Latest Updates
-
దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే!
రాత్రి కలలో చనిపోయిన అమ్మమ్మలు, తాతయ్యలు కనిపిస్తున్నారా? దానర్థం ఏంటంటే..
కలలో ఎప్పుడైనా మీరు చనిపోయిన అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలను చూశారా. ఇలా చనిపోయిన వారు కలలో కనిపిస్తే వారు మీకేదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్థంచ చేసుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాంటి కలలను తేలికగా తీసుకోవద్ద
నిద్రలో వచ్చే ప్రతి కలకి ఓ అర్థం ఉంటుంది. నిద్రలో వచ్చే కలలు భవిష్యత్తులో మంచి జరగబోతోందా, చెడు జరగబోతోందా అనేవి చెబుతాయి. కొంతమందికి రోజూ చాలా కలలు వస్తుంటాయి. కానీ చాలా వరకు అవి గుర్తుండవు. మరికొందరికి ఒకటీ రెండూ కలలు వస్తుంటాయి. ఇంకొందరికి అసలు కలలే రావని చెబుతుంటారు. అయితే కలలో ఎప్పుడైనా మీరు చనిపోయిన అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలను చూశారా. ఇలా చనిపోయిన వారు కలలో కనిపిస్తే వారు మీకేదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్థంచ చేసుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాంటి కలలను తేలికగా తీసుకోవద్దని అంటున్నారు.

పితృపక్షం రోజు కలలు వస్తే:
హిందూమతంలో పితృపక్షానికి(పెత్తర అమావాస్య)కు ఎంతో ప్రత్యేకత ఉంది. పితృపక్షం భాద్రపద మాసం పౌర్ణమి నాడు ప్రారంభమై అశ్వినీ మాసం అమావాస్యతో ముగుస్తుంది. ఈ రోజుల్లో చనిపోయిన పూర్వీకులకు శ్రాద్ధ, బలి తర్పణం, పిండ ప్రదానం చేస్తుంటారు. పితృపక్షంలో పూర్వీకులు పిత్రలోకం నుండి భూమికి వస్తారని హిందువుల విశ్వాసం. అలా వచ్చిన వారు వివిధ మార్గాల్లో మంచి లేదా చెడు శకునాలు అందిస్తారని నమ్ముతారు. పితృపక్షం రోజుల్లో కలలో పూర్వీకులు కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దని పండితులు చెబుతున్నారు. కలలో కనిపించిన పూర్వీకులు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్థం చేసుకోవాలని అంటున్నారు.

పూర్వీకుల కలలు వస్తుంటే..
కలలో చనిపోయిన అమ్మమ్మలు, తాతయ్యలు కనిపిస్తుంటే వారి కోరికలు నెరవేరలేదని అర్థం. వారు కలల ద్వారా మీకు ఏదైనా చెప్పాలనుకుంటున్నారని అర్థం చేసుకోవాలి. పూర్వీకుల ఆత్మలను శాంతింపజేయడానికి కర్మలు చేయాలి.
పూర్వీకులు నవ్వుతున్నట్లు కనిపిస్తే..
కలలో పూర్వీకులు సంతోషంగా ఉన్నట్లు నవ్వుతూ ఉన్నట్లు కనిపిస్తే వారు మీకు ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చారని అర్థం. మీ శ్రాద్ధాన్ని అంగీకరించారని అనుకోవాలి.
ప్రశాంతంగా చూస్తే..
కలలో పూర్వీకులు ప్రశాంతంగా కనిపిస్తే, వారు మీ పట్ల సంతోషిస్తున్నారని, త్వరలో మీకు కొన్ని శుభవార్తల అందుతాయని అర్థం.
సాన్నిహిత్యం చూపిస్తే..
కలలో మీ పూర్వీకులు చాలా దగ్గరగా ఉన్నారని మీరు చూస్తే వారు కుటుంబ సాన్నిహిత్యాన్ని విడిచిపెట్టలేకపోతున్నారని అర్థం. కాబట్టి వారి మనశ్శాంతి కోసం కర్మలు చేయాలి.
చేతులు చాచి చూస్తే..
కలలో పూర్వీకులు మిమ్మల్ని తలచుకున్నట్లు మీరు కల కంటే.. మీరు కలత చెందడం చూసి వారు తట్టుకోలేకపోతున్నారని అర్థం. వారు మీకోసం ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం.
ఏదైనా కావాలని అడిగితే..
కలలో కనిపించిన పూర్వీకులు మిమ్మల్ని ఏదైనా అడిగినట్లైతే బ్రహ్మణుడికి లేదా పేదవారికి ఆహారం లేదా బియ్యం అవసరమైన వస్తువులు దానం చేయాలి.
తల దగ్గర నిలబడి చూస్తే..
కలలో కనిపించిన పూర్వీకులు మీ తల దగ్గర నిలబడి చూస్తున్నట్లు మీకు కల వస్తే మీ సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయని అర్థం.
కాళ్ల దగ్గర నిలబడి చూస్తే..
పూర్వీకులు మన కాళ్ల దగ్గర నిలబడి చూస్తున్నట్లు కల వస్తే.. మీరు త్వరలోనే ఏదైనా సమస్యను ఎదుర్కొంటారని అర్థం. దానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారని అర్థం చేసుకోవాలి.
తల మీద తట్టడం చేస్తే..
కలలో మీ పూర్వీకులు మీ తలను తట్టడం మీరు చూసినట్లయితే వారు మీ పట్ల చాలా సంతోషంగా ఉన్నారని, వారు మీకు ఆశీర్వాదాలను అందజేస్తున్నారని అర్థం. వారి ఆశీస్సులతో మీ కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం.
ఈ దిక్కులలో పూర్వీకులు కనిపిస్తే..
పూర్వీకులు మీ ఇంట్లోని దక్షిణ మూలలో నిలబడి ఉన్నట్లు కల వస్తే మీ శత్రువు మీపై దాడి చేయడానికి సిద్ధపడ్డాడని అర్థం.
పడమర వైపు నిలబడి ఉన్నట్లు కనిపిస్తే ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని అర్థం.
ఉత్తరం వైపు కనిపిస్తే మీరు చేసే ప్రయాణంలో మీ విలువైన వస్తువులు దొంగలిస్తారని అర్థం.
తూర్పు వైపు కనిపిస్తే దేవుని ఆగ్రహాన్ని ఎదుర్కొంటారని, సన్నిహితులతో సంబంధం క్షీణిస్తుందని అర్థం.
మీతో పాటు నడుస్తుంటే..
కలలో వచ్చిన పూర్వీకులు మీతో కలిసి నడుస్తుంటే వారి అన్ని పరిస్థితుల్లో మీతో పాటు ఉంటారని అర్థం. త్వరలోనే మీకు శుభవార్తలు వింటారని అర్థం.



Click it and Unblock the Notifications