For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సొంత రాశిలోకి శని సంచారం.. 12 రాశులపై పడే ప్రభావం.. పాటించాల్సిన పరిహారాలివే...

|

జ్యోతిష్యశాస్త్రం గ్రహాలలో శని గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. 2021 సంవత్సరంలో అక్టోబర్ 11వ తేదీన అంటే సోమవారం నాడు తెల్లవారుజామున 3:44 గంటలకు శని గ్రహం తన స్థానం నుండి మరో స్థానంలోకి మారనుంది.

ఈ సమయంలో తన సొంత రాశి అయిన మకరంలోకి సంచారం చేయనున్నాడు. ఇదే రాశిలో 29 ఏప్రిల్ 2022 వరకు నివాసం ఉండనున్నాడు. ఆ తర్వాత కుంభ రాశిలోకి ప్రయాణం చేయనున్నాడు. ఈ నేపథ్యంలో ద్వాదశ రాశిచక్రాలపై ప్రభావం కనిపిస్తుంది.

నవ గ్రహాల్లో అందరికంటే మెల్లగా ప్రయాణం చేసే గ్రహం శని. శని తన స్థానం నుండి మరో రాశిలోకి ఆగమనం చేయడానికి సుమారు రెండున్నరేళ్లు పడుతుంది. అయితే ప్రస్తుతం శని తన రాశి అయిన మకరం నుంచి కొంత వేగంగా తిరోగమనం చెందనుంది. దీన్నే తిరోగమన చలనం అని కూడా అంటారు. శని తిరోగమనం సమయంలో కష్టాలు పడ్డ వారు ఈ కాలంలో కొన్ని శుభ ఫలితాలను పొందుతారు. ఈ సందర్భంగా ఏయే రాశుల వారికి శుభ ఫలితాలొస్తాయి.. ఏయే రాశుల వారికి అశుభఫలితాలొస్తాయి. ఏయే పరిహారాలను పాటించాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ వారం మీ జాతకం ఎలా ఉందో తెలుసుకోండి...

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి నుండి శని గ్రహం పదో స్థానం నుండి మకరంలోకి ప్రవేశించనున్నాడు ఇలా శని సంచారం వల్ల ఈ రాశి వారిలో ఉద్యోగులకు శుభప్రదంగా ఉంటుంది. ఆఫీసులో ఇప్పటివరకు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే, అవన్నీ ఇప్పుడు తొలగిపోతాయి. మీరు పురోగతి గురించి కొన్ని శుభవార్తలు కూడా వింటారు. నిరుద్యోగులు కూడా ఉద్యోగానికి సంబంధించి కొన్ని శుభవార్తలు వింటారు. మరోవైపు వ్యాపారులు ఈ కాలంలో జాగ్రత్తగా ఉండాలి. మీకు ఏదైనా సమస్య వస్తే అనుభవం ఉన్న వారిని సంప్రదించాలి. ఇంకోవైపు మీ వైవాహిక జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది. అయితే ఈ కాలంలో మీరు సానుకూలంగా ఉంటారు. ఈ కారణంగా మీరు అనేక అడ్డంకులను అధిగమిస్తారు.

పరిహారం : ప్రతిరోజూ ఏడుసార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి నుండి శని గ్రహం తొమ్మిదో పాదం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో మీకు అనుకూల ఫలితాలొస్తాయి. అయితే మీ గురువులతో సంబంధం అంతగా బాగుండదు. మరోవైపు వ్యాపారులు ఏదైనా పెద్ద పెట్టుబడి పెట్టాలని ఆలోచన చేయొచ్చు. ఇలాంటి సమయంలో అనుభవం ఉన్న వారి సలహాలను తీసుకోవాలి. మరోవైపు మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు ఉండొచ్చు. అయితే మీరు వీటి నుండి కొత్త విషయాలను నేర్చుకుంటారు.

