Latest Updates
-
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు!
Valentines day 2023: హైదరాబాద్‌లో వాలెంటైన్స్ డే జరుపుకోవడానికి బెస్ట్ ప్లేసెస్
ఈ వాలెంటైన్స్ డే రోజు మీ ప్రియమైన వారితో హైదరాబాద్‌లోని ఈ ప్లేసెస్ లో రొమాంటిక్‌గా గడపండి. హైదరాబాద్‌లోని ఆ ప్రాంతాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎప్పుడెప్పుడా అని ప్రేమికులు తెగ ఎదురుచూస్తున్న వాలెంటైన్స్ డే మరో వారంలో వచ్చేస్తుంది. నిజమైన ప్రేమలో ఉండే వారికి కేవలం వాలెంటైన్స్ డే రోజే కాకుండా ప్రతి రోజూ పండగలాగే సాగుతుంది. అయితే ప్రేమికుల దినోత్సవం రోజు మరింత స్పెషల్ గా ఉంటుందట.

వాలెంటైన్స్ డే రోజున తమ ప్రియురాలు లేదా ప్రియుడికి మరింత దగ్గరవ్వాలని.. తమ బంధం శాశ్వతంగా ఉండిపోవాలని చాలా మంది ప్రేమికులు కోరుకుంటారు. ఈ ప్రత్యేకమైన రోజు ప్రత్యేకంగా గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఈ వాలెంటైన్స్ డే రోజు మీ ప్రియమైన వారితో హైదరాబాద్‌లోని ఈ ప్లేసెస్ లో రొమాంటిక్‌గా గడపండి. హైదరాబాద్‌లోని ఆ ప్రాంతాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. రామోజీ ఫిల్మ్ సిటీ
రామోజీ ఫిల్మ్ సిటీ.. వాలెంటైన్స్ డే జరుపుకోవడానికి పర్‌ఫెక్స్ డెస్టినేషన్. హైదరాబాద్ లో రామోజీ ఫిల్మ్ సిటీ ప్రధాన ఆకర్షణ అనడంలో అతిశయోక్తి లేదు. థీమ్ పార్కులు, కార్నివాల్స్, సాహస క్రీడలు, అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇలా మీరు ఎంజాయ్ చేయాడనికి ఎన్నో ఉంటాయి. రొమాంటిక్ గా గడపాలనుకుంటే లగ్జరీ హోటళ్లు, మొఘల్ గార్డెన్స్, జపనీస్ గార్డెన్, ఏంజెల్స్ ఫౌంటెన్ గార్డెన్, సన్ వంటి అనేక ఆసక్తికరమైన కార్యకలాపాలను అందిస్తుంది. మూవీ మ్యూజిక్ పార్క్, ఫిల్మీ దునియా ఇలా జంటగా ఎంజాయ్ చేసే అంశాలు రామోజీ ఫిల్మ్ సిటీ.

2. నెక్లెస్ రోడ్
మీ లవర్ తో కలిసి లాంగ్ డ్రైవ్ కు వెళ్లాలనుకుంటున్నారా అయితే నెక్లెస్ రోడ్డుకు వెళ్లాల్సిందే. రాత్రి వేళ నెక్లెస్ రోడ్ రైడ్ చాలా రొమాంటిక్ గా ఉంటుంది. ఒక వ్యక్తి ధరించినప్పుడు నెక్లెస్ ఎలా ఉంటుందో ఈ రోడ్డు అలాగే ఉంటుంది. వంపులతో ఉండే ఈ రోడ్డులో బైక్ పై దగ్గరగా కౌగిలించుకుని చల్లని గాలిలో అలా అలా విహరించడం చాలా బాగుంటుంది. లుంబినీ పార్క్, సంజీవయ్య పార్కు, ఎన్టీఆర్ గార్డెన్స్, పీపుల్స్ ప్లాజా వంటి ప్రకృతి రమణీయ దృశ్యాలు ఇక్కడ ప్రేమికులను విశేషంగా అలరిస్తాయి.

3. ఈట్ స్ట్రీట్
(image: HyderabadTourismTravel)
నోరూరించే స్ట్రీట్ ఫుడ్స్ తో మీ ప్రేమ జీవితాన్ని మసాలా అద్దుకోవడానికి, హైదరాబాద్‌లోని అత్యంత ప్రజాదరణ పొందిన వేదికల్లో ఈట్ స్ట్రీట్ ఒకటి. ఈట్ స్ట్రీట్ సుందరమైన నెక్లెస్ రోడ్డు పక్కన ఉంటుంది. ఇక్కడ చాలా రకాల ఫుడ్ ఐటెమ్స్ అందుబాటులో ఉంటాయి. హైదరాబాదీ, మొఘలాయి వంటకాలను ఆస్వాదించవచ్చు.

