Just In
- 1 hr ago
Today Rasi Phalalu :ఈ రోజు కొన్ని రాశుల వారికి అదృష్టం మరియు కోరికలు నెరవేరే సమయం
- 13 hrs ago
ఎంత నీళ్ళు తాగినా మరుసటి నిమిషంలో దాహం వేస్తుందా? అప్పుడు మీకు ఈ వ్యాధి రావచ్చు...!
- 15 hrs ago
మీ భర్త లేదా భార్య కోపంగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితిలో ఈ మాట అనకండి!
- 17 hrs ago
దోసకాయను తొక్కతో ఎందుకు తినకూడదు?... అలా తింటే ఏమవుతుంది?...
Don't Miss
- News
ఉదయ్‌పూర్ కన్నయ్యలాల్ హత్య: హైదరాబాద్ పాతబస్తీలో మరో నిందితుడి అరెస్ట్, ఎన్ఐఏ దర్యాప్తు
- Sports
Sanjay Manjrekar: రిషబ్ పంత్ మునుపటిలా అరవట్లేదు.. కాస్త సీరియస్‌గా కీపింగ్ చేస్తున్నాడు
- Finance
RBI's decision on currency notes: కరెన్సీ నోట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం
- Movies
Aamir Khan మూవీ రైట్స్ అల్లు అరవింద్ చేతికి.. నాగచైతన్య కోసం ఎంత చెల్లించారంటే?
- Technology
2023 లో SmartPhones ధరలు మరింత ప్రియం కానున్నాయా!
- Travel
మన తెలంగాణలోనూ ఓ నయాగర జలపాతం ఉందండోయ్!
- Automobiles
ఇప్పుడు మారుతి సుజుకి వంతు.. టొయోటా హైరైడర్ ఆధారంగా "విటారా" హైబ్రిడ్ ఎస్యూవీ, జులై 20న లాంచ్!
Republic Day 2021 : రిపబ్లిక్ డే గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు మీకోసమే...!
మన దేశానికి స్వాతంత్య్రం 1947 ఆగస్టు 15వ తేదీ వచ్చిందని మనందరికీ తెలుసు. మరి గణతంత్ర దినోత్సవం(Republic Day) ఎందుకు జరుపుకుంటారు అనే ప్రశ్నకు ప్రస్తుత తరం వారిలో చాలా మందికి సమాధానం తెలియదు.
అయితే కొందరు 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని, అందుకే ఈరోజున రిపబ్లిక్ డే ఉత్సవాలను జరుపుకుంటారని చెబుతుంటారు.
అయితే నవంబర్ 26వ తేదీనే ఆమోదం పొందిన రాజ్యాంగం.. జనవరి 26వ తేదీకి ఎందుకు మార్చారు.. దీని వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా.. ఏ ఉద్దేశంతో దీనిని మార్చారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో 'రిపబ్లిక్ డే' విషెస్ చెప్పండిలా...

జనవరి 26నే ఎందుకంటే..
భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి రెండేళ్లకు పైగా సమయం పట్టినప్పటికీ.. దీనిని నవంబర్ 26వ తేదీన ఆమోదించారు. అయితే జనవరి 26వ తేదీన రాజ్యాంగాన్ని అమలులోకి వచ్చిన తేదీగా ఎందుకు ప్రకటించారంటే.. దీనికి ఒక ముఖ్యమైన ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశ్యంతో రెండు నెలల పాటు ఆగారు.

రావీ నది ఒడ్డున..
1930 సంవత్సరంలో జనవరి 26వ తేదీన లాహోరో వేదికగా కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారిగా పూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు. రావీ నది ఒడ్డున మూడు రంగుల మువ్వన్నెల జెండాను ఎగురవేసి భారతీయుల సంకల్పాన్ని ఆంగ్లేయులకు గట్టిగా వినిపించారు.

జలియన్ వాలాబాగ్ ఉదంతం..
అప్పటివరకు మన దేశానికి కేవలం రాజకీయ, ఆధ్యాత్మిక స్వాతంత్య్రం వస్తే చాలనుకుని, సంపూర్ణ అధికారం బ్రిటీష్ వారి పాలనలో ఉండి, మన దేశం సామంత రాజ్యంగా ఉన్న పర్వాలేదనుకునే ఆలోచనలో ఉన్నవారందరికీ జలియన్ వాలా బాగ్ ఉదంతం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.
మొదటి
రిపబ్లిక్
డే
ఎక్కడ
జరిగింది...
ఎందుకని
ఈ
వేడుకలను
జరుపుకుంటారో
తెలుసా...

కాంగ్రెస్ పిలుపు..
అప్పటినుండి సుభాష్ చంద్రబోస్, జవహార్ లాల్ నెహ్రు లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో వేడి పుట్టించి, పూర్ణ స్వరాజ్య తీర్మానం ప్రకటన చేయించడంలో సఫలమయ్యారు. ఆరోజునే స్వాతంత్య్ర దినోత్సవ పరిగణించాల్సి ఉంటుందని కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు పిలుపునిచ్చింది. అంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న తేదీకి చిరస్థాయి గుర్తింపు కల్పించాలన్న ఉద్దేశంతో నవ భారత నిర్మాతలు మరో 2 నెలలు ఆగి 1950 జనవరి 26 నుండి రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు.

బ్రిటీష్ చట్టాలు రద్దు..
జనవరి 26వ తేదీ నుండి బ్రిటీష్ పాలనలోని చట్టాలు పూర్తిగా రద్దు అయ్యి, భారత దేశ చట్టాలు అమలులోకి వచ్చాయి. ఈ రాజ్యాంగ రచనకు రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టగా.. దీని రచనకు మొత్తం 64 లక్షల రూపాయలు ఖర్చయ్యింది.

హక్కులు, బాధ్యతలు..
భారత రాజ్యాంగంలో కుల, మత, వర్ణ, లింగ వివక్ష లేకుండా ప్రజలందరికీ రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను కల్పించారు. అలాగే ప్రతి పౌరుడు దేశసేవకు, దేశ అభివ్రుద్ధికి పాటుపడేలా బాధ్యతలను కలిగి ఉండాలని అందులో పొందుపరిచారు. వీటన్నింటినీ గుర్తు చేసుకుంటూ రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజే రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం.

ఆ స్టేడియంలో..
అయితే గణతంత్ర దినోత్సవం తర్వాత మొదటి గణతంత్ర దినోత్సవం ఎక్కడ జరిగిందనే విషయం చాలా మందికి తెలియదు. అందరూ అనుకున్నట్టు తొలి గణతంత్ర దినోత్సవం రాజ్ పథ్ లో కాకుండా ఇర్విన్ స్టేడియంలో అంటే ధ్యాన్ చంద్ స్టేడియంలో జరుపుకున్నారట.

మిట్టమధ్యాహ్నం వేళలో..
అప్పటికి సరిహద్దు గోడ నిర్మించబడలేదట. పాత కోట మాత్రమే కనిపించింది. ఇది మాత్రమే కాదు. మొదటి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉదయం సమయంలో కాకుండా మధ్యాహ్న సమయంలో జరుపుకున్నారట.

తొలి వందనం అధ్యక్షుడికే..
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో దేశ తొలి అధ్యక్షుడు చేరుకున్న వెంటనే అతని రైడ్ క్వార్టర్ నుండి నాలుగు గంటల వరకు సెల్యూట్ దశకు చేరుకుంది. అప్పుడు మన దేశ అధ్యక్షుడికి 31 ఫిరంగులతో వందనం ఇచ్చారు. ప్రతి సంవత్సరం ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత ఇది 21 తుపాకులకు తగ్గించబడింది.