పరిహారం : శనివారం రోజున శనిదేవుని ముందు ఆవ నూనె దీపం వెలిగించాలి.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి నుండి శని గ్రహం ఎనిమిదో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కారణంగా మిధున రాశి వారికి సానుకూల ఫలితాలు రావొచ్చు. ఈ కాలంలో మీకు ఆరోగ్య పరంగా మంచి ప్రయోజనాలు వస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే మంచి ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగులకు కూడా ఈ కాలంలో ఊహించిన ఫలితాలొస్తాయి. మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. వ్యాపారంలో పెట్టుబడులను పూర్తిగా సద్వినియోగం చేసుకోగలుగుతారు.

పరిహారం : శనివారం రోజున పేదలకు దుప్పటి దానం చేయాలి.

Navratri 2021: నవరాత్రుల వేళ 12 రాశిచక్రాల భవిష్యత్తు ఎలా ఉంటుందంటే...!

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి నుండి శని గ్రహం ఏడో పాదం గుండా ప్రయాణం చేయనున్నాడు. ఈ సమయంలో అవివాహితులకు పెళ్లి గురించి కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. మరోవైపు వివాహితులకు అత్తమాలతో కొన్ని ఇబ్బందులు రావొచ్చు. ఉద్యోగులు కూడా ఈ కాలంలో సహోద్యోగులతో కొన్ని వివాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఆఫీసులో, మీకు అప్పగించిన అన్ని ప్రాజెక్టులలో విజయవంతంగా రాణిస్తారు.

పరిహారం : శనివారం రోజున ఉపవాసం పాటించాలి. సాయంత్రం మాత్రమే తినాలి.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి నుండి శని గ్రహం ఆరో పాదం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో ఉద్యోగులకు ఆఫీసులో గొప్ప అవకాశాలు లభిస్తాయి. ఇది మీ కెరీర్ కు బలాన్ని ఇస్తుంది. అయితే మీరు కష్టపడి పని చేయాలి. మీ నైపుణ్యాలను పెంచుకోవడానికి ఇది సరైన సమయం. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలను సాధిస్తారు. అయితే మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు ఉండొచ్చు. మీరు ప్రశాంతంగా ఉండాలి.

పరిహారం : శనివారం రోజున దేవాలయంలో నల్ల నువ్వులను దానం చేయాలి.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి నుండి శని గ్రహం ఐదో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో మీరు కొన్ని శుభవార్తలను వింటారు. మీ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. మీరు మీ పిల్లలతో బంధంపై కొంచెం శ్రద్ధ వహించాలి. విద్యార్థులకు ఈ కాలంలో కొన్ని సమస్యలు ఎదురుకావొచ్చు. మీ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. అయితే మీరు నైపుణ్యాలను పెంచుకోవాలి.

పరిహారం : శని మంత్రాన్ని శనివారం రోజున 108 సార్లు జపించాలి.

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి నుండి శని గ్రహం నాలుగో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సందర్భంగా తుల రాశి వారికి సానుకూల ఫలితాలొస్తాయి. మీ కుటుంబ జీవితంలో మంచి వాతావరణం ఉంటుంది. మీకు మీ కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఈ కాలంలో మీరు ఆదాయ పరంగా అద్భుతంగా ఉండటంతో కొత్త వాహనం లేదా ఇంకేదైనా కొత్త వాటిని కొనే అవకాశం ఎక్కువగా ఉంది. మీరు ఈ కాలంలో ఏ ప్రయత్నం చేసినా కచ్చితంగా విజయం సాధిస్తారు.

పరిహారం : మీ మెడలో లేదా మీ మణికట్టు మీద స్పష్టమైన క్వార్ట్జ్ క్రిస్టల్ ధరిస్తే శుభఫలితాలొస్తాయి.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి నుండి శని గ్రహం మూడో స్థానం నుండి ప్రవేశించనున్నాడు. ఈ కాలంలో ఉద్యోగులకు ఆఫీసులో సీనియర్లతో సంబంధాలు మెరుగుపడతాయి. మీరు మీ పనిలో విజయం సాధిస్తారు. మీరు మీ ఆరోగ్యంపై కూడా కొంచెం శ్రద్ధ వహించాలి. మీ కుటుంబ సభ్యులతో కొన్ని సమస్యలు ఉండొచ్చు. అయితే మీరు కొన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు.

పరిహారం : దేవాలయాలకు కొళాయి లేదా వాటర్ ఫిల్టర్ ను దానం చేస్తే శుభ ఫలితాలొస్తాయి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి నుండి శని గ్రహం రెండో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో ఈ రాశి వారికి సానుకూల ఫలితాలొ స్తాయి. మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగులు కూడా ఈ కాలంలో ఊహించిన ఫలితాలను పొందుతారు. మీరు పురోగతిని సాధించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలను ఈ కాలంలో అధిగమించే అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాపారులకు ఈ కాలంలో శుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది.

పరిహారం : మీ చేతికి ఒక అమెథిస్ట్ బ్రాస్లైట్ ధరించండి.

మకర రాశి..

మకర రాశి..

తన సొంత రాశి అయిన మకరంలోకే శని ప్రవేశించనున్నాడు. రెండున్నరేళ్ల తిరిగి మకర రాశిలోకి శని గ్రహం రావడం వల్ల ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో వ్యాపారులకు సానుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు చాలా డబ్బును ఆదా చేస్తారు. దీని వల్ల మీకు దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. విదేశాల్లో పని చేసే వారు కూడా ఈ సమయంలో సానుకూల ఫలితాలను పొందుతారు. మీరు ఏదైనా లక్ష్యాన్ని చేరుకోవాలని పని చేస్తుంటే, అది కూడా నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంది.

పరిహారం : మీ జీవితంలో ఉత్తమ ఫలితాల కోసం యోగా మరియు ద్యానం చేయాలి.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి నుండి శని గ్రహం 12వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో ఈ రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. ముఖ్యంగా మీరు ఈ సమయంలో ఆధ్యాత్మిక రంగంపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. విదేశాలకు సంబంధించిన వ్యాపారం చేసే వారికి ఈ కాలంలో శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ కాలంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. మీ వ్యక్తిగతమైన జీవితంలో చాలా అనుకూలమైన మార్పులు ఉంటాయి. ఉద్యోగులు కార్యాలయంలో అందరి ద్రుష్టిని ఆకర్షించగలుగుతారు.

పరిహారం : శనివారం రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి నుండి శని గ్రహం 11వ స్థానం నుండి ప్రయాణం చేయనుంది. ఈ కాలంలో మీరు వివిధ వనరుల నుండి ఆదాయాన్ని పొందుతారు. మీ కుటుంబ సభ్యులు మరియు జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు. మీ కలలన్నీ నెరవేరుతాయి. విద్యార్థులు సానుకూల ఫలితాలను పొందుతారు. అంతేకాదు కొత్త అవకాశాలను సైతం పొందుతారు.

పరిహారం : శనివారం రోజున కూలీలకు భోజనం పెట్టాలి.

2021లో శని మకరంలోకి ఎప్పుడు ప్రవేశించనున్నాడు?

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం 11 అక్టోబర్ 2021న అంటే సోమవారం నాడు తెల్లవారుజామున 3:44 గంటలకు తన సొంత రాశి అయిన మకర రాశిలోకి శని ప్రవేశించనున్నాడు.

English summary

Saturn Direct In Capricorn on 11 October 2021 Effects and Remedies on 12 Zodiac Signs in Telugu

Saturn Turns Direct in Capricorn : Saturn Direct In Capricorn Effects on Zodiac Signs in Telugu : The Saturn Direct In Capricorn will take place on 11th October 2021. Learn about remedies to perform in Telugu.