Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
Zodiac Signs:ఏ రాశి వారు ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనుకుంటారో తెలుసా...
ఏ రాశి వారు ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారో ఇప్పుడుతు తెలుసుకుందాం.
ప్రస్తుతం చాలా మంది యువత సింగిల్ గా ఉండేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. 'సోలో బ్రతుకే సో బెటర్' అని పెళ్లి చేసుకోకుండా సింగిల్ కింగుల్లా ఉండాలని భావిస్తున్నారు.

టీనేజీ నుండి హాస్టల్లో ఉండటం లేదా స్నేహితులతో కలిసి ఉండటం వంటివి అలవాటు చేసుకుంటున్నారు. అయితే కొందరు కొన్నాళ్లపాటు పార్ట్ నర్ తో రిలేషన్ షిప్ మెయింటెయిన్ చేసి మళ్లీ సింగిల్ లైఫ్ లోకే వచ్చేస్తున్నారు.

అయితే ఇలా ఎందుకు జరుగుతుంది.. దీని వెనుక ఉన్న కారణాలేంటి.. మీకు ఒంటరిగా ఉండటమే ఎందుకని ఇష్టంగా మారుతుంది.. వీటన్నింటినికీ జ్యోతిష్యశాస్త్రం ద్వారా సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది.

గ్రహాల ఆధారంగా మీ రాశి ప్రకారం మీరు ఎందుకని సోలో లైఫే సో బెటర్ అన్న ఆప్షన్ కు మొగ్గు చూపుతారు.. అందుకు గల కారణాలేంటి అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి వారు ఒకరికోసం భావోద్వేగం చెందడం చాలా తక్కువ సందర్భాల్లోనే జరుగుతుంది. అందువల్ల వీరు ఇతరుల కోసం టైమ్ ను అడ్జస్ట్ చేసుకోవడం అనేది కష్టంగా మారుతుంది. సరైన సమయం ఎంచుకోవడమే మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది. కాబట్టి రిలేషన్ లో రాజీ పడాలంటే వీరికి ఇష్టముండదు. అందుకే వీరు సింగిల్ కింగుల్లా ఉండేందుకు ఆసక్తి చూపుతారు.

వృషభ రాశి..
ఈ రాశి వారు భాగస్వామి విషయంలో చాలా ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుంటారు. వీరు ఊహించుకున్నట్టుగా పార్ట్ నర్ దొరకకపోతే వీరు సింగిల్ గా ఉండేందుకు ప్రియారిటీ ఇస్తారు. ఇలాంటి వారిని మీరు ఒక స్నేహితుడిగా చూడగలరు. కానీ రొమాంటిక్ భాగస్వామిగా ఎప్పటికీ చూడలేరు.

మిధున రాశి..
ఈ రాశి వారు తమకు నచ్చిన భాగస్వామి కోసం అన్వేషించే క్రమంలో వయసు అనేది ఇబ్బందికరమని భావిస్తారు. సరిగ్గా పెళ్లి వయసొచ్చాక.. తాము ఇంకా చిన్నపిల్లలమని అనుకుంటారు. కాస్త వయసు పైబడే సరికి తమ పని అయిపోయిందని.. ఈ వయసులో ప్రేమ, పెళ్లి లభించదని ఫీలవుతారు.

కర్కాటక రాశి..
ఈ రాశి వారు గతంలో జరిగిన విషయాలను గుర్తు పెట్టుకుని.. పెళ్లి విషయంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఎందుకంటే గతంలో వీరి సంబంధాల విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొని ఉంటారు. ఈ కారణం వల్ల వీరు కొత్త రిలేషన్ షిప్ లోకి వెళ్లడానికి భయపడుతూ ఉంటారు.

సింహ రాశి..
ఈ రాశి వారు కొత్త వ్యక్తులను కలవడానికి ఏ మాత్రం మొహమాటపడరు. కానీ వీరు ఎవరితో అయినా డేటింగ్ వెళ్లాలనుకుంటే మాత్రం.. వారి ప్రొఫైల్ ను బట్టి అడుగులు ముందుకు వేయడానికి సందేహిస్తారు. డేటింగ్ సైట్స్ ఆధారంగా కొత్త వ్యక్తులను కలిసేందుకు కొంచెం భయపడతారు. కేవలం చాటింగ్, కాల్స్, వర్చువల్ గా మాట్లాడేందుకే ఇష్టపడతారు.

కన్య రాశి..
ఈ రాశి వారు భాగస్వామి గురించి చాలా ఎక్కువగా ఊహించుకుంటారు. ఇలాంటి ఫీలింగ్స్ వల్ల వీరికి నచ్చిన పార్ట్ నర్ అంతా సులభంగా దొరకదు. పార్ట్ నర్ విషయంలో ఏ మాత్రం రాజీ పడరు. ఈ కారణంగా వీరు ఎక్కువ కాలం సింగిల్ గా ఉండిపోతారు.

తుల రాశి..
ఈ రాశి వారు గతంలో చేసిన కొన్ని పొరపాట్ల వల్ల వీరికి రిలేషన్ షిప్ పై నమ్మకం అనేది ఉండదు. ఈ కారణంగా వీరు సింగిల్ గా ఉండేందుకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. ఇలా చేయడం వల్ల తమ వల్ల ఎవరూ బాధపడరని భావిస్తారు.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారు ఎవరితో అయినా రిలేషన్ షిప్ కొనసాగించాలంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే దీని కోసం తీవ్రంగా థింక్ చేస్తారు. ఇలా చేస్తూనే తమ మనసులో నెగిటివ్ వెదర్ ను క్రియేట్ చేసుకుంటారు. దీంతో వీరు రిలేషన్ షిప్ లైఫ్ ను కొనసాగించలేరు.

ధనస్సు రాశి..
ఈ రాశి వారికి లైఫ్ లో బోరింగ్ అనేదే ఉండకూడదు. అలా జరగకుండా ఉండేందుకు ఏమి చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. వీరు రిలేషన్ షిప్స్ విషయంలో ఈ విధంగానే థింక్ చేస్తారు. అయితే వీరితో రిలేషన్ బలపడితే మాత్రం చాలా ఉత్సాహం ఉంటుందని ఫీలింగ్.

మకర రాశి..
ఈ రాశి వారు కెరీర్ పై ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల ఇతర విషయాలను ముఖ్యంగా పార్ట్నర్, రిలేషన్ వంటి విషయాలను పెద్దగా పట్టించుకోరు. దీంతో వీరు పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోవడం కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి వీరు సింగిల్ ఉండేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు.

కుంభ రాశి..
ఈ రాశి వారికి ఇతరులతో టైమ్ స్పెండ్ చేయడం కంటే.. తమతో తాము ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తే హాయిగా ఉంటుంది. అందుకే వీరు ప్రేమ విషయంలో కొంచెం ఇబ్బందికరంగా ఫీలవుతారు. అందుకే వీరు ఎలాంటి రిలేషన్ కైనా చాలా దూరంగా ఉంటారు.

మీన రాశి..
ఈ రాశి వారు రిలేషన్ షిప్ లో అడుగుపెడితే.. వారి అవసరాలు ఎక్కువగా తీర్చాలేమో అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే వీరు స్నేహితులు, కుటుంబంతో ఆనందంగా ఉండేందుకు ఇష్టపడతారు. దీంతో వీరి పర్సనల్ లైఫ్ గురించి.. ముఖ్యంగా పార్ట్ నర్ గురించి పెద్దగా పట్టించుకోరు. దీంతో వీరు పర్సనల్ రిలేషన్ గురించి పెద్దగా ఆసక్తి చూపరు.



Click it and Unblock the Notifications