Latest Updates
-
పెళ్లిళ్లు, పండుగల్లో అమ్మాయిలూ జాగ్రత్త.. మెహందీ పెట్టుకుంటే పొట్ట ఇన్ఫెక్షన్ల ప్రమాదం.! -
ఉప్మా తినడం ఇష్టం లేని వారికి రవ్వతో ఇలా చేసి పెట్టండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.! -
జన్మాష్టమి రోజు ద్వాపర యుగం నాటి అరుదైన సంఘటన.. ఈ ఐదు రాశుల వారిపై కృష్ణయ్య కటాక్షం.! -
వంట చేసే ఓపిక లేదా? కేవలం 10 నిమిషాల్లో ఈ పచ్చిమిర్చి నువ్వుల రైస్ చేసి చూడండి, టేస్ట్ అదుర్స్! -
కుజ-గురు కలయికతో ద్విద్వాదశ యోగం..ఈ 4 రాశులకు అడుగడుగునా అదృష్టమే! -
దక్షిణ భారతదేశంలో అతిపెద్ద జిల్లా ఏదో తెలుసా?.. 90% మంది తప్పుగానే చెప్తారు! -
Jeera Biscuits Recipe:హెల్తీ, టేస్టీ జీరా బిస్కెట్స్..బేకరీని మించిన రుచితో ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
బ్రకోలీ, బాదంతో సూపర్ హెల్తీ పాస్తా..రుచి చూస్తే వదిలిపెట్టరు! -
3 నిమిషాల మ్యాజిక్..ఈ చిన్న పనితో 13 రకాల క్యాన్సర్లకు చెక్! -
ఈ ఐదు లక్షణాలు ఉంటే మీ భర్త బంగారమే.. మరి మీవారిలో ఈ గుణాలు ఉన్నాయా.?
Rahu-Ketu transit 2022:రాహు, కేతుల సంచారంతో ఈ రాశుల వారికి ఎన్ని కష్టాలంటే...!
రాహు, కేతుల సంచారంతో ఈ రాశుల వారికి చాలా కష్టాలు రానున్నాయి.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాల మార్పు అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే గ్రహాల స్థానచలనం వల్ల మన జీవితాలపై ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలోనే సుదీర్ఘ కాలం తర్వాత అంటే దాదాపు 18 నెలల తర్వాత ఏప్రిల్ 12వ తేదీన తర్వాత రాహు, కేతువులు తమ స్థానాలను మారనున్నాయి.

ముఖ్యంగా ఏప్రిల్ నెలలో చాలా గ్రహాలు మారనున్నాయి. శని, గురువు మరియు రాహు-కేతువులు సుదీర్ఘ విరామం తర్వాత తమ స్థానాలను మారనున్నాయి.

రాహు-కేతువులు 18 నెలల తర్వాత రాశిని మారబోతున్నారు. ఏప్రిల్ 12వ తేదీన రాహు-కేతువుల సంచారం జరగనుంది. సాధారణంగా ఈ రెండు గ్రహాలను నీడ గ్రహాలుగా పరిగణించబడతాయి. ఇవి ఎల్లప్పుడూ తిరోగమన కదలికలో రవాణా చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో రాహువు మేష రాశిలోకి, కేతువు తులారాశిలోకి ప్రవేశించనున్నాయి. ప్రస్తుతం రాహువు వృషభరాశిలో, కేతువు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా రాహు, కేతుల సంచారం వల్ల ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వారికి తీవ్ర కష్టాలు ఎదురుకానున్నాయట. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

వృషభ రాశి..
ఇప్పటికీ రాహువు ఇదే రాశిలో సంచారం చేస్తున్నాడు. ఏప్రిల్ 12వ తేదీన ఈ రాశి నుండి మేష రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఈ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండటం.. రాహువుకు శుక్రుడితో స్నేహ సంబంధం ఉండటం శుభప్రదమే. కానీ రాహువు ఎప్పుడైతే ఈ రాశి నుండి నిష్క్రమిస్తాడో.. అప్పటినుండి వృషభ రాశి వారికి ఆకస్మాత్తుగా నష్టాలు రావొచ్చు. మీ విలాసవంతమైన ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు ఖరీదైన వస్తువును కొనుగోలు చేసేందుకు అడ్డంకులను ఎదుర్కొంటారు. రాహువు ప్రభావం మీపై ఎక్కువగా ఉంటుంది. అబద్ధాలు చెప్పడం మానుకోవాలి.

మిధున రాశి..
ఈ రాశి వారు రాహు కేతుల సంచారం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా డబ్బు మరియు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. మీరు డబ్బును ఆదా చేయడానికి నిర్దిష్ట చర్యలు తీసుకోండి. రుణాలు ఇచ్చే పరిస్థితులను మానుకోండి. మీ అత్తమామలతో సంబంధాలు చెడిపోవచ్చు. ఇతరులను గౌరవించండి. శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు సంయమనంతో పని చేయాల్సి ఉంటుంది. సోమరితం మరియు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. మీరు లక్ష్యాలను ద్రుష్టిలో పెట్టుకోవాలి.

మీన రాశి..
ఈ రాశి వారు రాహు, కేతుల సంచారం సమయంలో ఆర్థిక పరమైన విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీకు విదేశీ పరిచయాల వల్ల లాభాలు రావొచ్చు. ఈ కాలంలో మీరు ఎక్కువ జర్నీ చేయొచ్చు. మీకు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి ఉన్నట్లయితే, దాన్ని తీవ్రంగా పరిగణించాలి. మీరు పరిశుభ్రత నియమాలను పాటించాలి. తప్పుడు వ్యక్తుల సహవాసం మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టొచ్చు. అంతేకాదు మీకు ఆకస్మికంగా నష్టాలు రావొచ్చు. మీ జీవిత భాగస్వామ్యంతో వివాదాలు రావొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
గమనిక : ఇక్కడ అందించిన సమాచారం కేవలం ఊహాలు మరియు జ్యోతిష్యశాస్త్రంపైనే ఆధాపడి ఉంటుంది. ఈ సమాచారానికి బోల్డ్ స్కై తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. మీరు ఏదైనా సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు, మీరు వ్యక్తిగతంగా జ్యోతిష్యశాస్త్ర నిపుణుడిని సంప్రదించి, నిర్ణయం తీసుకోగలరు.
2022 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో చాలా గ్రహాలు మారనున్నాయి. శని, గురువు మరియు రాహు-కేతువులు సుదీర్ఘ విరామం తర్వాత తమ స్థానాలను మారనున్నారు. రాహు-కేతువులు 18 నెలల తర్వాత రాశిని మారబోతున్నారు. ఏప్రిల్ 12వ తేదీన రాహు-కేతువుల సంచారం జరగనుంది. సాధారణంగా ఈ రెండు గ్రహాలను నీడ గ్రహాలుగా పరిగణించబడతాయి. ఇవి ఎల్లప్పుడూ తిరోగమన కదలికలో రవాణా చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో రాహువు మేష రాశిలోకి, కేతువు తులారాశిలోకి ప్రవేశించనున్నాయి. ప్రస్తుతం రాహువు వృషభరాశిలో, కేతువు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు.



Click it and Unblock the Notifications