For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Republic Day 2021 : ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రత్యేకతలేంటో తెలుసా...

కరోనా నేపథ్యంలో ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం.

|

ఈ ఏడాది అంటే 2021లో జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా 72వ వార్షికోత్సవాన్ని జరుపుకోబోతున్నాం.

Republic Day 2021 : Check out the special facts of this year in Telugu

ఈ సందర్భంగా మన దేశ రాజధాని అయిన ఢిల్లీ నగరంలోని రాజ్ పథ్ లో జరిగే కవాతు, వివిధ కల్చరల్ ప్రోగ్రామ్స్ దేశ ప్రజలందరికీ గర్వకారణంగా నిలుస్తాయి.

Republic Day 2021 : Check out the special facts of this year in Telugu

అయితే ఈసారి ఆ వేడుకలు చాలా భిన్నంగా జరిగే అవకాశం కనిపిస్తోంది. దీనంతటికీ కరోనా మహమ్మారే కారణం. కోవిద్-19 వైరస్ కారణంగా ఈ సారి గణతంత్ర వేడుకలు కొంత సాధారణంగా జరిగే అవకాశం ఉండొచ్చు.

Republic Day 2021 : Check out the special facts of this year in Telugu

అయితే ఈసారి జనవరి 26వ తేదీన గణతంత్ర వేడుకలను విభిన్నంగా జరుపనున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో 'రిపబ్లిక్ డే' విషెస్ చెప్పండిలా...Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో 'రిపబ్లిక్ డే' విషెస్ చెప్పండిలా...

విదేశీ అతిథులుండరు..

విదేశీ అతిథులుండరు..

సాధారణంగా ప్రతి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఏదో ఒక దేశం నుండి ఎవరో ఒక అధినేత వచ్చి, ఢిల్లీలో జరిగే పరేడ్ పాల్గొని, భారత ఆర్మీ యొక్క గౌరవ వందనం స్వీకరించేవారు. కానీ ఇప్పుడు కరోనా మహమ్మారి కారణంగా విదేశీ అతిథులు ఎవ్వరికీ ఆహ్వానం లేదు. కాబట్టి ఈసారి ఇతరదేశాల నుండి ఎవ్వరూ పాల్గొనరు.

ఇదే మొదటిసారి..

ఇదే మొదటిసారి..

భారతదేశంలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రతి ఏటా విదేశీ నేతలు పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. అయితే మొట్టమొదటిసారిగా అతిథులెవరూ లేకుండా మనం వేడుకలను జరుపుకోనున్నాం. గత ఐదు దశాబ్దాలలో ఇలాంటి పరిస్థితులు తలెత్తడం ఇదే తొలిసారి.

స్నేహపూర్వక సంబంధాల కోసం..

స్నేహపూర్వక సంబంధాల కోసం..

భారతదేశం తన విదేశీ వ్యవహరాలు మరియు దౌత్య సంబంధాలలో ఎల్లప్పుడూ చాలా సున్నితంగా వ్యవహరిస్తుంది. అందుకే ప్రతి సంవత్సరం ఇతర దేశాలతో సంబంధాలను పెంచుకునేందుకు మరింత స్నేహపూర్వకంగా ఉంటుంది. అలా ఈ ఏడాది కూడా ఇప్పటికే ఇంగ్లాంగ్ ప్రధాని బోరిస్ జాన్సన్ ను ఆహ్వానించారు. కానీ తను ఆ పర్యటనను రద్దు చేసుకున్నాడు.

బంగ్లాదేశ్ సైన్యం భాగం..

బంగ్లాదేశ్ సైన్యం భాగం..

మన దేశం నుండి 1971లో విడిపోయి బంగ్లాదేశ్ స్వతంత్ర రాష్ట్రంగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అలా విడిపోయి ప్రస్తుతం 50 సంవత్సరాలు అయ్యాయి. ఈ సందర్భంగా మన దేశంలో జరిగే రిపబ్లిక్ డే కవాతులో బంగ్లాదేశ్ సైన్యం కూడా పాల్గొనబోతోంది.

ఇది రెండోసారి..

ఇది రెండోసారి..

ఇలా భారతదేశ సైన్యంతో కలిసి విదేశీయుల సైన్యం పాల్గొనడం ఇది రెండోసారి. ఇంతకుముందు 2016 సంవత్సరంలో ఫ్రెంచ్ సైన్యం మన భారత సైన్యంతో కలిసి కవాతులో పాల్గొంది. 1971లో భారత్ పాకిస్థాన్ ను ఓడించి, తూర్పు పాకిస్థాన్ ను విముక్తి చేసింది. దీంతో అది బంగ్లాదేష్ రాష్ట్రంగా మారింది.

కవాతులో మార్పులు..

కవాతులో మార్పులు..

ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సంస్క్రుతులు, సంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమాలను నిర్వహించేవారు. అదే సమయంలో భారీ ఎత్తున సైన్యం కవాతు కార్యక్రమాలను నిర్వహించేది. కానీ ఈసారి కరోనా కవాతులను చిన్నవిగా చేసేస్తున్నారు.

నేషనల్ స్టేడియంలో..

నేషనల్ స్టేడియంలో..

ప్రతి సంవత్సరం గణతంత్ర వేడుకల సమయంలో ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఎగురవేసి ఉపన్యసించే ప్రధానమంత్రి ఈసారి నేషనల్ మైదానంలో పాల్గొననున్నారు. అలాగే పరేడ్ లో పాల్గొనే అన్ని స్క్వాడ్ లలో 144 మందికి బదులుగు 96 మంది మాత్రమే పాల్గొంటారు. సందర్శకుల గ్యాలరీ కూడా ఈసారి నాలుగో వంతు మాత్రమే ఉంటుందట.

English summary

Republic Day 2021 : Check out the special facts of this year in Telugu

Here we talking about the Republic Day 2021 : Check out the special facts of this year in Telugu. Read on.
Story first published:Friday, January 22, 2021, 23:54 [IST]
Desktop Bottom Promotion