Latest Updates
-
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Independence Day 2026: ఆగస్టు 15న ప్రధాని ప్రసంగానికి, జెండా వందనానికి ఎర్రకోటనే ఎందుకు ఎంచుకుంటారో తెలుసా? -
శ్రావణ మాసంలో ఈ ఐదు నక్షత్రాల వారికి తిరుగే ఉండదు.. గోల్డెన్ డేస్ ఆరంభం.! -
ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు.! -
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే!
క్రికెట్ లెజెండ్ సచిన్ హృదయాన్నే కలచివేసిన వీడియోపై ఓ లుక్కేయండి...
‘‘ఈ మద్దా రామ్ అనే చిన్నారి స్ఫూర్తితో అందరూ నూతన సంవత్సరాన్ని ప్రారంభించండి. ఇది నా హృదయాన్ని కలచివేసింది‘‘ అని చెప్పారు.
ఈ ప్రపంచంలో ఎన్ని గేమ్స్ ఉన్నా క్రికెట్ కు ఉన్న ప్రత్యేకతే వేరు. జెంటిల్మెన్ గేమ్ గా పేరు గాంచిన ఈ ఆటను మన దేశంలో కోట్లాది మంది అభిమానులు ఇష్టపడుతున్నారు. ఇక ఈ గేమ్ లో ఆడే ఆటగాళ్లను ఎంతలా ఆరాధిస్తారో చెప్పాల్సిన పని లేదు.

అలాంటి వారిలో రిటైర్ అయిన సచిన్ టెండూల్కర్ ముందు వరుసలో ఉంటారు. ఎంతోమంది ఆరాధించే సచిన్ ను కొందరు వికలాంగులైన చిన్నారుల ఆట భావోద్వేగానికి గురి చేసింది. అంతే వెంటనే వారి ఆటను వీడియో తీసి ట్విట్టర్లో షేర్ చేసుకున్నాడు. ఆ ట్వీట్ లో ఇంకా ఏయే విషయాలు ఉన్నాయో తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ ను పూర్తిగా చూడండి...
వైరల్ అయిన వీడియో..
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ న్యూ ఇయర్ సందర్భంగా ట్విట్టర్లో 55 సెకన్లు ఉన్న ఓ వీడియోను షేర్ చేసుకున్నాడు. ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియోలో కొందరు వికలాంగ చిన్నారులు క్రికెట్ ఆడుతున్నారు.

భావోద్వేగానికి గురైన సచిన్..
ఆ వీడియోలో కాళ్లు చచ్చుబడిపోయిన ఓ చిన్నపిల్లాడు బ్యాటింగ్ చేస్తూ పరుగుల కోసం మైదానంలో పరుగెడుతున్న సంఘటనను చూసి సచిన్ టెండూల్కర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారట.

బంతిని బలంగా..
మద్దా రామ్ గా గుర్తించబడిన ఆ బాలుడు ఎంతో భిన్నమైన సామర్థ్యం గలవాడు. తన బ్యాట్ తో బంతిని బలంగా బాదడమే కాకుండా, వేగవంతంగా పరుగులు తీస్తాడు. దీన్ని బట్టి క్రికెట్ ఆట పట్ల అతనికి ఎంతటి అంకితభావం ఉందో ఇట్టే అర్థమవుతోంది అన్నాడు.

ఈ చిన్నారి స్ఫూర్తితో..
‘‘ఈ మద్దా రామ్ అనే చిన్నారి స్ఫూర్తితో అందరూ నూతన సంవత్సరాన్ని ప్రారంభించండి. ఇది నా హృదయాన్ని కలచివేసింది‘‘ అని చెప్పారు.

ట్వీట్ల మోత..
ఈ వీడియోను సచిన్ టెండూల్కర్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే ట్రెండింగ్ టాపిక్ గా నిలిచిపోయింది. అంతేకాదు కొద్ది గంటల్లోనే 500కే కు మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. అంతేకాదు. ఈ వీడియోపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

నెటిజన్లను కూడా..
ఈ వీడియో నెటిజన్లను కూడా ఉద్వేగానికి గురి చేసింది. సచిన్ అంతటి వాడే ఆ పిల్లవాడినే ప్రశంసించడమే కాకుండా, అతని ఆత్మవిశ్వాసం చూసి ఆశ్చర్యపోయినట్లు సచిన్ చెప్పిన విషయంపై అందరూ స్పందిస్తున్నారు.

ఏ మాత్రం తగ్గని ఆసక్తి..
ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఇలా అంటున్నారు. ‘‘సచిన్ అంతర్జాతీయ క్రికెట్ కు దూరమై ఏడేళ్లు అవుతున్నా అతని ఈ ఆటపై ఏ మాత్రం ఆసక్తి తగ్గలేదు. చిన్న వయసు నుండే అతని జీవితం క్రికెట్ అంకితం. అతడిని నేను ఒక సైనికుడిగా చూస్తాను అంటూ రకరకాలుగా ట్వీట్లు చేస్తున్నారు.



Click it and Unblock the Notifications