Rahu Ketu Transit 2022 :18 నెలల తర్వాత రాహు మేషంలోకి.. కేతువు తులరాశిలోకి సంచారం.. 12 రాశులపై పడే ప్రభావం...!

2022లో ఏప్రిల్ 12న రాహువు మేషరాశిలో మరియు కేతువు తులరాశిలో సంచారం వల్ల 12 రాశిచక్రాలపై ఎలాంటి ప్రభావం పడనుందో ఇప్పుడు తెలుసుకుందాం.

వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాల మార్పు అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే గ్రహాల స్థానచలనం వల్ల మన జీవితాలపై ప్రభావం పడుతుంది.

Rahu Ketu Transit 2022: Rahu In Aries And Ketu In Libra Know Effects on all 12 Zodiac Signs in Telugu

ఈ నేపథ్యంలోనే 2022 సంవత్సరంలో అనేక గ్రహాలు మార్పు చెందనున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో చాలా గ్రహాలు మారనున్నాయి. శని, గురువు మరియు రాహు-కేతువులు సుదీర్ఘ విరామం తర్వాత తమ స్థానాలను మారనున్నారు.

Rahu Ketu Transit 2022: Rahu In Aries And Ketu In Libra Know Effects on all 12 Zodiac Signs in Telugu

రాహు-కేతువులు 18 నెలల తర్వాత రాశిని మారబోతున్నారు. ఏప్రిల్ 12వ తేదీన రాహు-కేతువుల సంచారం జరగనుంది. సాధారణంగా ఈ రెండు గ్రహాలను నీడ గ్రహాలుగా పరిగణించబడతాయి. ఇవి ఎల్లప్పుడూ తిరోగమన కదలికలో రవాణా చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో రాహువు మేష రాశిలోకి, కేతువు తులారాశిలోకి ప్రవేశించనున్నాయి. ప్రస్తుతం రాహువు వృషభరాశిలో, కేతువు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా రాహు, కేతుల సంచారం వల్ల ద్వాదశ రాశులపై ఎలాంటి ప్రభావం పడుతుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..

మేష రాశి..

2022 సంవత్సరంలో ఏప్రిల్ 12వ తేదీన రాహువు ఇదే రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారు ఆర్థిక పరంగా అద్భుత ఫలితాలను పొందుతారు. కేతువు ఏడో స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో ఆకస్మిక నష్టాలు ఎదురవుతాయి. ప్రేమికులకు మాత్రం ప్రతికూలంగా ఉంటుంది.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి నుండి రాహువు 12వ పాదంలో సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీకు శుభ ఫలితాలు రావొచ్చు. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మరోవైపు కేతువు ఆరో పాదంలో సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీకు కోర్టు కేసులు మరియు రహస్య శత్రువుల నుండి మీకు ఇబ్బంది కలగొచ్చు. మీ పోటీదారులు మీపై ఆధిపత్యం చెలాయిస్తారు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి నుండి రాహువు 11వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో మీకు కెరీర్ పరంగా మంచిగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు శుభ ఫలితాలొస్తాయి. మరోవైపు కేతువు 5వ స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో కొంత ఇబ్బందిగా ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితంలోనూ సమస్యలు వస్తాయి.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి నుండి రాహువు 10వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకునేవారు విజయం సాధించొచ్చు. మీడియా రంగంలో వారికి అనుకూలంగా ఉంటుంది. మరోవైపు 4వ స్థానంలో కేతువు సంచారం కారణంగా, మీకు కుటుంబ జీవితంలో కొంత ఇబ్బందిగా ఉంటుంది.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి నుండి రాహువు 9వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో విదేశీ ప్రయాణం మరియు విదేశాల్లో చదువుకోవాలనే కోరిక నెరవేరకపోవచ్చు. ఆర్థిక పరంగా కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. కేతువు మూడో స్థానం రవాణా చేయడం వల్ల ఈ రాశి వారికి పని విషయంలో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి నుండి రాహువు 8వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీ కుటుంబ జీవితంలో కొంత ఇబ్బందిగా ఉండొచ్చు. మీకు ఆకస్మిక ఆదాయం లభిస్తుంది. మరోవైపు కేతువు రెండో ఇంట్లో సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో ఆదాయ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్య పరంగా ప్రతికూలంగా ఉంటుంది.

