For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Raksha Bandhan 2021:మీ సోదరునికి ఎలాంటి రాఖీ సూటవుతుందో తెలుసా...

|

ఈ ప్రపంచంలో అన్నాచెల్లెళ్లు.. అక్కాతమ్ముడి మధ్య బంధం కంటే ఏది గొప్పది కాదు. చిన్నప్పుడు పదే పదే గొడవపడినా.. ప్రతి విషయంలో తామే ముందుండాలని వాదులాడినా.. వారి మధ్య ప్రేమ ఎప్పటికీ తగ్గదు.

అలాంటి ప్రేమను చాటి చెప్పేందుకు చేసుకునే పవిత్రమైన పండుగ రాఖీ పౌర్ణమి. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా తనకు తోడుగా ఉండాలని కోరుకుంటూ.. తన రక్షణ, సంరక్షణను ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్క సోదరీమణి తమన సోదరులకు రాఖీ కట్టడం మనం చూస్తు ఉంటాం.

అంతేకాదు సోదరుడుకి కట్టే రాఖీ వల్ల తను ఆరోగ్యంగా ఉండాలని.. తాను చేపట్టినా ఏ ప్రయత్నంలోనైనా విజయం సాధించాలని కోరుకుంటూ ఉంటాం. ఇదిలా ఉండగా.. ఈ రాఖీ పండక్కి మీ సోదరునికి ఎలాంటి రాఖీ కడితే బాగుంటుంది. మీ సోదరుని చేతికి ఎలాంటి రాఖీ సూటవుతుంది.. మార్కెట్లో దొరికే వేల కొద్దీ రాఖీల్లో ఏది కడితే తనకు లక్ కలిసిసోస్తుంది.. వీటి గురించి మన పురాణాలు ఏమి చెబుతున్నాయి.. ఇప్పట్లో వీటిని ఫాలో అయ్యే వారు ఇంకా ఉన్నారా లేదా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఈ రాఖీ పండక్కి మీ సోదరులకు రాశిచక్రం ప్రకారం ఎలాంటి రాఖీ కట్టాలో తెలుసా..

రియల్ హీరో రాఖీ..

రియల్ హీరో రాఖీ..

మీ సోదరుడు మీకు వ్యక్తిగతంగా గార్డియన్ గా.. సంరక్షకుడిగా.. ప్రతి విషయంలోనూ మద్దతుగా నిలుస్తూ.. మిమ్మల్ని ఎల్లవేళలా ప్రోత్సహిస్తూ.. మీ కష్టాలను తొలగించే ప్రయత్నం చేసే వారైతే.. వారికి మీరు అందమైన ‘రియల్ హీరో' ట్యాగ్ ఉండే రాఖీని కట్టొచ్చు.

బ్రో సిస్టర్ కోడ్ రాఖీ..

బ్రో సిస్టర్ కోడ్ రాఖీ..

మీ అన్న లేదా తమ్ముడు అయినప్పటికీ చిన్నప్పటి నుండి ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడం.. మీ రహస్యాలను ఎవ్వరితో చెప్పకుండా కేవలం వారికే చెప్పడం.. మీకు వారు అత్యంత నమ్మకస్తులుగా అనిపించడం.. మీరు వారిని బాగా నమ్ముతున్నట్లయితే.. అలాంటి సోదరులకు బ్రో సిస్టర్ కోడ్ ఉండే రాఖీ కట్టొచ్చు. దీని వల్ల మీ ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది.

కళావలి రాఖీ..

కళావలి రాఖీ..

రాఖీ అంటే రక్షణకు చిహ్నం. పురాణాలలో రాఖీ కోసం ముడి నూలు ప్రస్తావన ఉంది. ఇది ఒక ముడి కాటన్ థ్రెడ్. ఇది ఏదైనా మతపరమైన కార్యక్రమంలో రక్షా మంత్రాన్ని పఠించేటప్పుడు సోదరుని మణికట్టు మీద కట్టాలి. మతపరమైన కోణంలో చూసినప్పుడు ఉత్తమ రక్షణ సూర్యుడు అంటే రాఖీ, కాబట్టి రక్షాబంధన్ రోజున సోదరుల చేతికి కళావలి రాఖీని కట్టాలి.

