Latest Updates
-
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026
Saturn Rise on 9 February:శని మేల్కొవడం వల్ల ఈ రాశుల వారికి ప్రయోజనం...!
శని స్థానం మార్పు వల్ల ఈ రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుందట.
గ్రహాలలో శని గ్రహానికి ప్రత్యేక స్థానముంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శని గ్రహం ఫిబ్రవరి 9వ తేదీన శని గ్రహం తన స్థానాన్ని మార్చుకోబోతుంది.

ఇలా ఏ గ్రహమైనా ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశించినప్పుడు మరియు బయటకు వెళ్లినప్పుడు మిగతా రాశిచక్రాలపై ఎంతో కొంత ప్రభావం అనేది పడుతుంది. ఇప్పటికే ఈ సంవత్సరం ప్రారంభ నెల అయిన జనవరిలో 5వ తేదీన శని గ్రహం మకర రాశిలో అస్తమించాడు.

ఆ తర్వాత ఫిబ్రవరి 9వ తేదీన అంటే మంగళవారం నాడు అర్థరాత్రి 12.50 గంటలకు తిరిగి ఉదయించనున్నాడు. ఇలా శని ప్రభావం వల్ల అనేక మార్పులు జరగనున్నాయి. శని ఉదయించడం వల్ల చాలా మందిపై తీవ్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో ద్వాదశ రాశులలోని కొన్ని రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు కూడా వచ్చే అవకాశముంది. ఈ సందర్భంగా ఏ రాశి చక్రాలకు సానుకూలంగా ఉంటుంది.. ప్రతికూలంగా ఎవరికి ఉంటుంది.. ఆ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడే చూసెయ్యండి...

మేష రాశి..
ఫిబ్రవరి 9వ తేదీన శని ఉదయించడం వల్ల ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీ కష్టాలన్నీ తొలగిపోవచ్చు. ఉద్యోగులకు ఆఫీసులో ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థులకు విద్యారంగంలో సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మీరు అనుకున్న సమయానికే పనులన్నీ పూర్తవుతాయి. అధికారులు కూడా మీ పనితీరును మెచ్చుకుంటారు. ముఖ్యంగా పెండింగులో ఉన్న పనులను చాలా వేగంగా పూర్తి చేస్తారు. శని ప్రభావం వల్ల వ్యాపారులకు నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. మీకు స్నేహితులు, కుటుంబ సభ్యుల యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది.

కర్కాటక రాశి..
ఈ రాశి వారికి శని ప్రభావం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు మీ భవిష్యత్ గురించి ప్రణాళికలు రచిస్తారు. మీ లైఫ్ లో మీకు ప్రశాంతత లభిస్తుంది. మీరు పనులన్నీ ఒక ప్రణాళిక ప్రకారం నెరవేరుస్తారు. మీ తెలివితేటలతో మీ సామర్థ్యాన్ని పెంచుకుంటారు. శని దేవుని అనుగ్రహం వల్ల మీకు కొంతమంది పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇది మీ స్థాయిని మరింత పెంచుతుంది. మీ పెళ్లి జీవితంలో కూడా సమస్యలన్నీ తొలగిపోతాయి.

కన్య రాశి..
శని ఉదయించడం వల్ల ఈ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యల నుండి ఈ సమయంలో బయటపడే అవకాశం ఉంది. ఉద్యోగులు కూడా తమ పని ప్రదేశంలో సానుకూలంగా ఉంటారు. మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. మీ కుటుంబ జీవితంలో ఆనందం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా రావొచ్చు. శని గ్రహం ప్రభావం వల్ల మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీకు సకాలంలో డబ్బు కూడా అందుతుంది.

వృశ్చిక రాశి..
శని గ్రహం మార్పు వల్ల ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అకస్మాత్తుగా మీకు ఊహించని అద్భుతమైన ఫలితాలొస్తాయి. ముఖ్యంగా మీకు పాత బకాయిల నుండి పెద్ద ఉపశమనం లభిస్తుంది. మీ పూర్వీకుల వ్యాపారంతో సంబంధం కలిగి ఉంటే వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఉంది. మీ వివాహ జీవితంలో కూడా పురోగతి ఉంటుంది. శని అనుగ్రహం వల్ల విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు వస్తాయి. విద్యార్థులకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయే అవకాశం ఉంది. వ్యాపారులకు పెట్టుబడి పెట్టేందుకు మార్గం సులభమవుతుంది. మీకు సమయానికి డబ్బులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మకర రాశి..
ఈ రాశి వారికి శని అనుగ్రహం కారణంగా మంచి ఫలితాలు రానున్నాయి. దీని కారణంగా మీ ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే ఉద్యోగులకు మాత్రం పని ఒత్తిడి పెరుగుతుంది. కానీ మీరు కష్టపడి, శ్రద్ధతో పని చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులు తమ వ్యాపారంలో లాభాలు కావాలంటే, చాలా రోజులు వేచి ఉండాల్సి ఉంటుంది. ఆదాయ పరంగా మీరు చేసే ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు వస్తాయి.

కుంభ రాశి..
ఈ రాశి వారికి శని ఉదయించడం వల్ల సానుకూల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగులకు ఉన్నతాధికారుల ప్రశంసలు లభించడమే కాదు.. వారికి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. మరికొందరికి వేతనాలు పెరుగుతాయి. శని గ్రహ ప్రభావంతో మీ కుటుంబంలో ఉండే సమస్యలన్నీ తొలగిపోవచ్చు. మీ సామాజిక పరిధి కూడా విస్తరిస్తుంది. మీకు జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీకు దీర్ఘకాల ప్రయోజనాలు కూడా లభిస్తాయి.



Click it and Unblock the Notifications