For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Republic Day Parade 2022:ఈసారి రిపబ్లిక్ డే వేడుకల్లో వారికి అనుమతి లేదట...

2022 రిపబ్లిక్ డే పరేడ్ ప్రదర్శనలో వ్యాక్సిన్ వేసుకోని వారికి, 15 ఏళ్లలోపు పిల్లలకు అనుమతి లేదట. ఇంకా ఏయే నిబంధనలున్నాయో చూసెయ్యండి.

|

Republic Day 2022 Wishes, Quotes, Messages In Telugu : భారతదేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన రోజు జనవరి 26వ తేదీ. ఎందుకంటే ఆరోజునే మనకు సంపూర్ణ స్వాతంత్య్రం వచ్చిన రోజు. మనం సొంతంగా రూపొందించుకున్న రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీ నుండి అమలులోకి వచ్చింది.

Republic Day Parade 2022: Unvaccinated People, Children Below 15 Not Allowed, Detailed Guidelines in Telugu

ఈ సందర్భంగా ప్రతి ఏటా రిపబ్లిక్ డే వేడుకలను జరుపుకుంటున్నాం. గణతంత్ర వేడుకల(Republic Day)ను ప్రతి సంవత్సరం రాజ్ పథ్ లో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాల నుండి అద్భుతమైన శకటాలను, సైనిక, వాయు, నేవీ దళాల విన్యాసాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. ఈ ప్రదర్శనలను, విన్యాసాలను చూసేందుకు దేశ, విదేశాల నుండి అతిథులు, ప్రజలు ఎంతోమంది వస్తుంటారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా గత రెండు సంవత్సరాల నుండి ఈ వేడుకలు ఘనంగా నిర్వహించడం లేదు. ఇప్పుడు కరోనా మహమ్మారికి విరుగుడు కనిపెట్టినా.. టీకాలు అందుబాటులో ఉన్నప్పటికీ.. కరోనా కొత్త వేరియంట్లు మళ్లీ అందరినీ కలవరపెడుతున్నాయి. దీంతో ఢిల్లీ లో కోవిద్ నిబంధనలు కఠినతరం చేశారు. అంతేకాదు రిపబ్లిక్ డే 2022 వేడుకలను సందర్శించే వారు తప్పనిసరిగా రెండు డోసుల టీకాలు వేయించుకున్నట్లు సర్టిఫికెట్ చూపించాలని, అదే విధంగా 15 సంవత్సరాలలోపు పిల్లలకు ఈ వేడుకలు చూసేందుకు అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు ఆదేశాలు చేశారు.

Republic Day Parade 2022: Unvaccinated People, Children Below 15 Not Allowed, Detailed Guidelines in Telugu

రిపబ్లిక్ డే వేడుకలకు హాజరయ్యే ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలని, శానిటైజర్ తమ వద్ద ఉంచుకోవాలని.. సామాజిక దూరం పాటిస్తూ.. కోవిద్ జాగ్రత్తలు, నియమాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. అంతేకాదు రిపబ్లిక్ డే వేడుకలను తిలకించేందుకు వచ్చే వారి కోసం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేశారు. ఆ వివరాలేంటో ఇప్పుడే చూడండి...

* రిపబ్లిక్ డే సందర్శకుల కోసం సీటింగ్ బ్లాకులు ఉదయం 7 గంటలకు తెరవబడతాయి.
* రిపబ్లిక్ డే వేడుకలకు హాజరయ్యే వారు తమకు కేటాయించిన సీట్లలో మాత్రమే కూర్చోవాలి.
* కరోనా రాకుండా ఉండేందుకు.. రెండు టీకాలు తప్పకుండా వేయించుకుని ఉండాలి. అందుకు సంబంధించిన సర్టిఫికెట్ మీ వద్ద తప్పనిసరిగా ఉంచుకోవాలి.
*15 సంవత్సరాల కంటే వయసు తక్కువ ఉన్న పిల్లలు ఈ కార్యక్రమానికి అనుమతించబడరు.
* పార్కింగ్ కూడా పరిమితంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా క్యాబ్ లో లేదా టాక్సీలో రావొచ్చు.
* రిపబ్లిక్ డే వేడుకలకు వచ్చే వారు భద్రతా సిబ్బందికి సహకరించాలి.
* ఈ వేడుకలకు హాజరయ్యే వారు అడ్మిట్ కార్డుతో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డు(ఆధార్, ఓటర్, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి) తీసుకెళ్లాలి.
* ప్రతి పార్కింగ్ ఏరియాలో రిమోట్ కంట్రోల్ కార్ లాక్ కీలు ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు.

భారీ బందోబస్తు..

* 2022 రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలో మొత్తం 27 వేల మందికి పైగా సిబ్బందితో భారీ బందోబస్తు నిర్వహించనున్నట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేష్ ఆస్థానా తెలిపారు.
* మొత్తం గ్రూపులలో 71 మంది పోలీస్ డిప్యూటీ కమిషనర్లు, 713 మంది ఇన్ స్పెక్టర్లు, ఢిల్లీ పోలీస్ కమాండో, ఆర్మ్ డ్ బెటాలియన్ అధికారి ఉన్నారు. వీరితో పాటు జవాన్లు, 65 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.

FAQ's
  • భారతదేశంలో రిపబ్లిక్ డే ఎప్పుడు జరుపుకుంటారు?

    1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదం పొంది, ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత పూర్వక రాజ్యంగంగా గుర్తింపు పొందింది. మనం సొంతంగా రూపొందించుకున్న రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీ నుండి అమలులోకి వచ్చింది. ఈ సందర్భంగా ప్రతి ఏటా రిపబ్లిక్ డే వేడుకలను జరుపుకుంటున్నాం.

  • 2022లో రిపబ్లిక్ వేడుకల్లో ఎవరికి అనుమతి లేదు?

    2022 రిపబ్లిక్ డే పరేడ్ ప్రదర్శనలో వ్యాక్సిన్ వేసుకోని వారికి, 15 ఏళ్లలోపు పిల్లలకు అనుమతి లేదు. కరోనా మహమ్మారి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రకటించింది. ప్రస్తుతం మన దేశంలో ఒమిక్రాన్, కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే రిపబ్లిక్ వేడుకలకు హాజరయ్యే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి.. శానిటైజర్ రాసుకోవాలి. సామాజిక దూరం పాటించాలి. కోవిద్ ప్రోటోకాల్స్ కు కట్టుబడి ఉండాలి.

English summary

Republic Day Parade 2022: Unvaccinated People, Children Below 15 Not Allowed, Detailed Guidelines in Telugu

Here we are talking about the Republic Day Parade 2022:Unvaccinated people, children below 15 not allowed, detailed guidelines in Telugu. Read on
Story first published:Tuesday, January 25, 2022, 13:51 [IST]
Desktop Bottom Promotion