For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Real life Kumbhkarna: కలియుగ కుంభకర్ణ..! ఏడాదికి ఏకంగా 300 రోజులు నిద్రలోనే...!

రాజస్థాన్ కు చెందిన ఓ వ్యక్తి వింత జబ్బుతో బాధపడుతూ ఏకంగా 300 రోజుల నిద్రపోతున్నాడట. ఆ వివరాలేంటో మీరే చూడండి.

|

పురాణాల్లో మీరు కుంభకర్ణుడి గురించి వినే ఉంటారు. కుంభకర్ణుడు అంటేనే ఆరు నెలలు నిద్రలో ఉంటాడని.. మరో ఆరు నెలలు తిండి తింటూనే ఉంటాడని మన పెద్దలు చెబుతుంటారు.

Rajasthan Man Sleeps For 300 Days a Year Due to Rare Disorder

తన ఆకలి తీరిన వెంటనే నిద్రలోకి జారుకుంటాడు. రామాయణంలో యుద్ధం సమయంలో కుంభకర్ణుడిని నిద్ర లేపడానికి భటులు ఎంతలా కష్టపడతారో మనం ఇది వరకే పౌరాణిక సినిమాల్లో చూసే ఉంటాం.

Rajasthan Man Sleeps For 300 Days a Year Due to Rare Disorder

ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నామంటే.. ప్రస్తుత కలియుగంలో కూడా ఓ కుంభకర్ణుడు ఉన్నాడు. అయితే తన లాగా ఆరు నెలలు తిండి తినలేడు కానీ.. ఆరు నెలల కంటే ఎక్కువగానే నిద్రపోతాడట. ఏడాదిలో ఏకంగా 300 రోజులు నిద్రలోనే ఉంటాడట. ఇంతకీ అతనెవరు.. ఎందుకని అన్నిరోజులు నిద్రపోతాడనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Sirisha Bandla:అంతరిక్ష యానాన్ని అలవోకగా పూర్తి చేసిన తెలుగమ్మాయి శిరీష...Sirisha Bandla:అంతరిక్ష యానాన్ని అలవోకగా పూర్తి చేసిన తెలుగమ్మాయి శిరీష...

నిద్ర లేకపోతే..

నిద్ర లేకపోతే..

ఈ లోకంలో పుట్టిన ప్రతి జీవికి గాలి, నీరు, తిండి ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే అవసరం. మన బాడీని రీఛార్జ్ చేసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం ఒక్కరోజు నిద్ర లేకుంటే అస్సలు తట్టుకోలేం. మన బాడీలో కూడా ఎన్నో మార్పులు జరుగుతాయి. దీని ప్రభావంతో మన ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అందుకే ప్రతి ఒక్కరూ రోజులో కనీసం ఎనిమిది గంటలైనా నిద్రపోవాలని నిపుణులు చెబుతుంటారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఇదే విషయాన్ని చెబుతోంది.

ఆధునిక కాలంలో..

ఆధునిక కాలంలో..

అయితే నేటి తరం ప్రజలు ఈ ఆధునిక కాలంలో నిద్ర సమయాన్ని క్రమంగా తగ్గించేస్తున్నారు. వారి ఉద్యోగం, వ్యాపారం వంటి వాటిపై ఫోకస్ పెడుతున్న వారు నిద్రకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఎనిమిది గంటలు నిద్రపోవడానికి చాలా మందికి సమయం సరిపోవడం లేదు. అయితే కొందరు ఎక్కువ సమయం నిద్రపోతుంటే మాత్రం వారిని కుంభకర్ణుడితో పోలుస్తుంటారు.

రాజస్థాన్ లో కలియుగ కుంభకర్ణుడు..

రాజస్థాన్ లో కలియుగ కుంభకర్ణుడు..

అయితే నేటి భారతంలోనూ కూడా ఓ కుంభకర్ణుడు ఉన్నాడు. తను కుంభకర్ణుడి కంటే ఎక్కువ రోజులు నిద్రలోనే గడిపేస్తాడట. రాజస్థాన్ కి చెందిన పూర్ఖారామ్ అనే వ్యక్తి ఏడాదిలో ఏకంగా 300 రోజుల పాటు నిద్రపోతూనే ఉంటాడట. తనకు అతి నిద్ర అనే అలవాటు 23 ఏళ్ల క్రితం మొదలైందట. మొదట్లో 18 గంటలు నిద్రలో ఉండేవాడట.

Planets Snuggle: ఆకాశంలో మళ్లీ అద్భుతం... శుక్రుడు, అంగారకుడి కలయికను నేరుగా చూడొచ్చట...!Planets Snuggle: ఆకాశంలో మళ్లీ అద్భుతం... శుక్రుడు, అంగారకుడి కలయికను నేరుగా చూడొచ్చట...!

వారానికోసారి..

వారానికోసారి..

ఆ తర్వాత ఐదు రోజులు లేదా వారానికోసారి నిద్ర లేచేవాడట. ప్రస్తుతం నెలలో ఏకంగా 20 నుండి 25 రోజుల పాటు నిద్రలోనే గడిపేస్తున్నాడట. ఎందుకంటే ఎప్పుడైనా నిద్ర మేల్కొని ఏదైనా పని చేయాలంటే తన బాడీ అస్సలు కోఆపరేట్ చేయదట.

ఎంతమంది డాక్టర్లకు చూపినా..

ఎంతమంది డాక్టర్లకు చూపినా..

ఇలా సంవత్సరంలో ఏకంగా 300 రోజులు నిద్రలోనే గడుపుతున్నట్లు పూర్ఖారామ్ ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై తన భార్య లిచ్మిదేవి కూడా బాధపడుతోంది. తన భర్త అనారోగ్యం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది. ఎంతమంది డాక్టర్లకు చూపించినా ఈ సమస్యకు పరిష్కారం దొరకడం లేదని చెప్పింది.

హైపర్ సోమ్నియా..

హైపర్ సోమ్నియా..

అయితే ఈ వ్యాధిని హైపర్ సోమ్నియాగా వైద్యులు తేల్చేశారు. ఈ వ్యాధికి సంబంధించి సరైన చికిత్స అందించలేకపోతున్నారట. ఈ సమస్య కారణంగా పుర్ఖారామ్ ను చుట్టుపక్కల ఉండే ప్రజలంతా కలియుగ కుంభకర్ణుడు అని పిలుస్తున్నారట.

English summary

Rajasthan Man Sleeps For 300 Days a Year Due to Rare Disorder

Here we are talking about the rajasthan man sleeps for 300 days a year due to rare disorder. Have a look
Story first published:Wednesday, July 14, 2021, 11:59 [IST]
Desktop Bottom Promotion