For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Saturn Retrograde in Aquarius 5 June 2022: కుంభంలో శని తిరోగమనం.. ఈ రాశులకు సానుకూలం..!

శని దేవుని తిరోగమనం వల్ల ఏయే రాశిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శని దేవుడికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎవరి జాతకంలో అయితే శని దేవుని అనుగ్రహం ఉంటుందో వారికి ఎలాంటి కష్టాలున్నా సులభంగా తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు.

Saturn Retrograde in Aquarius 5 June 2022 Impact and Remedies on Zodiac Signs in Telugu

అయితే అదే సమయంలో ఎవరి జాతకంలో అయితే శని దేవుని వ్యతిరేక ప్రభావం ఉంటుందో వారు ఎంత కష్టపడినా ఫలితం మాత్రం ప్రతికూలంగానే వస్తుంది. ఎందుకంటే గ్రహాలన్నింటిలో అతి నెమ్మదిగా ప్రయాణించేది కూడా శని గ్రహమే.

Saturn Retrograde in Aquarius 5 June 2022 Impact and Remedies on Zodiac Signs in Telugu

ఈ శని దేవుని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని చాలా మంది నమ్ముతారు. ఈ నేపథ్యంలో జూన్ 5వ తేదీన అంటే ఆదివారం తెల్లవారుజామున 4:14 గంటలకు శని దేవుడు కుంభరాశిలోకి తిరోగమనం చెందనున్నాడు.

Saturn Retrograde in Aquarius 5 June 2022 Impact and Remedies on Zodiac Signs in Telugu

ఈ సమయంలో ద్వాదశ రాశులపై కచ్చితంగా ప్రభావం పడుతుంది. ఈ సందర్భంగా శని దేవుని తిరోగమనం వల్ల ఏయే రాశి వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..

మేష రాశి..

ఈ కాలంలో మేష రాశి వారు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు పురోగతి లభిస్తుంది. వ్యాపారానికి సంబంధించిన వ్యక్తుల ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాన్వేషణ ముగిసే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈ కాలంలో మంచిగా ఉంటుంది. మీ డబ్బు సమస్యలు తొలగిపోవచ్చు.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి వారికి శని తిరోగమనం వల్ల మిశ్రమ ఫలితాలొస్తాయి. ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని మార్చాలనుకుంటే, మంచి అవకాశం పొందొచ్చు. వ్యాపారులు ఈ కాలంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ జీవిత భాగస్వామితో విభేదాలు తీవ్రమయ్యే అవకాశం ఉంది. మీరు మానసికంగా కొంత బలహీనంగా ఉంటారు. మీ ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంటుంది. అయితే మీ ఖర్చులను నియంత్రించుకోవాలి.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి వారికి శని తిరోగమనం వల్ల ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీకు ఇప్పటికే ఏదైనా వ్యాధి ఉన్నట్లయితే, మీరు మరింత శ్రద్ధ వహించాలి. మీ తోబుట్టువులతో సంబంధాలు చెడిపోతాయి. ఈ కాలంలో మీరు ప్రయాణాలకు దూరంగా ఉండాలి.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారు ఈ కాలంలో ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. మీరు మానసికంగా కూడా బలంగా ఉంటారు. ముఖ్యమైన నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకుంటారు. మీ జీవిత భాగస్వామితో ప్రేమ పెరుగుతుంది. ఉద్యోగులకు కార్యాలయంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులు ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటే, ఈ కాలంలో శుభవార్తలు వినిపిస్తాయి.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారు ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీ ప్రత్యర్థులు మిమ్మల్ని దెబ్బతీయొచ్చు. మరోవైపు విదేశాల్లో పనిచేసే వారికి ఈ సమయం మంచిగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో మీరు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయకూడదు.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారికి శని తిరోగమనం వల్ల ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఏర్పడతాయి. మీకు దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రత్యర్థులు మీకు సమస్యలను కలిగించొచ్చు. మీరు కష్టపడి పని చేసినా మంచి ఫలితాలను పొందలేరు. ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు మానసికంగా బలహీనంగా ఉంటారు.