4. గోల్కొండ కోట
హైదరాబాద్ లో సందర్శనీయ ప్రాంతం గోల్కొండ కోట. రాజభవనాలు, వాస్తు శిల్పం లాంటి చారిత్రక వైభవాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటే గోల్కొండ కోటకు వెళ్లవచ్చు. ఇక్కడ చూడటానికి చాలా ఉంటుంది. మీకు కావాల్సింది ఓపిక, ఎనర్జీ మాత్రమే.

5. దుర్గం చెరువు
దుర్గం చెరువు మంచి రొమాంటిక్ ప్రదేశంలో అనడంలో ఎలాంటి సందేహం లేదు. మెకనైజ్డ్ బోట్, వాటర్ స్కూటర్, పెడల్ బోట్ లాంటివాటితో దుర్గం చెరువులో ఉల్లాసంగా గడపవచ్చు. మీ పార్ట్‌నర్‌తో కలిసి రొమాంటిక్ వాక్‌కు కూడా వెళ్లొచ్చు.

6. ఆలివ్ బిస్ట్రో
(image:Dineout)
దుర్గం చెరువు సీక్రెట్ లేక్ కు అభిముఖంగా ఉన్న ప్రశాంతమైన ఫ్యాన్సీ రెస్టారెంట్ ఇది. ఈ హోటల్ చాలా రొమాంటిక్ గా ఉంటుంది. ప్రత్యేక విదేశీ వంటకాలు అలరిస్తాయి. వాలెంటైన్స్ డే రోజు ప్రియమైన వారితో చెరువు ఒడ్డున కూర్చొని వారితో మంచి సమయం గడపడం ఊహించుకోవడానికే చాలా అద్భుతంగా ఉంటుంది.

7. లియోనియా హోలిస్టిక్ డెస్టినేషన్
(image: TripAdvisor)
లియోనియో హోలిస్టిక్ డెస్టినేషన్ పర్‌ఫెక్స్ వాలెంటైన్స్ డే డెస్టినేషన్. విశాలమైన కాంప్లెక్స్ లో నాలుగు హోటళ్లు, విల్లాలు ఉన్న హోటల్ ఇది. షామీర్‌పేట్‌లో పచ్చదనం సహజ శిలల మధ్య లియోనియో హోలిస్టిక్ డెస్టినేషన్ ఉంటుంది. మెడిస్పా, సినిమా థియేటర్లు, లైవ్ పెర్ఫార్మెన్స్, సర్ఫింగ్ రిడ్జ్, వాటర్ పార్క్, పెయింట్ బాల్, లైవ్ డీజే విత్ రెయిన్ డ్యాన్స్, మల్టీ క్యూసిన్ రెస్టారెంట్లు, బార్లు, నైట్ క్లబ్‌లు ఇలా ఎన్నో మీ ప్రియమైన వారితో గడపవచ్చు.

8. ఓహ్రీస్ గుఫా
(image: Dineout)
ఓహ్రీస్ గుపా ఒక ఫైన్ డైనింగ్ రెస్టారెంట్. ప్రత్యేకమైన రోజు ప్రియమైన వారితో ఇలాంటి ప్రత్యేకమైన రెస్టారెంట్ లో గడపడం చాలా బాగుంటుంది. గుఫా ఇంటీరియర్ డెకర్ గుహలో ఉన్నట్లుగా అనిపిస్తుంది. వెయిటర్ల కాస్ట్యూమ్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. రొమాంటిక్ డేట్ కోసం ఓహ్రీస్ గుఫా పర్ఫెక్ట్ ప్లేస్.

9. లిటిల్ ఇటలీ
(image: Zomato)
ప్రేమ ఆసక్తికి ఇటాలియన్ ఫుడ్ ఆన్ అయినట్లయితే మీరువాటిని డిన్నర్ డేట్ కోసం ఎక్కడికి తీసుకెళ్తారు. లిటిల్ ఇటలీ ఉత్తమమైన మాక్ టెయిల్ లతో జత చేసిన స్పఘెట్టి ఆహ్లాదకరంగా ఉంటుంది. లిటిల్ ఇటలీ మంచి రొమాంటిక్ ప్లేస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

10. డైలాగ్స్ ఇన్ ది డార్క్
(image: TripAdvisor)
డైలాగన్ ఇన్ ది డార్క్ లో మీ లవర్ తో డిన్నర్ ప్లాన్ చేయండి. అద్భుతః అనిపిస్తుందంటే నమ్మండి. ఇక్కడికి వెళ్లగానే ఫోన్లు, గడియారాలు, కాంతిని వెదజల్లే వాటిని పక్కన పెట్టమని రెస్టారెంట్ సిబ్బంది మీకు సూచిస్తారు. శాకాహారం, మాంసాహారం రెండూ లభిస్తాయి. మీరు ఏకాంతంగా ఉన్న ఫీల్ వస్తుంది. ఇలాంటి ప్రదేశంలో మనసు విప్పి మాట్లాడుకోవచ్చు.



Click it and Unblock the Notifications