For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Sankranthi Pandem Kollu:సంక్రాంతి సంబురాలు ‘తగ్గేదే లే’..కోడి పందెలు ఆగేదేలే...

|

సంబరాల సంక్రాంతి అంటేనే ప్రతి ఒక్కరికీ టక్కున గుర్తొచ్చేది కోడి పందెలు.. హరిదాసు కీర్తనలు.. రంగు రంగుల ముగ్గులు.. ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు.. ప్రత్యేకమైన పిండి వంటలు.. ఇలా పండుగ వాతావరణమంతా పల్లెటూళ్లలోనే కనిపిస్తుంది.

అయితే కోడి పందెలు అనగానే మనకు ఉభయ గోదావరి జిల్లాలు, క్రిష్ణా జిల్లాలే గుర్తొస్తాయి. సంక్రాంతి సంబురాల వేళ కోడి పందెల కోసం పందెం రాయుళ్లు ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల నుండి వస్తుంటారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. పందెం కోళ్ల పెంపకం అంటే అంత ఆషామాషీ కాదు.. బరిలోకి దిగే కోళ్లను ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి.. రాత్రి కునుకు తీసే వరకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.

అంతేకాదు వాటికి ప్రత్యేకమైన ఆహారం తినిపిస్తారు.. బరిలో దిగే కోళ్లకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తారు.. కుక్కుట శాస్త్రం ప్రకారం.. కొన్ని ఆచారాలను, పద్ధతులను తూ.చ తప్పకుండా పాటిస్తారు. ఇలా చేయడం వల్ల తమ కోళ్లు బరిలో 'ఓడేదేలే' అని చాలా మంది నమ్ముతారు. ఈ సందర్భంగా సంక్రాంతికి ముందు పందెం కోళ్లకు ఎలాంటి శిక్షణ ఇస్తారు.. ఎలాంటి ఆహారం తినిపిస్తారు.. కోడి శాస్త్రం ఏం చెబుతుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

సంక్రాంతి స్పెషల్ 2022 : ఈ శాస్త్రం ప్రకారం.. తమ కోళ్లు 'ఓడేదేలే' అంటున్న పందెం రాయుళ్లు...!

ప్రత్యేక ఆహారం..

ప్రత్యేక ఆహారం..

పందెం కోళ్ల పెంపకం అంటే కోడికి ఏదో ఒక ఆహారం ఇస్తే సరిపోతుందనుకుంటే పొరబడినట్లే.. బరిలోకి దిగే కోళ్లకు సుమారు సంవత్సరం నుండే మంచి పోషకాలున్న ఆహారాన్ని అందిస్తారు. వీటి మెనూలో ప్రతిరోజూ జీడిపప్పు, బాదం, పిస్తా, కోడిగుడ్డు వంటివి ఉండేలా చూసుకుంటారు. వీటితో పాటు కైమా, కిస్ మిస్ వంటి ఆహారాన్ని సాయంకాలం పూట పెడతారు. నూకలు, జొన్నలు వంటివి తీసుకోవడం వల్ల కోడి బలంగా మారేందుకు ఈ ఆహారం ఎంతగానో ఉపయోగపడుతుందని కోళ్ల పెంపకం నిర్వాహకులు చెబుతున్నారు.

ప్రతిరోజూ వ్యాయామం..

ప్రతిరోజూ వ్యాయామం..

పందెం కోళ్లకు ప్రత్యేక ఆహారంతో పాటు ప్రతిరోజూ వ్యాయామం కూడా చేయిస్తారు. రెగ్యులర్ గా వాకింగ్ చేయించడం.. వారంలో రెండు మూడు సార్లు ఈత కొట్టించడం వంటివి చేస్తారు. అదే సమయంలో బరిలోకి దిగడానికి సరిగ్గా నెల రోజుల ముందు కోళ్లకు ఆహారాన్ని కావాలనే తగ్గిస్తారు. ఎందుకంటే అవి నిత్యం తీసుకునే ఆహారం వల్ల కొంచెం మబ్బుగా ఉంటాయని.. అవి చురుగ్గా ఉండేందుకు, ఆకలితో కసిని పెంచేందుకు ఆహారాన్ని తగ్గిస్తారట.

కోళ్లలో రకాలు..

కోళ్లలో రకాలు..

బరిలోకి దిగే కోళ్లలో సుమారు 50 రకాలుంటాయి. అందులో ముఖ్యమైనవి కాకినెమలి, సితావా, పర్ల, రసంగి, తెల్లనెమలి, పచ్చ, గాజు నెమలి, పూస నెమలి, డేగ, కాకిడేగ మరిన్ని రకాలు ఉంటాయి. కొన్ని రకాల కోళ్లు సాయంకాలం వేళ పందేలు ఆడవు. కొన్ని మాత్రమే ఆడతాయి. అందుకే కొడి పందేలు నిర్వహించేందుకు చెరువు గట్లు, వ్యవసాయ పొలాలు, విశాలమైన ప్రాంగణాలను ఎంచుకుంటారు.

Makar Sankranti 2022:సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి ప్రధాన కారణాలేంటో తెలుసా...

పందెల్లో రకాలు..

పందెల్లో రకాలు..