పట్టు రాఖీ..

పట్టు రాఖీ..

ప్రస్తుతం మార్కెట్లో వేల రకాల ప్లాస్టిక్, ఇతర రకాల దారాలతో రాఖీలు వచ్చేశాయి. కానీ పట్టు దారంతో చేసిన రాఖీ చాలా ఉత్తమమని.. ఇది చాలా ప్రకాశవంతంగా మరియు అందంగా కనిపిస్తుందని పండితులు చెబుతున్నారు. పట్టు అనేది పవిత్రమైన అంశంగా పురాణాలలో పేర్కొనబడింది.తులసి ఆకు ఎప్పటికీ ఎంత పరిశుభ్రంగా ఉంటుందో.. పట్టు కూడా ఎల్లప్పుడూ అంతే స్వచ్ఛమైనదిగా పరిగణించబడుతుంది. అందుకే పట్టుతో చేసిన రాఖీ చాలా మందికి పవిత్రమైనది. సోదర, సోదరీమణుల మధ్య ప్రేమలో స్వచ్ఛతకు ఇది చిహ్నంగా పరిగణించబడుతుంది.

ఉన్ని రాఖీ..

ఉన్ని రాఖీ..

ఈరోజుల్లో ఉన్నితో చేసిన రాఖీలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. పురాణాలలో ఉన్ని రాఖీ గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. ఉన్ని కూడా స్వచ్ఛమైనదిగా పరిగణించబడుతున్నప్పటికీ, ఉన్నిని ఎక్కువగా పూజల్లో ఉపయోగిస్తారు. అయితే ఉన్ని రాఖీని కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రమే వాడతారు.

మెటల్ రాఖీ..

మెటల్ రాఖీ..

ప్రస్తుత రోజుల్లో బంగారం మరియు వెండి రాఖీలు కూడా బాగా ప్రాచుర్యం పొందాయి. మెటల్ రాఖీలు కూడా స్వచ్ఛమైనవిగా పరిగణించబడతాయి. ఎందుకంటే ఇవి కడితే.. ప్రతి సంవత్సరం మార్చాల్సిన అవసరం లేదు. ఒకసారి తయారు చేసిన ఈ రాఖీని మీరు ప్రతి సంవత్సరం ధరించవచ్చు. అయితే మెటల్ రాఖీ కంటే సిల్క్ రాఖీ ఇంకా మంచిది.

పబ్ జీ రాఖీ..

పబ్ జీ రాఖీ..

మీ సోదరులకు గేమ్స్ అంటే బాగా ఇష్టమైతే.. వారికి మీరు ఫన్నీగా పబ్ జీ రాఖీ కట్టొచ్చు. ఎందుకంటే ఈ గేమ్ అతి తక్కువ సమయంలో అత్యంత ఎక్కువగా ఆదరణ పొందింది. ఈ రాఖీ కడితే.. తను గేమ్ ఆడేటప్పుడల్లా మీరే గుర్తొస్తారు. మిమ్మల్ని బాగా గుర్తుంచుకుంటారు.

నెంబర్ 1 రాఖీ..

నెంబర్ 1 రాఖీ..

మీ సోదరుడు మీకు కుటుంబసభ్యులు, బెస్ట్ ఫ్రెండ్ కంటే ఎక్కువ అయితే.. తను మీ ఆల్ టైమ్ ఫేవరెట్ అయితే.. తనను సర్ ప్రైజ్ చేయడానికి Bro #1Rakhiని కట్టేయండి. ఇది తనకు మంచి రిస్ట్ లాగా కనిపించాలి. మీకు తెలిసిన ప్రపంచంలో తనే నెంబర్ అని సూచించేలా రాఖీ కట్టేయండి.

English summary

Raksha Bandhan 2021: Types of Rakhi that are Perfect for Your Brother in Telugu

Here are the types of rakhi that are perfect for your brother in Telugu. Have a look
Desktop Bottom Promotion