For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ సంకేతాలను బట్టి అమ్మాయిల వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోవచ్చు...!

|

ఈ ప్రపంచంలో ఎప్పటికీ అర్థం కాని విషయం ఏదైనా ఉందంటే అది మహిళల మనసులను తెలుసుకోవడం. అయితే ఈ విశ్వంలోని కొందరు పురుషులు మాత్రం స్త్రీలను తాము సరిగ్గా అర్థం చేసుకున్నామని భావిస్తారు. అయితే దురదృష్టవశాత్తు ఎవరూ దీన్ని అధిగమించలేరు.

ఎందుకంటే మహిళల ప్రవర్తన ఆశ్చర్యకరంగా మరియు రహస్యాల నిధి మాదిరిగా ఉంటుంది. వారి మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం.

అయితే అమ్మాయిలలోని ముఖ కవళికలను బట్టి, వారి జీవనశైలిని బట్టి, షాపింగును బట్టి వారి గురించి కొంత వరకు తెలుసుకోవచ్చని చాలా మంది మగవారు చెబుతున్నారు.

అయితే వారిలో ఏముంది అని కచ్చితంగా తెలుసుకోవడం చాలా కష్టమైన పని. మనలో అందరికీ అందరు అమ్మాయిలను దగ్గర నుండి చూసే అవకాశం రాకపోవచ్చు. కానీ, వాస్తవం ఏమిటంటే, వారిని మనం ఎప్పుడు కొత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...

స్త్రీ వ్యక్తిత్వాన్ని..

స్త్రీ వ్యక్తిత్వాన్ని..

మహిళల గురించి తెలుసుకోవడం అంత సులభం కాదు. కానీ అసాధ్యమైతే కాదు. సైన్స్ దాని స్వంత మార్గదర్శకాలను కనుగొంది. తద్వారా మీరు స్త్రీ వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు. మీకు ఇష్టమైన అమ్మాయిని కేవలం అనుసరిస్తే సరిపోదు. ఆమె గురించి మీకు కొంత జ్ఞానం అవసరం. స్త్రీల గురించి చాలా మంది అంచనాలు వేస్తుంటారు. ఈ అంచనాలు ఎప్పుడూ అపరిమితంగా ఉంటాయి. అయితే అందుకు అమ్మాయిలు కారణం కాదని గుర్తించాలి. ఎందుకంటే ఒక స్త్రీని అంచనా వేయడం అంటే, ఆమెను కించపరిచినట్లు అర్థం.

ఫేస్ రీడింగ్..

ఫేస్ రీడింగ్..

దీని ప్రకారం స్త్రీలను అర్థం చేసుకోవడం ఎప్పటికీ జరగదు అని కాదు. మన విజ్ణానం ఆధారంగా స్త్రీల యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. మరి ఆ మార్గాలు ఏమిటి ? వాటిని ఉపయోగించి స్త్రీల మనస్సుని ఎలా గెలుచుకోవచ్చు అనే విషయాలని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మీ యొక్క వ్యక్తిత్వానికి మీ ముఖమే అద్దంలా నిలుస్తుంది. మీరు కోపంగా ఉన్నప్పుడు మీ యొక్క ముఖం ఎలా ఉబ్బిపోతుందో మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు ఆనందంగా ఉన్నప్పుడు మీ మొహం ఎంతలా వెలిగిపోతుందో మీరు ఎప్పుడైనా చూసారా ? ఇవే కాకుండా మీ ముఖం అన్ని రకాల భావోద్వేగాలను స్పష్టంగా చెప్పగలదు. ప్రేమ, కోపం, అభిరుచి ఇలా ఏ భావోద్వేగపరమైన అంశాన్ని అయినా మీరు మీ ముఖం ద్వారా తెలియజేయవచ్చు.

ముఖ విశ్లేషణ

ముఖ విశ్లేషణ

వేదాలు, జ్యోతిషశాస్త్రం ప్రకారం, స్త్రీ ముఖం వాటిలో నమోదు చేయబడిన అన్ని భావోద్వేగాలను కలిగి ఉంటుంది. అభిరుచితో లేదా దూకుడుగా, విపరీతమైన కోపం లేదా ఓపిక, బహుముఖంగా లేదా లోపల ఆలోచించే స్వభావం ఉన్న వ్యక్తిగా ఇలా ఎన్నో రకాల విషయాలను స్త్రీ ముఖం తెలియజేస్తుంది. స్త్రీ ముఖం ఏమి తెలియజేస్తుంది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.

