For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Raksha Bandhan 2021:రాఖీ పండక్కి.. రాశి చక్రం ప్రకారం అక్కా చెల్లెళ్లకి ఇలాంటి గిఫ్టులిచ్చేయండి...!

|

రక్షా బంధన్ (Raksha Bandhan), రాఖీ(Rakhi), రఖ్రీ పేర్లు వేరైనా సోదరీ, సోదరుల మధ్య ఉన్న అనుబంధాన్ని తెలిపే ఈ పండుగకు మన దేశంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. అన్నా చెల్లెలు, అక్కా తమ్ముడు మధ్య ఉన్న ఆప్యాయత, ప్రేమకు ఈ పండుగ ప్రతీకగా నిలుస్తోంది.

తమ సోదరుల సంరక్షణ, క్షేమం కోరుతూ ప్రతి ఒక్క అక్కాచెల్లి వారి చేతికి రాఖీ కడతారు. అదే సమయంలో ఎలాంటి కష్టమొచ్చినా నేనున్నానే భరోసా ఇస్తాడు సోదరుడు. రాఖీ పండుగ వస్తోందంటే చాలు.. అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్లలో ఏదో తెలియని ఉత్సాహం, సంతోషం కనిపిస్తాయి.

శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఈ రాఖీ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది 2021 ఆగస్టు 22వ తేదీన ఈ పండుగ వచ్చింది. ఈ సందర్భంగా రాఖీ పండుగ రోజు మీ సోదరికి లేదా సోదరుడికి జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మీ రాశి చక్రాన్ని బట్టి ఎలాంటి బహుమతులు (Gifts)ఇవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం...

Mars Combust 2021:కుజుడు కనుమరుగు కావడంతో ఈ రాశులపై తీవ్ర ప్రభావం...!

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి వారు అంగారక గ్రహం ద్వారా ప్రభావితమవుతారు. కాబట్టి మీ సోదరీమణుల కోసం మీరు జింక్ మెటల్ లేదా రెడ్ కలర్ డ్రస్ లేదా ఇతర లోహ వస్తువులతో తయారు చేసిన వస్తువులను బహుమతి ఇవ్వొచ్చు. అదే సమయంలో బహుమతులను స్వీకరించొచ్చు.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి వారిపై శుక్రుడు ప్రత్యేక ప్రభావం చూపుతాడు. అందువల్ల ఈ రాశి వారు తెల్లని రంగులో ఉండే బహుమతులను ఇవ్వాలి. దీంతో పాటు మీ సామర్థ్యం మేరకు వెండితో చేసిన వాటిని కూడా ఇవ్వొచ్చు. మీ సోదరీమణులకు పట్టు వస్త్రాలు మరియు పాలరాతి కలర్లో ఉండే డ్రస్ కూడా గిఫ్టుగా ఇవ్వొచ్చు.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి మిధున రాశి వారు పచ్చని రంగులో ఉండే వస్తువులను బహుమతిగా ఇవ్వాలి. మీ సోదరికి గ్రీన్ కలర్ డ్రెస్ కూడా గిఫ్టుగా ఇవ్వొచ్చు.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారిపై చంద్రుడు ప్రభావం చూపుతాడు. కాబట్టి ఈ రాశి వారు తెల్లని స్వీట్లను కూడా బహుమతిగా ఇవ్వొచ్చు. ఇది కాకుండా మీ సోదరికి వెండి, ముత్యాలు లేదా ఏవైనా ఇతర తెల్ల వస్తువులను గిఫ్టుగా ఇవ్వొచ్చు.

Importance of Bangles for Women:మహిళలు మట్టిగాజులు వేసుకోవడం వెనుక ఉన్న రీజన్స్ ఏంటో తెలుసా...

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు. అంతేకాదు ప్రస్తుతం ఇదే రాశిలోనే సూర్యుడు కూడా సంచరిస్తున్నాడు. కాబట్టి ఈ రాఖీ పండక్కి మీ సోదరీమణులకు పసుపు లేదా కుంకుమ రంగులో ఉండే బహుమతులను ఇస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే మీ సామర్థ్యం మేరకు బంగారాన్ని కూడా బహుమతిగా ఇవ్వొచ్చు. అలాగే కుంకుమ రంగు స్వీట్లు తినిపిస్తే, మీ ఇద్దరి బంధం మరింత బలోపేతం అవుతుంది.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారికి బుధుడు ప్రభావం చూపుతాడు. ఒకరు సోదరికి పచ్చని ఉంగరం, మంచి పుస్తకం, వినాయకుని విగ్రహం ఇవ్వొచ్చు. ఇది కాకుండా, మీకు కావాలంటే, మీరు మీ సోదరికి ఇష్టమై గ్రీన్ కలర్ డ్రస్ గిఫ్టుగా ఇవ్వొచ్చు.

మీ భవిష్యత్తు మెరుగవ్వాలంటే.. ఈ వాస్తు చిట్కాలను ఫాలో అవ్వండి...

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి వారిపై శుక్ర గ్రహం ప్రభావం చూపుతుంది. కాబట్టి మీరు మీ సోదరీమణులకు వెండి ఆభరణాలు లేదా పట్టు వస్త్రాలు బహుమతులుగా ఇవ్వాలి. దీని వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి ఈ సారి రాఖీ పండక్కి మీ సోదరీమణులకు రెడ్ కలర్ డ్రస్సును గిఫ్టుగా ఇవ్వొచ్చ. అలాగే రాగితో చేసిన వస్తువులను కూడా బహుమతిగా ఇవ్వొచ్చు. దీంతో పాటు బూందీ లడ్డూ తినిపించాలి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు. ఈ సమయంలో మీ సోదరీమణులకు కుంకుమ రంగులో ఉండే బట్టలను బహుమతిగా ఇవ్వొచ్చు. మీరు మీ సోదరి కోసం పసుపు రంగు వస్తువులను కూడా గిఫ్టుగా ఇవ్వొచ్చు.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారికి శని దేవుడిని అధిపతిగా పరిగణిస్తారు. కాబట్టి ఈ రాశి వారు తమ సోదరీమణులకు మొబైల్ లేదా ఇతర గ్యాడ్జెట్ లేదా ఏదైనా ఇతర లోహ వస్తువులను బహుమతిగా ఇవ్వొచ్చు. దీంతో పాటు ఇనుముతో చేసిన ఏదైనా వస్తువును వారి అవసరం మేరకు ఇవ్వొచ్చు.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారికి కూడా శని దేవుడు అధిపతిగా ఉంటాడు. ఈ రాశి సోదరీమణులకు నల్లని రంగులో వస్తువులను మాత్రమే బహుమతిగా ఇవ్వాలి. ఇలా ఇస్తే మంచి ఫలితాలు రావొచ్చు. దీంతో పాటు ఒక విద్యుత్ కు సంబంధించిన వస్తువులను కూడా గిఫ్టుగా ఇవ్వొచ్చు.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి మీ సోదరమీణులకు ఏదైనా ఇత్తడి వస్తువును బహుమతిగా ఇస్తే శుభప్రదంగా ఉంటుంది. అలాగే పసుపు రంగు డ్రస్సులను, వారు ఎక్కడికైనా ప్రయాణించేందుకు ఒక మంచి ప్యాకేజీని కూడా ఇవ్వొచ్చు.

English summary

Raksha Bandhan 2021:Rakhi Gifts According To Sister's Zodiac Sign

Here we are talking about the Raksha Bandhan 2021:Rakhi gifts according to sister's zodiac sign. Have a look
Desktop Bottom Promotion