Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
Happy Republic Day 2024 :మనలో స్ఫూర్తిని పెంచే.. ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
Republic Day 2024 Wishes, Quotes, Messages In Telugu : భారతదేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన రోజు జనవరి 26వ తేదీ. ఎందుకంటే ఆరోజునే మనకు సంపూర్ణ స్వాతంత్య్రం వచ్చిన రోజు. 200 సంవత్సరాల పాటు ఆంగ్లేయుల పాలనలో ఎన్నో బాధలు భరించిన మనం ఎందరో స్వాతంత్య్ర పోరాట యోధుల త్యాగ ఫలితంగా 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం పొందినప్పటికీ, అప్పటికీ బ్రిటీష్ వారి రాజ్యాంగం ప్రకారమే పాలన నడిచేది.

అయితే స్వాతంత్య్రం తర్వాత మనకు కూడా ఓ రాజ్యాంగం అవసరమని, డాక్టర్ అంబేద్కర్ చైర్మన్ గా రాజ్యాంగా ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసి, రెండేళ్ల పాటు ఎన్నో అధ్యయనాలు చేసి రాజ్యాంగాన్ని రూపొందించారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదం పొంది, ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత పూర్వక రాజ్యంగంగా గుర్తింపు పొందింది.

మనం సొంతంగా రూపొందించుకున్న రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీ నుండి అమలులోకి వచ్చింది. ఈ సందర్భంగా ప్రతి ఏటా రిపబ్లిక్ డే వేడుకలను జరుపుకుంటున్నాం. ఈ నేపథ్యంలో స్వాతంత్య్రం కోసం తమ ధన, మాన ప్రాణాలను త్యాగం చేసిన మహానుభావులను స్మరిస్తూ మీ బంధువులకు, మిత్రులకు, సన్నిహితులకు, శ్రేయోభిలాషులకు 'గణతంత్ర దినోత్సవ' శుభాకాంక్షలను షేర్ చేసుకోండి.

భారతదేశ జెండా.. అందరికీ అండ..
నింగిలో ఎగిరి జెండా.. అందరూ మెచ్చే జెండా..
మనందరిలో ఆశలు రేపిన జెండా'..
మీకు మీ కుటుంబసభ్యులకు, మిత్రులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు..

ఎగురుతున్న జెండా మనదే..
నీతి మనదే.. జాతి మనదే.. ప్రజల అండదండా మనదే..
ఎన్ని తేడాలున్నా.. ఎన్ని భేదాలున్నా..
దేశమంటే ఏకమయ్యే వేళ..
వందేమాతరం.. అందాం మనమందరం'
మీకు మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు గణతంత్ర దినోత్సవ శుభాకంక్షలు..

అమరవీరుల త్యాగఫలం..
ఆంగ్లేయులపై తిరుగులేని విజయం..
మన గణతంత్ర దినోత్సవం'
అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే..

త్యాగం చేసిన వారెందరో మహానుభావులు..
అందరికీ ఇవే మా వందనాలు'
మీకు మీ కుటుంబసభ్యులకు, మిత్రులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు..

ఎల్లప్పుడూ నేను భారతమాతకు రుణపడి ఉంటా..
భిన్నత్వంలో ఏకత్వాన్ని అందించిన భారతమాతకు జేజేలు'
మీకు మీ కుటుంబసభ్యులకు, మిత్రులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు..

నమ్మశక్యం కానిదే నా భారతదేశం'
మీకు మీ కుటుంబసభ్యులకు, మిత్రులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు..

ఎలా ప్రేమించాలో విద్యార్థులకు నేర్పించాలి..
తల్లిదండ్రులు కూడా పిల్లలకు దేశం గురించి చెప్పాలి..
మీకు మీ కుటుంబసభ్యులకు, మిత్రులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు..

భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం..
దీని కోసం ఎందరో మహానుభావుల త్యాగం..
మనం ఎప్పటికీ మరవకూడదు'
మీకు మీ కుటుంబసభ్యులకు, మిత్రులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు..

మన సమరయోధులను స్మరించుకుందాం..
మన వారసత్వాన్ని కాపాడుకుందాం..
మన దేశాన్ని చూసి గర్వపడదాం..'
మీకు మీ కుటుంబసభ్యులకు, మిత్రులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు..

మనకు సంపూర్ణ స్వాతంత్య్రం వచ్చిన ఈ రోజే గణతంత్ర దినోతవ్సం..
మీకు మీ కుటుంబసభ్యులకు, మిత్రులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు..
స్వాతంత్య్రం తర్వాత మనకు కూడా ఓ రాజ్యాంగం అవసరమని, డాక్టర్ అంబేద్కర్ చైర్మన్ గా రాజ్యాంగా ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసి, రెండేళ్ల పాటు ఎన్నో అధ్యయనాలు చేసి రాజ్యాంగాన్ని రూపొందించారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదం పొంది, ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత పూర్వక రాజ్యంగంగా గుర్తింపు పొందింది.
భారతదేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రతి ఏటా జనవరి 26వ తేదీన దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు.



Click it and Unblock the Notifications











