Latest Updates
-
3 నిమిషాల మ్యాజిక్..ఈ చిన్న పనితో 13 రకాల క్యాన్సర్లకు చెక్! -
ఈ ఐదు లక్షణాలు ఉంటే మీ భర్త బంగారమే.. మరి మీవారిలో ఈ గుణాలు ఉన్నాయా.? -
కర్ణాటక స్పెషల్ వాంగి బాత్ పొడి..ఒక్కసారి చేస్తే 4 నెలలు నిల్వ..బోర్ కొట్టించే కూరలు కూడా అమృతమైపోతాయ్.. -
కృష్ణాష్టమి స్పెషల్: చిన్ని కన్నయ్యకి ఎంతో ప్రీతికరమైన అటుకుల లడ్డూ.. చక్కెర లేకుండా భలే రుచిగా.! -
పుట్టుకతోనే అదృష్టవంతులు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాజ యోగం ఉన్న రాశులు ఇవే! -
కృష్ణాష్టమి స్పెషల్..కన్నయ్యకు అత్యంత ఇష్టమైన ధనియాల పంజిరి ఎలా చేసుకోవాలంటే.. -
జ్వరం వచ్చినప్పుడు త్వరగా కోలుకోవాలంటే ఏం తినాలి? ఏం తినకూడదు? -
వంకాయ వండటం ఓ కళ.. అయ్యంగార్ స్టైల్ లో ఇలా చేస్తే రుచికి ఎవరైనా దాసోహం అవ్వాల్సిందే! -
పేరెంట్స్ రిచ్ అయితే జెన్ జెడ్ చెడుదారులు పడుతుందా.. వైరల్ పోస్ట్‌పై చర్చ.! -
కన్నయ్య కరుణ: శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు నుంచి ఈ రాశులకు కుబేర యోగమే!
శని దేవుడు ఆవిర్భావంతో ఈ రాశులకు రాజయోగం రానుందట... ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి...
శని దేవుడు ఉదయించడం వల్ల ఈ 4 రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు రానున్నాయట.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో శని దేవునికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఎవరి జాతకంలో అయితే శని దేవుని అనుగ్రహం ఉంటుందో వారికి రాజయోగం పడుతుందని జ్యోతిష్యశాస్త్ర పండితులు చెబుతారు.

గ్రహాలలో అన్ని గ్రహాల కన్నా, శని దేవుని ప్రయాణం చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఒక రాశి నుండి మరో రాశికి మారేందుకు సుమారు రెండున్నరేళ్లు సమయం పడుతుంది. అలాగే శని గ్రహం ఆవిర్భవించిన తర్వాత కూడా మానవుల జీవితంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.

గత నెల అంటే ఫిబ్రవరి 24వ తేదీన శనిదేవుడు ఉదయించాడు. ఇలా శనిదేవుని ఆవిర్భావం తర్వాత, ద్వాదశ రాశులలోని కొన్ని రాశుల వారికి రాజయోగం ఏర్పడబోతోంది. ముఖ్యంగా వ్యాపారంలో మరియు రాజకీయాలలో ప్రత్యేక విజయాన్ని పొందొచ్చు. మీ పెండింగ్ పనులన్నీ పూర్తవ్వొచ్చు. దీర్ఘకాలిక వ్యాధుల నుండి విముక్తి పొందొచ్చు. ఈ సందర్భంగా శని దేవుడు ఉదయించడం వల్ల ఏ రాశి వారికి రాజయోగం ఏర్పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి నుండి శని దేవుడు 10 స్థానం నుండి ఉదయించాడు. ఈ కాలంలో మీరు మీ పనులపై పూర్తి శ్రద్ధ చూపుతారు. మీకు అప్పగించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. రాజకీయాల్లో ఉన్నవారు ఎన్నికల్లో గెలుపొందొచ్చు లేదా రాజకీయాల్లో పెద్ద పదవులు చేపట్టొచ్చు. వ్యాపారంలో ఉన్న వారికి లాభ, వ్యయ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో సంబంధం సాఫీగా ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు కూడా లభిస్తాయి. మీ లక్ష్యాలు కూడా నెరవేరొచ్చు. ప్రస్తుతం ఉద్యోగం చేసే వారు ప్రమోషన్ పొందే అవకాశాలను పొందొచ్చు. మీ జీవిత భాగస్వామితో సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది.

వృషభం
ఈ రాశి నుండి తొమ్మిదో స్థానం నుండి శని దేవుడు ఉదయించాడు. ఈ సమయంలో వృత్తిపరమైన విషయాలలో అన్ని పనులు పూర్తి నిబద్ధతతో పూర్తి చేస్తారు. కార్యాలయంలో ప్రమోషన్ మరియు ఇతర ప్రయోజనాలకు అవకాశం లభిస్తుంది. కొత్త ఉద్యోగాలు కూడా లభించే అవకాశం ఉంది. వ్యాపారులకు ఎక్కువ లాభం రావొచ్చు. ఆర్థిక పరంగా, అదృష్టవంతులు మరియు ఎక్కువ పొదుపు చేసే అవకాశం ఉంది. చమురు, పెట్రోలియం, మైనింగ్ మరియు ఇనుము సంబంధిత పరిశ్రమలలో పని చేయడం వల్ల గొప్ప ప్రయోజనాలు పొందొచ్చు. రాజకీయాల్లో ఉన్నవారు విజయం సాధిస్తారు. మీ జీవిత భాగస్వామితో అనుబంధం మధురంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈ కాలంలో మంచిగా ఉంటుంది. ఈ కాలంలో మీరు ఆర్థిక పరమైన ప్రయోజనాలను కూడా పొందుతారు. చాలా డబ్బును ఆదా చేసుకునే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో మాధుర్యం పెరుగుతుంది.

సింహ రాశి..
ఈ రాశి నుండి శని దేవుడు ఆరో స్థానం నుండి ఉదయించనున్నాడు. ఈ కారణంగా మీరు మీ ప్రయత్నాలలో విజయం సాధించాలని నిర్ణయించుకోవాలి. కార్యాలయంలో కొత్త ఉద్యోగావకాశాలను పొందడం ద్వారా మీరు విజయం సాధిస్తారు. వ్యాపారులకు మంచి లాభదాయకంగా ఉంటుంది. రాజకీయాల్లో ఉన్న వారు గెలుస్తారు. మీరు స్టాక్ మార్కెట్లో డబ్బును పెట్టుబడి పెట్టాలనుకుంటే, పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. ప్రయాణాలు మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడపడానికి అవకాశాలను అందిస్తాయి. ఇది మీ బంధాన్ని బలపరుస్తుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ భాగస్వామితో గొప్ప సమయాన్ని గడపొచ్చు. ఇది మీ బంధాన్ని బలపరుస్తుంది. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృశ్చిక రాశి..
ఈ రాశి నుండి మూడో స్థానం నుండి శని ఉదయించాడు. ఈ కాలంలో మీరు స్వీయ అభివృద్ధిపై ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు. మీరు మీ జీవితంలో కొత్త మార్పులను చూస్తారు. మీరు కార్యాలయంలో మెరుగైన పనితీరు కనబరుస్తారు. మీరు పని కారణంగా దూర ప్రయాణాలు చేస్తారు. మీ వ్యాపారం విదేశాలకు సంబంధించినది అయితే, మీరు ఎక్కువ లాభం పొందుతారు. రాజకీయ నాయకులు ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications