Just In
- 3 hrs ago
ఉపవాసం ఉండే వారు పద్ధతులు తప్పనిసరిగా పాటించాలి.. లేదంటే కోరికలు నెరవేరట...!
- 4 hrs ago
ఆల్కహాల్ వల్ల బ్లడ్ షుగర్ లో వచ్చే మార్పును ఎలా ఎదుర్కోవాలో మీకు తెలుసా? ఇక్కడ తెలుసుకోండి!
- 4 hrs ago
Carbide Free Mangoes:మామిడిలో కార్బైడ్ కలిసిందా లేదా అనేది ఇలా కనిపెట్టండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి...
- 5 hrs ago
మీ భర్తలోని 'ఈ' లక్షణాల వల్ల మీరు సమస్యల్లో చిక్కుకోవచ్చు...!
Don't Miss
- News
కిన్నెర మొగులయ్య మనస్థాపం: పద్మ శ్రీ వెనక్కి ఇచ్చేస్తా, బీజేపీ నేతలు బదనాం చేస్తున్నారు..
- Sports
బ్యాటింగ్ ఎంచుకోవడానికి కారణమేంటో చెప్పిన హార్దిక్.. ఆర్సీబీ టీం నుంచి సిరాజ్ ఔట్
- Movies
RC15 : రామ్ చరణ్ మరో న్యూ లుక్ వైరల్.. శంకర్ ప్లాన్ మామూలుగా లేదు!
- Technology
ఈ కోడ్ల సాయంతో మీ మొబైల్‌ను ఎవరు ట్రాక్ చేస్తున్నారో కనుగొనవచ్చు
- Automobiles
హ్యుందాయ్ వెన్యూలో చాలా వేరియంట్స్ డిస్కంటిన్యూ.. కొత్త మోడల్ లాంచ్ కోసమేనా..?
- Finance
ఒక్కరోజులో రూ.7 లక్షల కోట్ల సంపద హుష్‌కాకి, ఎల్ఐసీ స్టాక్ మరింత డౌన్
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Saturn Combust in Capricorn:మకరంలో శని దహనం.. 12 రాశిచక్రాలపై పడే ప్రభావం.. పాటించాల్సిన పరిహారాలివే...!
Saturn Combust in Capricorn on 18th January 2022:జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శని గ్రహం గౌరవం, కీర్తి, నిబద్ధత మరియు చిత్తశుద్ధికి ప్రతీక. ఎవరి జాతకంలో అయితే శని బలంగా ఉంటాడో.. వారికి ఉద్యోగంలో ఉన్నత స్థానం, ధన భాగ్యం, వ్యాపారంలో మంచి లాభాలు, నైపుణ్యాలు వంటివి ఉండొచ్చు.
ఇదిలా ఉండగా శని గ్రహం మకర రాశిలో 2022 జనవరి 18వ తేదీన, మంగళవారం నాడు తెల్లవారుజామున 04:18కి దహనం అయ్యింది. ఈ స్థితి నుండి మళ్లీ తిరిగి సాధారణ స్థితికి రావడానికి సుమారు నెలరోజులు పడుతుంది. అంటే 2022 ఫిబ్రవరి 22వ తేదీన రాత్రి 10:50 గంటలకు సాధారణ స్థితి వచ్చే అవకాశం ఉంది.
ఈ కారణంగా ద్వాదశ రాశులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను పొందనున్నారు.. మరి కొన్ని రాశుల అశుభ ఫలితాలను పొందనున్నారు. అయితే ఏయే రాశి వారు ఎలాంటి ఫలితాలను పొందనున్నారు.. ఎవరెవరు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
Mercury
Combust
in
Capricorn:మకరంలో
బుధుడి
అస్తమయం..
ఏ
రాశి
వారికి
ఎక్కువ
నష్టమంటే...!

మేష రాశి..
మకరంలో శని అస్తమించడం వల్ల ఈ రాశి వారు కెరీర్ పరంగా కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. ఈ సమయంలో ఉద్యోగులు ఆఫీసులో రాజకీయాలకు దూరంగా ఉండాలి. మరోవైపు మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో మీరు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే, ముందుగా ఈ విషయంలో అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడి, తర్వాత నిర్ణయం తీసుకోండి. శని అస్తమించే సమయంలో ఈ రాశికి చెందిన కొందరికి జీవిత భాగస్వామితో సైద్ధాంతిక విభేదాలు ఉండొచ్చు.
పరిహారం : ప్రతిరోజూ హనుమాన్ చాలీసాను జపించండి.

వృషభ రాశి..
శని అస్తమించే సమయంలో ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు రావొచ్చు. ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించి మీరు విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులకు ప్రమోషన్ ఇతర ప్రయోజనాల గురించి మంచి శుభవార్తలు వినిపించొచ్చు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయి. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. మీరు కొత్త వ్యాపారం కూడా ప్రారంభించొచ్చు. ఆర్థిక పరంగా ఈ కాలంలో మీరు పొదుపు అవకాశాలను ఎదుర్కొంటారు. మీరు కొత్త పెట్టుబడి పథకాలకు సంబంధించిన ప్రధాన నిర్ణయాలను తీసుకోవడం వల్ల మీకు మంచి ఫలితం రావొచ్చు. ఆరోగ్య పరంగా ఈ కాలంలో ఉత్సాహంగా ఉంటారు.
పరిహారం : శనివారాల్లో యాచకులకు పాత బట్టలు దానం చేయాలి.

మిధున రాశి..
శని అస్తమించే సమయంలో ఈ రాశి వారు తమ లక్ష్యాలను సులభంగా అధిగమించలేరు. మీరు కెరీర్ పరంగా కఠినమైన సవాళ్లను ఎదుర్కోవచ్చు. మీరు అధిక పని ఒత్తిడి భారం కావొచ్చు. ఈ కారణంగా మీరు మీ పనిని సమయానికి పూర్తి చేయలేరు. దీంతో మీరు నిరుత్సాహానికి గురవుతారు. మరోవైపు వ్యాపారులు ఈ కాలంలో నష్టాలను ఎదుర్కొంటారు. ఆర్థిక పరంగా మీరు నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యంగా ఉండేందుకు మీరు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలి.
పరిహారం : ‘ఓం నమో భగవతే వాసుదేవాయ' మంత్రాన్ని రోజూ 11 సార్లు జపించండి.
Mars
Transit
in
Sagittarius:ధనస్సులోకి
కుజుడి
సంచారం..
12
రాశులపై
ఎలాంటి
ప్రభావమంటే...!

కర్కాటక రాశి..
శని అస్తమించే సమయంలో ఈ రాశి వారు వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామిని అనుమానించకుండా ఉండాలి. మీ మనస్సులో ఏదైనా అపార్థం ఉంటే, ముందుగా సంభాషణ ద్వారా దాన్ని స్పష్టం చేయడానికి ప్రయత్నించండి. ఈ సమయంలో మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో మీకు అనవసర ఖర్చులు కూడా పెరగొచ్చు.
పరిహారం : ప్రతిరోజూ 21 సార్లు ‘ఓం నమః శివాయ' మంత్రాన్ని జపించాలి.

సింహ రాశి..
శని అస్తమించే సమయంలో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఉద్యోగులకు కార్యాలయంలో పైఅధికారుల నుండి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారులు తమ తెలివితేటలతో రాణిస్తారు. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక పరంగా ఈ కాలంలో మంచిగా ఉంటుంది. మీరు డబ్బును కూడబెట్టుకోవడానికి మరియు పొదుపు చేసుకునేందుకు అవకాశాలు పెరుగుతున్నాయి. ఆరోగ్య పరంగా ఈరోజు శక్తి మరియు ఉత్సాహ స్థాయి ఎక్కువగా ఉంటుంది.
పరిహారం : శని, సోమవారాల్లో శివాలయంలో పాలు సమర్పించాలి.

కన్య రాశి..
శని అస్తమించే సమయంలో ఈ రాశి విద్యార్థులు తమ విద్యా జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీ ఏకాగ్రత తగ్గొచ్చు. కాబట్టి యోగా ధ్యానం చేయడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు ప్రేమ జీవితంలో ఈ కాలంలో జాగ్రత్తగా ఉండాలి. శని అస్తమించే వేళ మీ ప్రేమికులతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. వారిని మోసం చేయకుండా ఉండాలి. ఈ కాలంలో వివాహితులకు పిల్లలకు సంబంధించిన సమస్యలు కూడా ఉండొచ్చు.
పరిహారం : శనివారం రోజున గేదేలకు పచ్చిగడ్డిని తినిపించండి.
Vishnu
Sahasranamam:విష్ణు
సహస్రనామం
పారాయణం
వల్ల
కలిగే
ప్రయోజనాలేంటో
తెలుసా...

తుల రాశి..
శని అస్తమయం వేళ ఈ రాశి వారికి కొంత ఒత్తిడి ఉండొచ్చు. ఉద్యోగులు ఈ కాలంలో సంతోషంగా ఉండలేరు. మీ సహోద్యోగుల నుండి మీకు అడ్డంకులు ఎదురవ్వొచ్చు. మీరు పైఅధికారులతో కూడా మంచి సంబంధాన్ని కొనసాగించలేకపోవచ్చు. వ్యాపారులు కూడా ఈ కాలంలో నష్టపోయే అవకాశాలున్నాయి. ఆర్థిక పరంగా ఈ కాలంలో ఖర్చులు పెరగొచ్చు. ఆరోగ్య పరంగా కళ్లకు సంబంధించిన సమస్యలు ఉండొచ్చు.
పరిహారం : హనుమాన్ చాలీసాను పఠించండి.

