For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Rakshabandhan 2021 : మీ రాశిని బట్టి మీ సోదరుడికి ఏ రంగు రాఖీని కట్టాలో తెలుసా...

రాఖీ పౌర్ణమి నాడు మీ సోదరులకు ఏ రంగు రాఖీ కడితే మంచి ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

|

మన దేశంలో హిందూ క్యాలెండర్ ప్రకారం, శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున రక్షా బంధన్ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.ఈ ఏడాది 2021లో ఆగస్టు 22వ తేదీన ఆదివారం నాడు ఈ పండుగ వచ్చింది. రాఖీ అంటే 'రక్షణ' అని అర్థం. 'రక్ష' అంటే రక్షించడం, 'బంధన్' సూత్రం కట్టడం అని అర్థం. సోదరీమణులందరూ తమ సోదరలు ఏ పని చేసినా అందులో విజయం దక్కాలని, తమ సోదరుడు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరుకుంటూ సన్నటి దారాన్ని ఎర్రటి తోరణానికి చుట్టి రాఖీని తయారు చేసి, వారి చేతులకు కడతారు.

Rakshabandhan 2020: Know which color rakhi is lucky for your brother

అయితే ఇదంతా ఒకప్పుడు. మరిప్పుడు చాలా మంది మహిళలు తమ అన్నదమ్ములకు రంగు రంగుల కడుతున్నారు. ఈ ఏడాది కరోనా సమయంలోనూ కలర్ ఫుల్ రాఖీలు కట్టాలని తహతహలాడుతున్నారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే ఏ కలర్ రాఖీ మీ సోదరుడికి సూట్ అవుతుందో తేల్చుకోలేకపోతున్నారా? అయితే అందుకు జ్యోతిష్యశాస్త్రం సహాయపడుతుంది. మీ రాశి చక్రం ఆధారంగా మీ సోదరుడికి ఏ రంగు రాఖీ కట్టాలో తెలియజేస్తోంది. దీని వల్ల మీకు, మీ సోదరులకు అనేక ప్రయోజనాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీ రాశిని బట్టి ఏ కలర్ రాఖీ కట్టాలో ఇప్పుడే తెలుసుకోండి...

 Raksha Bandhan 2020 : రాఖీ పౌర్ణమి వెనుక అన్ని కథలు ఉన్నాయా? Raksha Bandhan 2020 : రాఖీ పౌర్ణమి వెనుక అన్ని కథలు ఉన్నాయా?

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి వారు మీ సోదరులకు ఎరుపు, ఆరెంజ్ లేదా బంగారు రంగులతో కూడిన రాఖీని కట్టాలి. దీని వల్ల మీకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి వారు తమ సోదరులకు వెండి, నీలం లేదా బాదామి రంగులో ఉండే రాఖీని కడితే శుభప్రదమైన ఫలితాలు వస్తాయి. మీరు కూడా వెండి రాఖీని ధరించవచ్చు.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి వారు తమ సోదరులకు ఆకుపచ్చ రంగులో ఉండే రాఖీని కడితే మంచిగా ఉంటుంది.

ఏఏ రాశి చక్రాలవారు ఏవిధంగా రహస్యాలను కాపాడుకుంటారో చూడండి...ఏఏ రాశి చక్రాలవారు ఏవిధంగా రహస్యాలను కాపాడుకుంటారో చూడండి...

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారు తమ అన్నదమ్ములకు ముత్యాల రాఖీని కడితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ప్రకాశవంతమైన మరియు తేలికపాటి రంగులో ఉండే రాఖీలను కడితే శుభప్రదంగా ఉంటుంది.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారు తమ సోదరులకు ఆరెంజ్, బంగారు లేదా పసుపు రంగులో ఉండే రాఖీలను కడితే మీకు అనుకూలంగా ఉంటుంది.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారు వారి సోదరులకు ఆకుపచ్చ లేదా రమా ఆకుపచ్చ రంగులో ఉండే రాఖీలను కట్టాలి.

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి వారు తమ అన్నదమ్ములకు డైమండ్ రంగు ఉండే రాఖీని కడితే మంచి ప్రయోజనం ఉంటుంది.

వృశ్చికరాశి..

వృశ్చికరాశి..

ఈ రాశి వారు రక్షా బంధన్ సందర్భంగా తమ సోదరులకు మెజెంటా, పింక్ లేదా ఆరెంజ్ రంగుంలో ఉండే రాఖీలను కట్టొచ్చు.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి వారు తమ అన్నదమ్ములకు ప్రకాశవంతమైన పసుపు రంగులో ఉండే రాఖీని కడితే అద్భుతమైన ఫలితం ఉంటుంది.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారు రక్షా బంధన్ రోజున తమ సోదరులకు పర్పుల్, ముదురు గులాబీ లేదా ముదురు నీలం రంగుంలో ఉండే రాఖీని కట్టాలి.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారు రాఖీ పౌర్ణమి రోజున తమ సోదరులకు నీలి రుంగులో ఉండే రాఖీని కడితే ప్రయోజనాలు లభిస్తాయి.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి వారు శ్రావణ మాసంలో వచ్చే రాఖీ పౌర్ణమి పండుగ రోజున తమ సోదరులకు కుంకుమ, పసుపు లేదా ఎరుపు రంగులో రాఖీ కడితే మీకు, మీ సోదరులకు శుభప్రదమైన ఫలితాలు లభిస్తాయి.

English summary

Rakshabandhan 2020: Know which color rakhi is lucky for your brother

Before you tie a Rakhi on your brother’s wrist check if the color of the thread you use is right for his zodiac sign.
Desktop Bottom Promotion