కోళ్ల జాతి ఆధారంగా వాటి రంగులు కూడా మారుతూ ఉంటాయి. అలాగే వీటిలో ఏ జాతి కోడి ఇంకో జాతిపై ఉసిగొల్పితే విజయం తప్పకుండా వరిస్తుందో కుక్కు శాస్త్రంలో స్పష్టంగా తెలియజేయబడింది. పందెం రాయుళ్లు దీని ప్రకారమే కోళ్ల జాతిని బరిలో దింపేందుకు ఎంపిక చేసుకుంటారు. ఈ శాస్త్రం ప్రకారం కోళ్లలోనే కాదు ఈ పందేలలోనూ మూడు రకాలు ఉన్నాయి. అవేటంటే 1) కత్తి కట్టిన పందెం 2) విడి కాలు పందెం (డెంకీ పందెం) 3) ముసుగు పందెం. ముసుగు పందెం అంటే ఎవరు ఏ కోడిని తెస్తారో ఎవ్వరికి తెలియకుండా ముసుగు వేసి తెస్తారు. బరిలో కోడిని వదిలే దాకా ఎవ్వరికి ఆ కోడి గురించి తెలియదు. మిగిలిన వారు వారి వారి వీలును బట్టి పందెం పద్ధతిని ఎంపిక చేసుకుని వాటిని ఫాలో అవుతారు.

కోళ్ల మధ్య పోరు..

కోళ్ల మధ్య పోరు..

ఈ నేపథ్యంలో కోడి కాళ్లకు కత్తి కట్టే సమయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.కుక్కుట శాస్త్రం ప్రకారం కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి ‘సై‘ అంటూ బరిలోకి దింపుతారు. అవి ఏమో కొదమ సింగాలై అందరి మధ్య పోరు మొదలెడతాయి. అప్పుడే పుంజుల తరపున ఉండే వారు తమ మీసం మెలివేయడం.. తొడలు చరచడం వంటి పనులు చేస్తూ ప్రేక్షకులను అలరించడం వంటివి చేస్తారు.అదే సమయంలో బెట్టింగుల పేరిట వాతావరణాన్ని బాగా వేడెక్కిస్తారు. అంతేకాదు ఈ బెట్టింగులో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల జోక్యం ప్రత్యక్షంగా ఉంటుంది.

‘కోశ’కోడి..

‘కోశ’కోడి..

చివరి వరకు ఏ కోడి గెలుస్తుందో అర్థం కాక పందెం రాయుళ్లు తెగ టెన్షన్ పడిపోతూ ఉంటారు. అయితే ప్రేక్షకుల ఈలలు, చప్పట్లు, కేకలతో పౌరుషాన్ని రగిలిస్తుంటాయి. అయితే ఓడిపోయిన కోడిని ‘కోశ‘ అని అంటారు.

లక్షల్లో కోళ్ల ధరలు..

లక్షల్లో కోళ్ల ధరలు..

కోడి పిల్లలను సుమారు 20 నెలల వరకు బాగా పెంచుతారు. కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అవి పెరిగి పెద్దయిన తర్వాత పందేలకు అమ్ముతారు. ఒక పందెం కోడిని పెంచేందుకు సుమారు రూ.15 వేల రూపాయల వరకు ఖర్చువుతుందట. ఇదిలా ఉండగా.. బరిలోకి దిగే కోడి రకాన్ని బట్టి రూ.12 వేల నుండి 10 లక్షల దాకా అమ్ముడవుతాయని నిర్వాహకులు చెబుతున్నారు.

కోడి పిల్లలకు..

కోడి పిల్లలకు..

కోడిగుడ్లు పెట్టే సమయాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలిస్తారు నిర్వాహకులు. ముఖ్యంగా వేసవి కాలంలో కోడిగుడ్డు పెడుతుంటే.. దాని గంప కింద గోదావరి ఇసుకను కింద వేస్తారు. అదే చలికాలం, వర్షాకాలంలో అయితే ఎండు గడ్డిని ఉంచుతారట. ఈ సమయంలో అవి ఎక్కువగా బయటకు వెళ్లవట. అయితే రోజు విడిచి రోజు ఆహారం కోసం బయటకు వచ్చివెళ్తాయట. అలా గుడ్లు పెట్టిన తర్వాత 21 రోజులకు అవి పిల్లలుగా ఎదుగుతాయి. వాటికి చిన్నప్పుడు నూకలు ఎక్కువగా పెడతారట. ఎందుకంటే అవి తినడం వల్ల వాటికి సులువుగా జీర్ణం అవుతుందట. పది రోజుల తర్వాత కోడిగుడ్లను పెట్టడం వల్ల వాటి ఎదుగుదల బాగుంటుందట.

సంక్రాంతి వేళ ఎలాంటి కోళ్లను బరిలోకి దింపుతారు?

బరిలోకి దిగే కోళ్లలో సుమారు 50 రకాలుంటాయి. అందులో ముఖ్యమైనవి కాకినెమలి, సితావా, పర్ల, రసంగి, తెల్లనెమలి, పచ్చ, గాజు నెమలి, పూస నెమలి, డేగ, కాకిడేగ మరిన్ని రకాలు ఉంటాయి. కొన్ని రకాల కోళ్లు సాయంకాలం వేళ పందేలు ఆడవు. కొన్ని మాత్రమే ఆడతాయి. అందుకే కొడి పందేలు నిర్వహించేందుకు చెరువు గట్లు, వ్యవసాయ పొలాలు, విశాలమైన ప్రాంగణాలను ఎంచుకుంటారు.

English summary

Sankranthi Pandem Kollu:Special Food Menu & Training Rules in Telugu

Here we are discussing about the Sankranti Pandem Kollu:Special food menu and training rules in Telugu. Have a look
Story first published: Wednesday, January 12, 2022, 13:38 [IST]