Latest Updates
-
ఉద్యోగం వదిలి వ్యాపారం చేస్తే... ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
నాన్‌వెజ్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వెజ్ ప్రియుల కోసం స్పెషల్ లివర్ ఫ్రై.. రెస్టారెంట్ టేస్ట్‌తో.! -
అమ్మమ్మల నాటి చిట్కా..గ్యాస్, ఎసిడిటి,అజీర్తి సమస్యలకు చెక్! -
కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? అయితే నీరసం రానివ్వని ఈ సగ్గుబియ్యం వడలు ట్రై చేయండి! -
పెళ్లిళ్లు, పండుగల్లో అమ్మాయిలూ జాగ్రత్త.. మెహందీ పెట్టుకుంటే పొట్ట ఇన్ఫెక్షన్ల ప్రమాదం.! -
ఉప్మా తినడం ఇష్టం లేని వారికి రవ్వతో ఇలా చేసి పెట్టండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.! -
జన్మాష్టమి రోజు ద్వాపర యుగం నాటి అరుదైన సంఘటన.. ఈ ఐదు రాశుల వారిపై కృష్ణయ్య కటాక్షం.! -
వంట చేసే ఓపిక లేదా? కేవలం 10 నిమిషాల్లో ఈ పచ్చిమిర్చి నువ్వుల రైస్ చేసి చూడండి, టేస్ట్ అదుర్స్! -
కుజ-గురు కలయికతో ద్విద్వాదశ యోగం..ఈ 4 రాశులకు అడుగడుగునా అదృష్టమే! -
దక్షిణ భారతదేశంలో అతిపెద్ద జిల్లా ఏదో తెలుసా?.. 90% మంది తప్పుగానే చెప్తారు!
Rahu-Ketu Transit in 2022:రాహు కేతుల రవాణాతో ఈ 5 రాశులకు నష్టాలు...పాటించాల్సిన పరిహారాలు..
రాహూ-కేతుల రవాణా సమయంలో రాశిచక్రాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ప్రకారం నవ గ్రహాల మార్పు మానవ జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఒక గ్రహం ఒక రాశి నుండి మరో రాశిలోకి మారినప్పుడు లేదా మరో గ్రహంలోకి చేరినప్పుడు అది మన జాతకాలపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది.

ఇలా గ్రహాల సంచారం జరిగినప్పుడు కొందరికి సానుకూల ఫలితాలు వస్తాయి.. మరికొందరికి ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఈ నేపథ్యంలోనే రాహువు, కేతువు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటూ ఏకకాలంలో రాశిచక్రాల్లో మారుతూ ఉంటాయి. 2022 సంవత్సరంలో ఏప్రిల్ 12న మేషరాశిలో సంచారం చేయనున్నాడు.

ఈ కాలంలో మేషరాశిని కుజుడు పాలించనున్నాడు. అదే రోజు కేతువు శుక్రుడు పాలించే తులరాశిలో సంచారం చేయనున్నాడు. ఈ రెండు రాశులలో సుమారు 18 నెలల పాటు రాహువు, కేతువు నివాసం ఉండనున్నారు. ఈ సమయంలో కొన్ని రాశుల వారిపై ప్రతికూల ఫలితాలు ఏర్పడనున్నాయి.. మరికొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా ఏయే రాశుల వారిపై ఎలాంటి ఫలితాలు పడతాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి వారు రాహు, కేతువుల రవాణా సమయంలో ఇతరులతో రిలేషన్ షిప్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. భవిష్యత్తులో మీరు ఆర్థికంగా కఠిన పరిస్థితులను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి.

తుల రాశి..
ఈ రాశి నుండి రాహువు ఏడో స్థానంలోను, కేతువు తొలి స్థానంలో సంచరిస్తారు. ఈ కాలంలో తుల రాశి వారు ఆర్థిక పరమైన విషయాల్లో, ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే రిలేషన్ షిప్ విషయంలో కూడా మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి.

ధనస్సు రాశి..
ఈ రాశి వారికి రాహు, కేతువుల రవాణా వల్ల ప్రతికూల ఫలితాలు ఎదురుకావొచ్చు. ఈ కాలంలో మీరు భవిష్యత్తు గురించి ఆందోళన చెందొచ్చు. ఈ కాలంలో మీరు అనవసరమైన ఖర్చు చేయాల్సి వస్తుంది. అలాగే జర్నీ చేసే సమయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏవైనా ముఖ్యమైన పనులుంటే వాయిదా వేసుకోవాలి. ఆర్థిక పరమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి.

మకర రాశి..
ఈ రాశి నుండి రాహు-కేతువులు నాలుగు, పదో పాదం గుండా ప్రయాణించనున్నారు. ఈ నేపథ్యంలో కేతువు రవాణా ఈ రాశి వారికి సానుకూల ఫలితాలను తీసుకొస్తుంది. కానీ రాహు రవాణా మాత్రం ప్రతికూల ఫలితాలను తీసుకురావచ్చు. మొత్తానికి ఈ కాలంలో మకర రాశి వారికి కుటుంబ జీవితంలో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మీకు ఆరోగ్య పరమైన ఇబ్బందులు రావొచ్చు.

మీన రాశి..
ఈ రాశి వారికి రాహు-కేతుల సంచారం వల్ల ప్రతికూల ఫలితాలే ఎదురవుతాయి. ఈ కాలంలో మీరు ఆర్థిక పరమైన సమస్యలను ఎదుర్కోవచ్చు. ఆరోగ్య పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

పాటించాల్సిన పరిహారాలు..
ఈ 5 రాశుల వారు రాహు-కేతువుల ప్రతికూల ప్రభావాల నుండి ఉపశమనం పొందాలంటే కొన్ని పరిహారాలను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ లైఫ్ స్టైల్ ను కొంత మార్చుకోవాలి. ప్రతిరోజూ యోగా చేయాలి. అలాగే ఉదయాన్నే స్నానం చేసిన అనంతరం తులసి ఆకులను తినాలి. చందన తిలకాన్ని క్రమం తప్పకుండా వాడాలి. మరోవైపు మాంసం, ఫాస్ట్ ఫుడ్, ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి. మీ ఇష్ట దైవాన్ని తలచుకుంటూ మంత్రాలను జపించడం వల్ల, మీకు రాహు, కేతువుల నుండి సానుకూల శక్తి లభిస్తుంది. ఇలా చేయడం వల్ల మీ జీవితం గాడిన పడే అవకాశం ఉంది. పైన ఉన్న ఐదు రాశులు మినహా మిగిలిన ఏడు రాశుల వారికి సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
రాహువు, కేతువు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటూ ఏకకాలంలో రాశిచక్రాల్లో మారుతూ ఉంటాయి. 2022 సంవత్సరంలో ఏప్రిల్ 12న మేషరాశిలో సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మేషరాశిని కుజుడు పాలించనున్నాడు. అదే రోజు కేతువు శుక్రుడు పాలించే తులరాశిలో సంచారం చేయనున్నాడు. ఈ రెండు రాశులలో సుమారు 18 నెలల పాటు రాహువు, కేతువు నివాసం ఉండనున్నారు. ఈ సమయంలో కొన్ని రాశుల వారిపై ప్రతికూల ఫలితాలు ఏర్పడనున్నాయి.. మరికొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి.



Click it and Unblock the Notifications