For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Rare astronomical event :1000 ఏళ్ల తర్వాత ఆకాశంలో అద్భుతం.. ఖగోళంలో నాలుగు గ్రహాల అరుదైన అమరిక...

1000 ఏళ్ల తర్వాత ఏప్రిల్ చివరి వారంలో శుక్రుడు, అంగారకుడు, గురుడు మరియు, శని గ్రహాలు ఒకే దిశలో పయనించనున్నాయి.

|

ఖగోళంలో నాలుగు గ్రహాలు శుక్రుడు, గురుడు, అంగారకుడు, శని కలిసి భూమి నుండి కనిపించే సరళరేఖను ఏర్పరచనున్నాయి. ఇవి సూర్యోదయానికి ఒక గంట ముందు తూర్పు ఆకాశంలో ఒకే సరళ రేఖలో ఉంటాయి.

Rare astronomical event: After 1,000 years : Venus, Jupiter, Saturn, Mars to form straight Line, to be visible from earth

ఇలాంటి సంఘటన ఇంతకు ముందు వెయ్యి సంవత్సరాల క్రితం అంటే క్రీ.శ 947లో చివరిసారిగా జరిగినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. మళ్లీ ఇప్పుడు 2022 సంవత్సరంలో ఏప్రిల్ చివరి వారంలో ఈ నాలుగు గ్రహాలు సరళరేఖగా ఏర్పడనున్నాయి. సరిగ్గా వెయ్యి సంవత్సరాల తర్వాత జరుగుతున్న అరుదైన ఖగోళ సంఘటన ఇది.

Rare astronomical event: After 1,000 years : Venus, Jupiter, Saturn, Mars to form straight Line, to be visible from earth

ఈ నాలుగు గ్రహాలు సూర్యోదయానికి కనీసం ఒక గంట ముందు తూర్పు ఆకాశంలో ఒకే సరళ రేఖలో సమలేఖనం అవుతాయని ప్లానిటోరియం డిప్యూటీ డైరెక్టర్ భువనేశ్వరు సుభేంద్ పట్నాయక్ ఓ ప్రకటనలో తెలిపినట్లు ANI తన నివేదికలో వెల్లడించింది.

Rare astronomical event: After 1,000 years : Venus, Jupiter, Saturn, Mars to form straight Line, to be visible from earth

ఈ సంఘటనను 'ప్లానెట్ పెరేడ్' అని పిలుస్తారు. ఈ పదానికి శాస్త్రీయ నిర్వచనం లేనప్పటకీ, సౌర వ్యవస్థలో గ్రహాలు ఒకే వరుసలో ఉన్నప్పుడు జరిగే సంఘటనను సూచించడానికి, దీన్ని ఖగోళ శాస్త్రంలో దీన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారని పట్నాయక్ వివరించారు.

Solar Eclipse April 2022:సూర్య గ్రహణం వేళ ఆహారంలో తులసిని వాడండి.. గ్రహణ దోషాలను పోగొట్టుకోండి...!Solar Eclipse April 2022:సూర్య గ్రహణం వేళ ఆహారంలో తులసిని వాడండి.. గ్రహణ దోషాలను పోగొట్టుకోండి...!

ప్లానెట్ పెరేడ్ లో మూడు రకాలు..

ప్లానెట్ పెరేడ్ లో మూడు రకాలు..

పట్నాయక్ ‘ప్లానెట్ పెరేడ్'లోని మూడు అత్యంత సాధారణ రకాల గురించి ఇలా వివరించారు. మన సౌర వ్యవస్థ యొక్క విమానం పైన కనిపించే విధంగా సూర్యునికి ఒకవైపున గ్రహాలు వరుసలో ఉన్నప్పుడు మొదటి రకమైన గ్రహ కవాతు అని పట్నాయన్ తెలిపారు.

సూర్యునికి ఒకవైపున మూడు గ్రహాల అమరిక అనేది చాలా సాధారణం. దీన్ని ఏడాది కాలంలో చాలా రోజుల పాటు చూడొచ్చు.

గ్రహాల అమరిక..

గ్రహాల అమరిక..

అదే విధంగా నాలుగు గ్రహాల అమరిక సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరుగుతుంది. అయితే ఐదు గ్రహాలు ప్రతి 19 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే సంభవిస్తాయి. మొత్తం ఎనిమిది గ్రహాల అమరిక దాదాపు 170 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతాయి.

Shukra Gochar 2022:మీనంలోకి శుక్రుని ప్రవేశంతో.. ఈ రాశులకు అద్భుత ప్రయోజనాలు....!Shukra Gochar 2022:మీనంలోకి శుక్రుని ప్రవేశంతో.. ఈ రాశులకు అద్భుత ప్రయోజనాలు....!