కను బొమ్మలు చిన్నగా ఉంటే

కను బొమ్మలు చిన్నగా ఉంటే

స్త్రీల కనుబొమ్మలు చిన్నవిగా ఉండి, దట్టంగా గనుక ఉన్నట్లయితే, అటువంటి వారికీ నైతిక వ్యక్తిత్వం ఉన్నతంగా ఉంటుంది. అంతేకాకుండా ఈమె ప్రేమించిన వ్యక్తుల పట్ల విపరీతమైన నమ్మకంతో వ్యవహరిస్తుంది. ఇదే కాకుండా ఆమె చుట్టూ ఉన్న వారు ఆమెను గౌరవిస్తారు, మర్యాదలు చేస్తారు. తన జీవితంలోకి ఎవ్వరు వచ్చినా వారిని ఎంతో సంతోషపెడుతుంది.

కనుబొమ్మలు ఏటవాలుగా ఉంటే..

కనుబొమ్మలు ఏటవాలుగా ఉంటే..

స్త్రీల కనుబొమ్మలు ఏటవాలుగా ఉంటే, ఆ అమ్మాయి తన జీవితంపై ఎక్కువ దృష్టి సారించినట్లు అర్థమట. ఆమె జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగేందుకు సంకేతం. ఇలాంటి మహిళలు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకునేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తారు. అంతేకాదు వీరు ఏవైనా హామీలిస్తే వాటినన్నింటినీ నెరవేరుస్తారు. అందుకుగాను ఆమె ప్రశంసలను కూడా అందుకుంటారు.

సన్నని నుదురు

సన్నని నుదురు

నుదుటిపై సనన్ని వెంట్రుకలు ఉండే అమ్మాయిలు ఆశయాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఇది అంతగా చెడ్డ విషయం కానప్పటికీ, ఇది ఆందోళన కలిగించే అంశం అవుతుంది. దీని కారణంగా వారి కుటుంబ సభ్యులతో సంబంధాల మధ్య వివాదాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే కార్పొరేట్ సంస్థలలో పని చేసే మహిళలు తరుచుగా అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు.

గుండ్రని కళ్లు.

గుండ్రని కళ్లు.

ఒక స్త్రీకి పెద్ద గుండ్రని కళ్లు ఉంటే, ఆమె ఫన్నీ మరియు ఇతరులను సంతోషంగా ఉంచాలని కోరుకుంటుందని అర్థం. అలాగే కొద్దిగా ఎర్రటి కళ్లు ఉన్న స్త్రీలు జీవితంలో చాలా అదృష్టవంతులుగా భావిస్తారు. అయితే నల్లటి కనుపాప గల స్త్రీలు ఎక్కువ స్వార్థపూర్తిగా ఉంటారు.

గోధుమ రంగులో..

గోధుమ రంగులో..

కంటి పూస విషయానికొస్తే, గోధుమ రంగు కళ్ళు ఉన్నవారు ఇతరులను సులభంగా విశ్వసించవచ్చు. అయితే గ్రే కలర్ ఉన్నవారు స్వార్థానికి సంకేతం. వారు తమ సొంత ప్రయోజనం కోసం ఇతరులను ఉపయోగించవచ్చు.

నుదురు..

నుదురు..

ఏ అమ్మాయికి అయితే నుదిటిపై 4 లేదా 5 గీతలు ఉంటాయో, అలాంటి అమ్మాయిలు చాలా విషయాల్లో చైతన్యం కలిగి ఉంటారు. అంతేకాదు వీరే స్వతంత్రంగా వ్యవహరించి, సొంత నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరికైతే అలా పెద్ద గీతలు ఉండవో, అలాంటి వారు చాలా స్మార్ట్ మరియు విద్యలో విజయవంతమవుతారు.

పెదాలు..

పెదాలు..

పూర్తి పెదవులతో ఉన్న స్త్రీలు జీవితం పట్ల తిరుగుబాటు స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు తమకు నచ్చిన విధంగా జీవించాలని నిర్ణయించుకుంటారు. సమాజంలో ఉండే నియమ నిబంధనలను పట్టించుకోరు.

సన్నని పెదాలు..

సన్నని పెదాలు..

సన్నని పెదవులతో ఉన్న స్త్రీలు వారి కుటుంబంతో చాలా అనుకూలంగా ఉంటారు. వీరు కష్టపడి పని చేస్తారు. అయితే వీరు రోటీన్ గా కాకుండా కొంత వెరైటీ రూట్ లో పయనిస్తారు. అలాగే తమను ప్రేమించే వ్యక్తులకు ఏదైనా ప్రత్యేకంగా చేసి వారిని ఆశ్చర్యపరచాలని భావిస్తారు. ఇలాంటి వారు జీవితం పట్ల శ్రద్ధగా ఉండి, ప్రేమ వైఖరిని కనబరుస్తారు.

English summary

Secrets of Women Personality

"Read to know how to unravel the secrets of a womans personality. Read on.
Story first published: Thursday, May 14, 2020, 18:35 [IST]