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి వారికి శని తిరోగమనం వల్ల సానుకూల ఫలితాలొస్తాయి. ముఖ్యంగా మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. అయితే విద్యార్థులకు కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి. ఈ కాలంలో మీ తల్లి ఆరోగ్యం కూడా బలహీనంగా ఉండొచ్చు. ఆరోగ్య పరంగా మీ మానసిక ఒత్తిడి పెరుగుతుంది.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి వారికి శని తిరోగమనం వల్ల కుటుంబ జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. అయితే ఆర్థిక పరంగా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు కార్యాలయంలో చాలా గొప్ప ఫలితాలను పొందే అవకాశం ఉంది. మీరు కొన్ని శుభవార్తలను కూడా పొందవచ్చు. మీ ప్రియమైన వారి భావాలను గౌరవించాలి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి వారు ఈ కాలంలో చాలా రంగాల్లో విజయం సాధిస్తారు. మీరు చాలా కాలంగా ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నిస్తుంటే, శని దేవుని అనుగ్రహం వల్ల ఈ కాలంలో ఉద్యోగం పొందొచ్చు. మీకు తోబుట్టువులతో సంబంధం బాగుంటుంది. మీరు వారి మద్దతును పొందుతారు. ఈ కాలంలో కుటుంబానికి సంబంధించి కొన్ని ఆందోళనలు ఉండొచ్చు.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారికి శని తిరోగమనం వల్ల సానుకూల వాతావరణం ఉంటుంది. మీరు చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే, మీరు వెంటనే దాని నుండి బయటపడతారు. విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్ష రాస్తే విజయం సాధించే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈ కాలంలో మంచిగా ఉంటుంది. మరోవైపు మీ కుటుంబ జీవితంలో కొంత గందరగోళంగా ఉంటుంది.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశిలోకి శని దేవుడు తిరోగమనం చేయడం వల్ల కుంభ రాశి వారు ఎలాంటి సమస్యలైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. మీ కెరీర్ కొత్త దిశలో పయనిస్తుంది. మీరు విద్యార్థి అయితే, మీ పరీక్ష ఫలితాల కోసం వేచి ఉన్నట్లయితే, మీరు మీ కష్టానికి తగిన ఫలితాలను పొందే అవకాశం ఉంది. మీరు మీ జీవిత భాగస్వామి యొక్క మద్దతును పొందుతారు.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి వారు శని తిరోగమనం వల్ల ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ ఖర్చులు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టొచ్చు. మీరు ఆర్థిక పరిమితులను కూడా ఎదుర్కోవచ్చు. ఆరోగ్య పరంగా ఈ కాలంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకండి. ఆర్థిక పరంగా కొన్ని సమస్యలు కూడా పెరుగుతాయి. మీ వైవాహిక జీవితంలో కొంత అసమ్మతి ఉండొచ్చు.

FAQ's
  • 2022లో శని గ్రహం ఏ రాశిలోకి ఎప్పుడు తిరోగమనం చెందనుంది?

    గ్రహాలన్నింటిలో అతి నెమ్మదిగా ప్రయాణించేది కూడా శని గ్రహమే. ఈ శని దేవుని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని చాలా మంది నమ్ముతారు. ఈ నేపథ్యంలో జూన్ 5వ తేదీన అంటే ఆదివారం తెల్లవారుజామున 4:14 గంటలకు శని దేవుడు కుంభరాశిలోకి తిరోగమనం చెందనున్నాడు. ఈ సమయంలో ద్వాదశ రాశులపై కచ్చితంగా ప్రభావం పడుతుంది. ఈ సందర్భంగా శని దేవుని తిరోగమనం వల్ల ఏయే రాశి వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

English summary

Saturn Retrograde in Aquarius 5 June 2022 Impact and Remedies on Zodiac Signs in Telugu

Saturn retrograde in Aquarius will take place on June 5, 2022, Sunday at 4:14 AM. Let us now know in detail the astrological effect and remedies of Saturn retrograde in Aquarius on all the zodiac signs
Story first published:Friday, June 3, 2022, 22:48 [IST]
Desktop Bottom Promotion