zodaic signs :ఈ రాశుల వారు ప్రేమకు ప్రాధాన్యత ఇస్తారు.. కానీ మధ్యలో బ్రేకప్ చెప్పేస్తారట..!

రొమాన్స్ మధ్యలో వదిలేసే రాశిచక్రాలేవో చూద్దాం.

ప్రేమ అనే రెండక్షరాలకు ఎంతో పవర్ ఉంది. అంతటి శక్తివంతమైన ప్రేమను పొందాలని చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే కొందరు మాత్రమే ప్రేమలో సక్సెస్ అవుతారు.

Ranked : Zodiac Signs Who Are Most Likely to Run Away From Love

ప్రేమలో పడిన వారు ఈ లోకాన్నే మరచిపోతారు. అంతేకాదు వారు చాలా ఆత్మవిశ్వాసంతో చురుకుగా ఉంటారు. మరికొందరు ప్రేమ విషయంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతారు.

Ranked : Zodiac Signs Who Are Most Likely to Run Away From Love

ఇంకా కొందరు ప్రేమలో పడిన తర్వాత అనేక కారణాల వల్ల బ్రేకప్ చెప్పుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఏ రాశి వారు ఎక్కువగా ప్రేమను దూరం చేసుకుంటారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి వారికి ప్రేమ విషయంలో ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది. అయితే వీరు ఎవరితో అయినా చాలా త్వరగా లవ్ లో పడిపోతారు. కానీ అంతే స్పీడుగా బ్రేకప్ చెప్పి భాగస్వామికి దూరమైపోతారు.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి వారు ప్రేమ విషయంలో చాలా క్లారిటీతో ఉంటారు. కానీ వీరు తమ లైఫ్ పార్ట్ నర్ విషయంలో తప్పులు చేస్తుంటారు. ఎక్కువగా ఎవరైతే ఛీటింగ్ చేస్తారో.. వారినే గుడ్డిగా ప్రేమిస్తారు. దీంతో చాలా సమస్యలను ఎదుర్కొంటారు.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి వారు మల్టీ టాలెంట్ కలవారు. వీరు ఎక్కువగా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడతారు. అయితే పార్ట్ నర్ విషయంలో వీరు చాలా క్లారిటీతో ఉంటారు. తమ భాగస్వామి తమకు సూట్ కాదనుకుంటే చాలు ఏ పరిస్థితుల్లో అయినా వదిలేసి వెళ్తారు.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారు ప్రేమ విషయంలో చాలా మంచిగా ఉంటారు. వీరు తమ భాగస్వామిని ప్రేమించడాన్ని బాగా ఇష్టపడతారు. వీరు లైఫ్ పార్ట్ నర్ కు ఎక్కువ విలువ ఇస్తారు. అయితే వీరిని మోసం చేస్తున్నారని తెలిస్తే మాత్రం.. వెంటనే వారిని వదులుకుంటారు.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారు రొమాన్స్ ను బాగా ఇష్టపడతారు. అయితే ఆ కార్యాన్ని మధ్యలోనే వదిలేస్తూ భాగస్వామిని నిరుత్సాహ పరుస్తారు. అయితే వీరికి పొగడ్తలంటే బాగా ఇష్టం. వీరిని ఎల్లప్పుడు మెచ్చుకుంటూ ఉండాలి. లేదంటే చాలా బాధపడతారు. అంతేకాదు తాము ఏ పని చేసినా అందులో తప్పు జరగదని భావిస్తారు. అందుకే వీరిని ప్రేమించే వారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారు రిలేషన్ షిప్ విషయంలో చాలా భయపడుతూ ఉంటారు. వీరి వల్ల ఎవరైనా ఇబ్బంది పడితే అస్సలు తట్టుకోలేరు. అందుకే వీరు ప్రేమకు దూరంగా ఉండాలని భావిస్తారు. వీరిది చాలా సున్నితత్వ మనసు. అయితే ఆ విషయం బయటపడకుండా చూసుకుంటారు.

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి వారు ఎప్పుడూ తమ భాగస్వామితో కలిసి ఉండాలని కోరుకుంటారు. వీరు సింగిల్ గా ఉండటాన్ని అస్సలు ఇష్టపడరు. వీరు తమ భాగస్వామిని దూరం చేసుకుంటే.. వెంటనే మరో పార్ట్ నర్ ను వెతుక్కుంటారు.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి వారు లవ్ లైఫ్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే తమ ప్రేమ విషయంలో మాత్రం చాలా కండిషన్లు పెట్టుకుంటారు. వీరికి అన్ని విధాలా తగిన జోడి అని నమ్మకం కుదిరితేనే వారిని ప్రేమిస్తారు. అలాంటి వారితో లైఫ్ లాంగ్ హ్యాపీగా జీవించొచ్చని భావిస్తారు.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి వారు తమ భాగస్వామితో రొమాన్స్ చేయడాన్ని బాగా ఇష్టపడతారు. అయితే రిలేషన్ లో నిబద్ధత విషయానికొస్తే మాత్రం దూరంగా వెళ్లిపోతారు. కానీ వీరికి నచ్చిన వారిని బాగా ఫ్లర్ట్ చేస్తూ ఉంటారు. వీరు పెళ్లి పేరు చెబితే చాలు భాగస్వామిని దూరం పెట్టేస్తారు.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారికి ఫ్రీడమ్ అంటే చాలా ఇష్టం. అయితే వీరు ఏవేవో పనులు చేయాలని, అందులోనూ తక్కువ సమయంలో ఎక్కువగా చేయాలని కోరుకుంటారు. ముఖ్యంగా లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు. దీనికి ప్రేమ వంటివి అడ్డుగా ఉంటే, దాన్నే వదిలేస్తారు.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారు తమ మనసులోని భావాలను ఇతరులతో షేర్ చేసుకునేందుకు ఆలోచిస్తారు. వీరు ప్రత్యేక ప్రపంచంలో జీవించాలని కోరుకుంటారు. తమ ఫీలింగ్స్ ను ఎవ్వరికీ చెప్పరు. రొమాన్స్ కు చాలా దూరంగా ఉంటారు. అయితే వీరు ఒక్కసారి తమ భాగస్వామితో బంధం ఏర్పరచుకుంటే మాత్రం వారితో లైఫ్ లాంగ్ ఉండేందుకు ఆసక్తి చూపుతారు.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి వారు రొమాన్స్ ను బాగా ఇష్టపడతారు. వీరికి భావోద్వేగ బంధాలంటే బాగా ఇష్టం. వీరు ప్రేమించిన భాగస్వామికి ఎక్కువ విలువనిస్తారు.

Story first published: Thursday, June 24, 2021, 11:51 [IST]
Desktop Bottom Promotion