వృశ్చికరాశి..
శని అస్తమయం వేళ ఈ రాశి వారిలో ఉద్యోగులకు అకస్మిక బదిలీలు ఉండొచ్చు. అయితే మీకు ఇష్టం లేని ప్రదేశానికి బదిలీ కావొచ్చు. వ్యాపారులకు ఈ కాలంలో పరిస్థితులు ఉత్తేజకరమైనవిగా ఉండకపోవచ్చు. వ్యాపారులు కొన్ని మోస్తరు లాభాలను పొందొచ్చు. ఆర్థిక పరంగా మీరు మీ కుటుంబం నుండి భారీ ఖర్చుల భారాన్ని భరించాల్సి ఉంటుంది. తద్వారా మీకు పొదుపు చేయడానికి తక్కువ అవకాశం ఉంటుంది.ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి.
పరిహారం : ప్రతిరోజూ లింగాష్టకం జపించండి.

ధనస్సు రాశి..
శని గ్రహం అస్తమించే వేళ ఈ రాశి వారికి ప్రతికూలంగా ఉండొచ్చు. మీరు చేసే ప్రయత్నాల్లో సరైన గుర్తింపు పొందలేరు. ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని మారాలని భావిస్తారు. వ్యాపారులు కొంత లాభాలను అర్జించే అవకాశం ఉంది. మీరు భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నట్లయితే, మీ భాగస్వామితో మీ సంబంధాన్ని జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది. ఈ కాలంలో మీరు ఆర్థిక పరంగా నష్టపోవచ్చు. మీ ప్రయాణాల్లో ఖర్చులు అధికం కావొచ్చు. మరోవైపు ఆరోగ్య పరంగా కొన్ని గొంతు సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు.
పరిహారం : గురువారం రోజున ఉపవాసం పాటించాలి.

మకర రాశి..
ఈ రాశి శని దేవుడు అధిపతిగా ఉంటాడు. ప్రస్తుతం ఇదే సమయంలో శని అస్తమించడం వల్ల ఈ రాశి వారు కొన్ని మానసిక సమస్యలను ఎదుర్కోవచ్చు. ఈ సమయంలో మీరు నిర్ణయం తీసుకునే సామర్థ్యం కూడా బలహీనంగా ఉండొచ్చు. శని అస్తమించే వేళ ఎలాంటి పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. ఈ కాలంలో ఉద్యోగులు కార్యాలయంలో జరిగే రాజకీయాలకు దూరంగా ఉండాలి. లేకుంటే మీరు తప్పుడు ఆరోపణలు ఎదుర్కోవచ్చు. మరోవైపు మీ కుటుంబ జీవితంలో అనేక సమస్యలకు పరిష్కారాలను కనుగొనవచ్చు.
పరిహారం : శని అస్తమయం వేళ భోలేనాథ్ ను ఆరాధించడం వల్ల మీకు శుభప్రదంగా మారుతుంది.

కుంభ రాశి..
ఈ రాశి వారికి శని దేవుని అస్తమయం వేళ ఖర్చులు అధికంగా ఉండొచ్చు. కాబట్టి మీరు చాలా చర్చల తర్వాత డబ్బును కూడా పెట్టుబడి పెట్టాలి. మీరు విదేశీ కంపెనీలో పని చేస్తున్నట్లయితే, ఈ సమయంలో మీ పనిని మీ సీనియర్ అధికారులు లోతుగా పరిశీలించొచ్చు. కాబట్టి తెలివిగా ప్రతిదీ చేయండి. ఈ సమయంలో విద్యార్థులు తప్పుడు ఆలోచనలకు దూరంగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది.
పరిహారం : శుభ ఫలితాల కోసం హనుమాన్ చాలీసాను పఠించాలి.

మీన రాశి..
శని అస్తమించే వేళ.. ఈ రాశి వారికి కెరీర్ పరంగా మంచి ప్రయోజనాలు ఉన్నప్పటికీ, అయితే మీరు సంతోషంగా ఉండకపోవచ్చు. కాబట్టి మీరు పని చేసే ముందు కష్టపడే పరిస్థితులను కనుగొనవచ్చు. ఈ కాలంలో మీరు వివిధ ఉద్యోగావకాశాలను కూడా కోల్పోవచ్చు. మీరు వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లయితే, మీరు నష్టపోయే అవకాశాలు ఉన్నందున మీరు మీ వ్యాపార పనితీరును క్రమం తప్పకుండా పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ కాలంలో మీరు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
పరిహారం : శనివారం రోజున శని దేవునికి పూజ చేయాలి.
శని గ్రహం మకర రాశిలో 2022 జనవరి 18వ తేదీన, మంగళవారం నాడు తెల్లవారుజామున 04:18కి దహనం అయ్యింది. ఈ స్థితి నుండి మళ్లీ తిరిగి సాధారణ స్థితికి రావడానికి సుమారు నెలరోజులు పడుతుంది. అంటే 2022 ఫిబ్రవరి 22వ తేదీన రాత్రి 10:50 గంటలకు సాధారణ స్థితి వచ్చే అవకాశం ఉంది. ఈ కారణంగా ద్వాదశ రాశులపై తీవ్ర ప్రభావం పడనుంది.