Chanakya Niti: మరణం కంటే ఇది చాలా బాధాకరమైనదన్న ఆచార్య చాణక్యుడు

మరణం కంటే అవమానం బాధాకరమైనది చాణక్యుడు చెప్పాడు. ఆ బాధను అనుభవించే కంటే చనిపోవడం చాలా మంచిదని అనిపిస్తుందని చెప్పాడు చాణక్యుడు.

మనిషి జీవితంలో మరణం అంటే అతి తీవ్రమైనది. సంబంధాలను దూరం చేస్తుంది. నా.. అనే వారు లేకుండా చేస్తుంది. మరణం అత్యంత బాధాకరమైనది. అయితే మరణం కంటే బాధాకరమైనది ఉందని చాణక్యుడు చెప్పాడు. ఆ బాధను అనుభవించే కంటే చనిపోవడం చాలా మంచిదని అనిపిస్తుందని చెప్పాడు చాణక్యుడు.

Shame is more painful than death according to chanakya niti know in Telugu

అవమానం చాలా శక్తివంతమైనది:

అవమానం అనేది ప్రవర్తనను మార్చుకోవడానికి, తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రజలను ప్రేరేపించేందుకు శక్తివంతమైనది. ఒంటరిగా మిగిలిపోవడానికి దారి తీసే తీవ్రమైన భావోద్వేగం కూడా. గౌరవం, కీర్తి అత్యంత విలువైన సంస్కృతులలో ముఖ్యంగా అవమానం తీవ్రంగా ఉంటుంది. ఈ లక్షణాలను కోల్పోవడం తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది.

మరణం కంటే అవమానం ఎందుకంత బాధాకరమైనది:

మరణం కంటే అవమానం చాలా బాధాకరమైనదని చాణక్యుడు చెప్పాడు. మరణం కేవలం ఒక వ్యక్తి యొక్క భౌతిక చర్యలకు ముగింపు వంటిది. కానీ అవమానం మాత్రం మానసిక శ్రేయస్సుపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుంది. మనస్సును తీవ్రంగా గాయం చేస్తుంది. మనసును మెలిపెట్టి తిప్పుతుంది. కొన్ని సందర్భాల్లో ఎదురయ్యే అవమానం జీవితాంతం వెంటాడుతుంది. అది నిరాశ, ఆందోళన, ఇతర మానసిక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడం ఎలా:

ఎవరైనా అవమానిస్తే ఒకసారి భరించం తెలివైన పని అని చాణక్యుడు చెప్పాడు. రెండోసారి అవమానాన్ని తట్టుకోవడం ఆ వ్యక్తి యొక్క గొప్పతనాన్ని తెలియజెబుతుంది. కానీ మూడో సారికూడా అవమానాన్ని భరించాల్సి వస్తే దాన్ని మూర్ఖత్వం అంటారని చాణక్యుడు చెప్పాడు. ఎవరైనా మిమ్మల్ని అవమానించినప్పుడు మీ ప్రతి దాడికి ప్రత్యర్థి సిద్ధంగా ఉన్నందున అతని భాషలో అతనికి సమాధానం ఇవ్వొద్దు. అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలంటే శత్రువు ముందు చిరునవ్వే నీ పెద్ద ఆయుధం కావాలంటాడు చాణక్యుడు. చిరునవ్వు ద్వారా అతడిని తాకకుండానే అతడిని తీవ్రంగా బాధించవచ్చని చాణక్యుడు సూచించాడు.

అవమానాన్ని అధిగమించడం ఎలా:

అవమానాన్ని నివారించడం చాలా అవసరం. అవమానం ఎదురైనప్పుడు దానిని ఎలా అధిగమించాలో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. మీరు అవమానం ఎదుర్కొన్నప్పుడు స్నేహితులు, బంధువులు, ప్రియమైన వారి సహాయం తీసుకోవాలని సూచించాడు చాణక్యుడు.

Story first published: Saturday, February 18, 2023, 8:00 [IST]
Desktop Bottom Promotion