Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
Sania Mirza: టెన్నిస్‌లోనే కాదు వివాదాలతోనూ సహవాసం.. జాతీయ పతాకం, పొట్టి స్కర్టులు ఇంకా ఎన్నో..
ఆటలో ఎంతో ఎత్తుకు ఎదిగిన సానియా మీర్జా చుట్టూ ఎన్నో వివాదాలు కూడా ఉన్నాయి. జాతీయ పతాకాన్ని అవమానించడం నుండి పెళ్లి, స్కర్ట్ వరకు ఆమె చుట్టూ ఎన్నో కాంట్రవర్సీస్ ఉన్నాయి.
క్రికెట్ అంటే పడిచచ్చే దేశంలో టెన్నిస్ కు సూపర్ క్రేజ్ తీసుకురావడంలో సానియా మీర్జా పాత్ర చాలా ఎక్కువ. టెన్నిస్ ను అందరూ చూసేలా, అభిమానించే, ఆడేలా చేసింది సానియా మీర్జా. టెన్నిస్ లో ఎన్నో ఘనతలు సాధించింది. రికార్డులు నెలకొల్పింది. మిక్స్‌డ్ డబుల్స్ లో ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను నెగ్గింది. వీటితో పాటు కోర్టులో తను ఆడుతుంటే స్టేడియంలో ఉన్న ప్రేక్షకులతో పాటు టీవీలు చూస్తున్న వారు కూడా మైమరిచిపోయేవారు. తన అందంతో ఆకట్టుకుంది ఈ టెన్నిస్ క్రీడాకారిణి.

ఆటలో ఎంతో ఎత్తుకు ఎదిగిన సానియా మీర్జా చుట్టూ ఎన్నో వివాదాలు కూడా ఉన్నాయి. జాతీయ పతాకాన్ని అవమానించడం నుండి పెళ్లి, స్కర్ట్ వరకు ఆమె చుట్టూ ఎన్నో కాంట్రవర్సీస్ ఉన్నాయి.

పొట్టి స్కర్టుపై ఫత్వా జారీ
2005లో సానియా మీర్జా తన 18 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు ఒక మ్యాచ్ ఆడింది. అందులో సానియా పొట్టి స్కర్టు ధరించిందని అది మతాన్ని కించపరచడమే అంటూ ముస్లిం మతపెద్దలు ఫత్వా జారీ చేశారు. అయితే దీనిపై సానియా గట్టిగానే బదులిచ్చింది. అదే ఏడాది యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్‌లో 4వ రౌండ్ కు చేరిన తొలి భారతీయురాలిగా నిలిచన సమయంలో సానియా ఎప్పట్లాగే పొట్టి స్కర్టునే ధరించింది. తను కోరుకున్నది ధరించండం తన హక్కు అంటూ చెప్పకనే చెప్పింది.

జాతీయ జెండా
సానియా మీర్జా ఎదుర్కొన్న అతిపెద్ద వివాహం ఇదే. 2008లో టెన్నిస్ మ్యాచ్ ను చూస్తూ ఎదురుగా ఉన్న టేబుల్ పై కాళ్లు పెట్టింది. అయితే అదే టేబుల్ భారత జాతీయ జెండా ఉండటంతో ఆమె కాళ్లు జాతీయ జెండాను తాకుతున్నట్లు ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఘటనపై ఓ సామాజిక కార్యకర్తల కోర్టులో కేసు కూడా వేశారు.

షోయబ్ మాలిక్ తో పెళ్లి
పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను సానియా మీర్జా వివాహం చేసుకోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ప్రపంచంలో ఎవరూ దొరకనట్టు పాక్ వ్యక్తిని పెళ్లి చేసుకున్నావేంటి అంటూ ఎంతో మంది విమర్శించారు. ఇదే విషయంపై శివసేన చీఫ్ బాల్ ఠాక్రే కూడా తన పత్రిక సామ్నాలో సానియాను విమర్శించారు.
అంతకుముందు 2009లో తన చిన్ననాటి స్నేహితుడితో ఎంగేజ్మెంట్ చేసుకుంది సానియా. ఈ కార్యక్రమాన్ని అప్పట్లో ఓ మీడియా సంస్థకు లైవ్ రైట్స్ అమ్మేసింది. ఆ తర్వాత వీరి ఎంగేజ్మెంట్ క్యాన్సర్ అయింది. అయితే ఈ వ్యవహారంపై అప్పట్లో విమర్శలు వచ్చాయి.

మక్కా మసీదులో యాడ్ షూటింగ్
మక్కా మసీదును ముస్లింలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయితే ఆ మక్కా మసీదులో వాణిజ్యపరమైన షూటింగ్ నిర్వహించారని సానియాపై మత పెద్దలు మండిపడ్డారు. అప్పుడు సానియా క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.

AITAపై ఆరోపణలు
2012లో లండన్ ఒలింపిక్స్ సందర్భంగా మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో సానియా మీర్జాతో కలిసి ఆడాలాని లియాండర్ పేస్ డిమాండ్ చేశాడు. అయితే దీనిపై సానియా మీర్జా విమర్శలు చేసింది. ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్-AITA తనను లియాండర్ తో కలిసి ఆడాలని బలవంతం చేసిందని ఆమె ఆరోపించంది. తను భూపతితో కలిసి ఆడతానని చెప్పింది.



Click it and Unblock the Notifications