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి నుండి రాహువు 7వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో వ్యాపారులకు శుభ ఫలితాలు రావొచ్చు. విదేశీ పరిచయాలు, విదేశీ ప్రయాణాల వల్ల లాభాలొస్తాయి. ఆర్థిక పరంగా బాగుంటుంది. మరోవైపు కేతువు ఇదే రాశిలో అడుగు పెట్టడం వల్ల ఈ రాశి సానుకూల ఫలితాలొస్తాయి. అయితే ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి నుండి రాహువు 6వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు కేసులలో కూడా గెలుస్తారు. రాజకీయాల్లో ఉండే వారికి విజయం లభిస్తుంది. వైద్య రంగంలో ఉండే వారికి శుభ ఫలితాలొస్తాయి. మరోవైపు కేతువు 12వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. దీంతో మీరు అధిక ఆదాయం పొందుతారు. మరోవైపు ఆధ్యాత్మిక కార్యాలపై ఆసక్తి చూపుతారు.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి నుండి రాహువు 5వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీకు ఆదాయం మరియు ఆనందం పెరిగే అవకాశం ఉంది. అయితే గర్భిణులకు కొన్ని సమస్యలు ఎదురుకావొచ్చు. కేతువు 11వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి నుండి రాహువు 4వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీకు చాలా విషయాల్లో గందరగోళంగా ఉంటుంది. మీ కుటుంబంలో కూడా కొందరికి ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. మరోవైపు మీరు కొత్త వాహనం కొనొచ్చు లేదా కొత్త ఆస్తిని కూడా కొనుగోలు చేయొచ్చు. కేతువు 10వ స్థానం రవాణా చేయడం వల్ల ఈ రాశి వారికి కొన్ని కొత్త అవకాశాలు వస్తాయి. అయితే పనిభారం కూడా పెరుగుతుంది.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి నుండి రాహువు 3వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీకు ప్రజాదరణ లభిస్తుంది. మీ కెరీర్లో మంచి ప్రమోషన్ లభిస్తుంది. కేతువు 9వ స్థానం నుండి రవాణా చేయడం వల్ల ఈ రాశి వారికి ఆధ్యాత్మిక కార్యాలపై ఆసక్తి పెరుగుతుంది. మీరు యోగా మరియు ధ్యానం వంటివి చేస్తారు. ఇవి మిమ్మల్ని ప్రమాదం మరియు సంఘర్షణ నుండి కాపాడతాయి.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి నుండి రాహువు 2వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీకు ఆర్థిక పరంగా చాలా ముఖ్యమైనది. మీకు ఎక్కువ లాభాలు రావొచ్చు. అయితే మీ కుటుంబ జీవితంలో కొన్ని మానసిక ఒత్తిళ్లు ఉంటాయి. కేతువు 8వ స్థానంలో రవాణా చేయడం వల్ల, శుభ ఫలితాలొస్తాయి. విదేశీ ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా ఈరోజు మీరు చాలా శ్రద్ధ వహించాలి.

FAQs
2022లో రాహు-కేతువులు ఎప్పుడు సంచారం చేయనున్నాయి?

2022 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో చాలా గ్రహాలు మారనున్నాయి. శని, గురువు మరియు రాహు-కేతువులు సుదీర్ఘ విరామం తర్వాత తమ స్థానాలను మారనున్నారు. రాహు-కేతువులు 18 నెలల తర్వాత రాశిని మారబోతున్నారు. ఏప్రిల్ 12వ తేదీన రాహు-కేతువుల సంచారం జరగనుంది. సాధారణంగా ఈ రెండు గ్రహాలను నీడ గ్రహాలుగా పరిగణించబడతాయి. ఇవి ఎల్లప్పుడూ తిరోగమన కదలికలో రవాణా చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో రాహువు మేష రాశిలోకి, కేతువు తులారాశిలోకి ప్రవేశించనున్నాయి. ప్రస్తుతం రాహువు వృషభరాశిలో, కేతువు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు.

BoldSky Lifestyle

Desktop Bottom Promotion