Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
Saturn Transit 2022 in Aquarius:శని సంచారంతో ఈ 4 రాశులకు అద్భుత ప్రయోజనాలు...!
కుంభంలోకి శని సంచారం చేయడం వల్ల, ఈ రాశులకు ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయట.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో శని గ్రహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మిగిలిన గ్రహాలు మనపై ప్రభావం చూపినా.. చూపకపోయినా.. శని గ్రహ ప్రభావం మనపై కచ్చితంగా ఉంటుందని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఎందుకంటే ఈ శని గ్రహం అన్ని గ్రహాల కన్నా చాలా నెమ్మదిగా ప్రయాణం చేస్తుంది. అందుకే దీన్ని స్లో మూనింగ్ అని అంటారు. ఇది ఒక రాశి నుండి మరో రాశికి మారేందుకు సుమారు రెండున్నర సంవత్సరాలు పడుతుంది.

ప్రస్తుతం ఈ శని మకర రాశిలో నివాసం ఉంటున్నాడు. 2022 కొత్త సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో 29వ తేదీన కుంభ రాశిలోకి రవాణా చేయనున్నాడు. ఇదే రాశిలో 2022 సంవత్సరం జులై 11వ తేదీ వరకు సంచారం చేసి.. తిరిగి మకర రాశిలోకి తిరోగమనం చెందన్నాడు. ఆ తర్వాత 2023 జనవరి 18వ తేదీన మళ్లీ కుంభ రాశిలోకి వెళ్లనున్నాడు.

దీంతో ఆరు నెలల పాటు శని ప్రభావం అనేది ఉంటుంది. అయితే శని గ్రహాన్ని చాలా మంది చెడు ఫలితాలిచ్చే దేవునిగా భావిస్తారు. అయితే అందులో ఏ మాత్రం నిజం లేదని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే శని భగవానుడు శుభ ఫలితాలైనా.. చెడు ఫలితాలైనా ఒకే మాదిరిగా చూపుతాడు. అంటే శని గ్రహం శుభ స్థానంలో ఉంటే.. మంచి ఫలితాలను, అదే చెడు స్థానంలో ఉంటే చెడు ఫలితాలను కచ్చితంగా చూపుతాడు. అందుకే చాలా మంది శని గ్రహ సంచారం గురించి ఎక్కువ ఆందోళన చెందుతారు. అయితే సాధారణంగా శని 3, 6, 7, 10వ స్థానాల్లో ఉంటే శుభ ఫలితాలొస్తాయని శాస్త్రం ద్వారా తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. శని గ్రహ మార్పుతో ఏ రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయి.. ఈ జాబితాలో మీ రాశి ఉందా లేదా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

వృషభ రాశి..
శని గ్రహం మకర రాశి నుండి కుంభ రాశిలోకి సంచారం చేసే సమయంలో ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. వృషభ రాశి వారికి శని దేవుని అనుగ్రహం లభిస్తుంది. ఈ రాశి నుండి పదో స్థానంలోకి శని గ్రహం రావడంతో వీరికి ఒక్కసారిగా ఊహించని ఫలితాలొస్తాయి. ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాల్లో లాభాలను పొందుతారు. వ్యాపారులకు, ఉద్యోగులు ఈ కాలంలో మంచి విజయాలను సాధిస్తారు.

సింహ రాశి..
కుంభ రాశిలోకి శని సంచారం చేసే సమయంలో సింహ రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. ఈ రాశి నుండి ఏడో స్థానంలో రవాణా చేయడం వల్ల సింహ రాశి వారి జీవితం మలుపు తిరిగే అవకాశం ఎక్కుగా ఉంది. ముఖ్యంగా ఆదాయ పరంగా అద్భుతమైన అవకాశాలను పొందుతారు. ఉద్యోగులు కూడా తాము కోరుకున్న బదిలీలను దక్కించుకుంటారు. వ్యాపారులు కూడా ఊహించినంత లాభాలను పొందుతారు.

కన్య రాశి..
ఈ రాశి నుండి శని షష్టమ భాగం నుండి సంచారం చేయనున్నాడు. దీంతో కన్య రాశి వారికి కూడా శని దేవుని అనుగ్రహం కచ్చితంగా లభిస్తుంది. ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ సులభంగా వచ్చేస్తాయి. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న దీర్ఘకాల సమస్యలన్నీ తొలగిపోతాయి. ఉద్యోగులు, వ్యాపారులు ఈ కాలంలో అద్భుత విజయాలను సాధిస్తారు.

ధనస్సు రాశి..
ఈ రాశి వారికి శని గ్రహం మార్పు వల్ల జీవితంలో మెరుగైన ఫలితాలు రానున్నాయి. ప్రధానంగా ఆర్థిక పరమైన విషయాల్లో ఊహించని లాభాలొస్తాయి. ఈ కాలంలో మీకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని అవలీలగా ఎదుర్కొంటారు. విద్యార్థులు, ఉద్యోగులు విదేశీ యానం చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఊహాలపై ఆధారపడి ఉంటుంది. వీటిని పరిగణనలోకి తీసుకునే ముందు మీరు వ్యక్తిగత జ్యోతిష్య నిపుణుని సంప్రదించి నిర్ణయాలు తీసుకోగలరు.
శని గ్రహం అన్ని గ్రహాల కన్నా చాలా నెమ్మదిగా ప్రయాణం చేస్తుంది. అందుకే దీన్ని స్లో మూనింగ్ అని అంటారు. ఇది ఒక రాశి నుండి మరో రాశికి మారేందుకు సుమారు రెండున్నర సంవత్సరాలు పడుతుంది. ప్రస్తుతం ఈ శని మకర రాశిలో నివాసం ఉంటున్నాడు. 2022 కొత్త సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో 29వ తేదీన కుంభ రాశిలోకి రవాణా చేయనున్నాడు. ఇదే రాశిలో 2022 సంవత్సరం జులై 11వ తేదీ వరకు సంచారం చేసి.. తిరిగి మకర రాశిలోకి తిరోగమనం చెందన్నాడు. ఆ తర్వాత 2023 జనవరి 18వ తేదీన మళ్లీ కుంభ రాశిలోకి వెళ్లనున్నాడు.



Click it and Unblock the Notifications