ఆకాశంలో వరుసగా..

ఆకాశంలో వరుసగా..

‘‘రెండోది కొన్ని గ్రహాలు వాటి ద్రుశ్యమాన పరిస్థితులతో సంబంధం లేకుండా ఆకాశంలోని చిన్న సెక్టార్లోని ఒకే సమయంలో కనిపించినప్పుడు, భూమి యొక్క కోణం నుండి ఈవెంట్ ను ప్లానెట్ పెరేడ్ గా కూడా పిలుస్తాం. ఈ రకమైన ప్లానెట్ పెరేడ్ చివరిసారిగా ఏప్రిల్ 18న 2002లో ఏర్పడింది. జులై 2020లో సూర్య కుటుంబంలోని అన్ని గ్రహాలు సాయంత్రం ఆకాశంలో వరుసగా ఉన్నాయని, అవి మన కంటికి కనిపించాయని చెప్పారు.

అరుదైన సందర్భాల్లో..

అరుదైన సందర్భాల్లో..

మూడో రకం గ్రహాల కవాతు అరుదైన సందర్భాలలో జరుగుతుంది అన్ని గ్రహాలను లేదా కొన్నింటిని పరిశీలించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు, ఒక సంవత్సరంలో ఏకకాలంలో గమనించడానికి చాలా సందర్భాలు ఉన్నాయి.

2022లో ఏప్రిల్ చివరి వారంలో అరుదైన ఖగోళ సంఘటన అరుదైన సందర్భాలలో జరిగే మూడో రకమైన గ్రహాల కవాతు'' అని పట్నాయక్ వివరించారు.

గ్రహాలు దగ్గరగా..

గ్రహాలు దగ్గరగా..

ఏప్రిల్ 30వ తేదీన అత్యంత ప్రకాశవంతమైన గ్రహాలు శుక్రుడు, గురుడు ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయని, వీటిని మనం చూడొచ్చని, శుక్రుడు గురుడికి దక్షిణంగా 0.2 డిగ్రీల దూరంలో ఉంటాయని చెప్పారు.

FAQ's
  • 2022లో ఎన్ని గ్రహాల కవాతు జరగనుంది?

    ఖగోళంలో నాలుగు గ్రహాలు శుక్రుడు, గురుడు, అంగారకుడు, శని కలిసి భూమి నుండి కనిపించే సరళరేఖను ఏర్పరచనున్నాయి. ఇవి సూర్యోదయానికి ఒక గంట ముందు తూర్పు ఆకాశంలో ఒకే సరళ రేఖలో ఉంటాయి. ఇలాంటి సంఘటన ఇంతకు ముందు వెయ్యి సంవత్సరాల క్రితం అంటే క్రీ.శ 947లో చివరిసారిగా జరిగినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. మళ్లీ ఇప్పుడు 2022 సంవత్సరంలో ఏప్రిల్ చివరి వారంలో ఈ నాలుగు గ్రహాలు సరళరేఖగా ఏర్పడనున్నాయి.

  • ప్లానెట్ పెరేడ్ ఎన్ని రకాలు?

    ప్లానిటోరియం డిప్యూటీ డైరెక్టర్ భువనేశ్వరు సుభేంద్ పట్నాయక్ ప్రకారం, ప్లానెట్ పెరేడ్ లో మూడు రకాలు ఉంటాయి. మన సౌర వ్యవస్థ యొక్క విమానం పైన కనిపించే విధంగా సూర్యునికి ఒకవైపున గ్రహాలు వరుసలో ఉన్నప్పుడు మొదటి రకమైన గ్రహ కవాతు అని పట్నాయన్ తెలిపారు. రెండోది కొన్ని గ్రహాలు వాటి ద్రుశ్యమాన పరిస్థితులతో సంబంధం లేకుండా ఆకాశంలోని చిన్న సెక్టార్లోని ఒకే సమయంలో కనిపించినప్పుడు, భూమి యొక్క కోణం నుండి ఈవెంట్ ను ప్లానెట్ పెరేడ్ గా కూడా పిలుస్తాం.2022లో ఏప్రిల్ చివరి వారంలో అరుదైన ఖగోళ సంఘటన అరుదైన సందర్భాలలో జరిగే మూడో రకమైన గ్రహాల కవాతు' అని పట్నాయక్ వివరించారు.

English summary

Rare astronomical event: After 1,000 years : Venus, Jupiter, Saturn, Mars to form straight Line, to be visible from earth

Rare astronomical event :After 1,000 years a rare and unique astronomical event will take place during April last week, Venus, Mars, Jupiter and Saturn will align in a straight line to be visible from earth. Know more
Story first published:Thursday, April 28, 2022, 13:25 [IST]
Desktop Bottom Promotion