Latest Updates
-
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్..
2023 కుంభరాశిలో శని సంచారము: 2025 వరకు ఈ 4 రాశుల వారు అదృష్టవంతులు అవుతారు.. ఇందులో మీ రాశి ఉందా?
2025 వరకు ఈ 4 రాశుల వారు అదృష్టవంతులు అవుతారు.. ఇందులో మీ రాశి ఉందా?
Sani Transits 2023: జ్యోతిష్య శాస్త్రీం ప్రకారం, ప్రతి వ్యక్తిలో జరిగే మంచి మరియు చెడు విషయాలను గ్రహాల స్థానాల ద్వారా అంచనా వేస్తారు. గ్రహాలన్నింటిలోకి శనిగ్రహం చాలా నెమ్మదిగా కదులుతున్న గ్రహం. ఈ గ్రహం ఏ రాశిలో ఉన్నా, వారి జీవితం అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి స్థానికులకు అనేక పరీక్షలు పెడతాడు. ఈ శని గ్రహం ఏరాశిలోకి ప్రవేశించినా తను 2 1/2 సంవత్సరాలు ఆ రాశిలో ఉంటాడు. మనం చేసే మంచి చెడు పనులను బట్టి బట్టి లాభాలను ప్రసాదించే శని భగవానుడు ఎన్ని కష్టాలను ప్రసాదిస్తాడో అంత వరాలను కూడా ప్రసాధిస్తారు.

ఈ క్రమంలోనే ఈ జనవరి 17, 2023న శనిదేవుడు కుంభరాశిలోకి సంచారం చేశాడు. 30 సంవత్సరాల తరువాత శని కుంభరాశిలో ప్రవేశించి 2025 వరకు ఆ రాశిలో ఉంటాడు. ఈ శని సంచారము వలన కుంభ, మకర, మీన రాశులకు ఏడున్నరకు శని ప్రారంభమవుతుంది. మరియు శని ఈ సంచార ప్రభావం అన్ని రాశివారిపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా 4 రాశుల వారు ఈ శని సంచారం వల్ల ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది మరియు కెరీర్‌లో మంచి విజయాన్ని పొందుతారు. ఆ 4 రాశులు ఎవరో ఇప్పుడు చూద్దాం. ఈ నాలుగు రాశుల్లో మీ రాశి కూడా ఉందో లేదో తెలుసుకోవడానికి ఇక్కడ చూద్దాం.

మిధునరాశి
శని మిథునరాశిలోని 9వ ఇంటికి సంచరిస్తాడు. దీని వలన మిథున రాశి వారికి అష్టమ శని నుండి విముక్తి లభిస్తుంది. ఇప్పటి వరకు కష్టాలు అనుభవించిన మిథునరాశి వారికి రానున్న కాలం స్వర్ణయుగం. అదృష్టం యొక్క మద్దతు పొందుతారు. ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు.ఈ సమయంలో ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే వారికి అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందుతారు. ఆరోగ్యం మెరుగుపదతుంది. మీ తండ్రితో అనుబంధం బలంగా ఉంటుంది.

ధనుస్సు రాశి
2023లో ధనుస్సు రాశి నుండి కుంభరాశిలోకి శని సంచారము ధనుస్సు రాశి వారికి ఏడున్నర శని నుండి విముక్తి లభిస్తుంది. శని ధనుస్సు రాశిలోని 3వ ఇంటికి వెళతాడు. అది సంపదలకు ఇల్లు. కాబట్టి విదేశాలకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారు లేదా విదేశాలలో సంపాదించాలనుకునే వారు ఈ కాలంలో ప్రయోజనాలను పొందుతారు. దీని తరువాత శని సంచారం శ్రామికులకు అద్భుతంగా ఉంటుంది. కష్టపడి పనిచేసే వారిలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి.

మకరరాశి
శని మకరరాశికి 2వ ఇంటిని సంక్రమిస్తుంది. ఈ విధంగా ఈ రాశులకు ఏడున్నర శని యొక్క మూడవ లేదా చివరి దశ ప్రారంభమవుతుంది. చివరి దశ కావడంతో మకరరాశి వారికి శనిదేవుడు అనుగ్రహం పూర్తిగా ఉంటుంది. ఈ రాశి వారు ఆర్థికంగా బలంగా ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో కుటుంబంలో విబేధాలు రావచ్చు. పెళ్లి కాని, అవివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉంది. సంబంధాలు వస్తాయి. ముహుర్థ బలం స్ట్రాంగ్ గా ఉంది. ఇక పనిచేసే ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు, పనిలేని వారికి మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

కుంభ రాశి
కుంభరాశి యొక్క మొదటి ఇంటికి శని సంచారం చేస్తున్నాడు. కాబట్టి, అలా కుంభ రాశికి ఏడున్నర శని 2వ దశ ప్రారంభమవుతుంది. ప్రధానంగా కుంభరాశి శనిదేవునికి ఇష్టమైన రాశి, వారి సొంత రాశి కూడ. కాబట్టి కుంభ రాశి వారికి శని దేవుడు మేలు చేస్తాడు. ఈ సంచార సమయంలో శశరాజయోగం ఏర్పడడం వల్ల కుంభ రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. రాజకీయాల్లో ఉన్న వారు ఎన్నికల్లో నిలబడితే గెలుస్తారు.
(నిరాకరణ: పైన ఇవ్వబడిన సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న ఊహలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది మరియు విశ్వసనీయతకు హామీ లేదు. తెలుగు బోల్డ్ స్కై కథనానికి సంబంధించిన సమాచారాన్ని నిర్ధారించలేదు. మరియు మా ఏకైక ఉద్దేశం సమాచారాన్ని అందించడమే. దానిని ఇలా తీసుకోవాలి సమాచారం మాత్రమే. ఏదైనా సమాచారం లేదా ఊహను సాధన చేయడానికి లేదా అమలు చేయడానికి ముందు. , దయచేసి సంబంధిత నిపుణులను సంప్రదించండి.)



Click it and Unblock the Notifications
