశి..
ఈ రాశి వారికి మే నెలలో నాలుగు గ్రహాల రవాణా సమయంలో మంచి ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో శని మార్పు లేనందున, ఈ రాశి వారికి సానుకూల వాతావరణం ఉంటుంది. ఈ కాలంలో మీరు కొన్ని శుభవార్తలను వింటారు. మీ ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. ఆదాయ పరంగా శుభప్రదంగా ఉంటుంది.

మీన రాశి..
ఈ రాశి వారికి మే నెలలో నాలుగు గ్రహాల సంచారం కారణంగా శుభ ఫలితాలు రానున్నాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్త వినిపిస్తుంది. ముఖ్యంగా శుక్రుని రవాణా వల్ల ఈ రాశి వారికి అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ కాలంలో మీరు క్లిష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేస్తారు.
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన సమచారం ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఇవ్వడం జరుగుతుంది. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.
2022 సంవత్సరంలో మే మాసంలో మొత్తం నాలుగు గ్రహాలు తమ స్థానాలను మారనున్నాయి. ఏప్రిల్ నెలలో మొత్తం తొమ్మిది గ్రహాలు రవాణా చేయగా.. మే మాసంలో సూర్యుడు, అంగారకుడు(కుజుడు), బుధుడు మరియు శుక్రుడు ఒక రాశి నుండి మరో రాశిలోకి సంచారం చేయనున్నాయి.



Click it and Unblock the Notifications