Just In
- 5 hrs ago
Today Rasi Phalalu :ఈ రాశుల వారు ఆలోచించకుండా ఖర్చు చేయొద్దు...
- 19 hrs ago
మీ అందం పెంచుకోవడానికి పౌడర్ బ్లష్, క్రీమ్ బ్లష్ లో ఏది సూటవుతుందో చూసెయ్యండి...
- 19 hrs ago
Diabetes Mistakes: షుగర్ వ్యాధి ఉన్నవారు ఈ తప్పులు చేస్తే షుగర్ కంట్రోల్ తప్పిందని హెచ్చరిక జాగ్రత్త!!
- 21 hrs ago
Secondhand Stress: పరోక్ష ఒత్తిడి అంటే ఏమిటి మరియు దానిని ఎలా కనుగొనాలి
Don't Miss
- News
వైఎస్ జగన్ ఆ డిమాండ్‌పై కేంద్రం సానుకూలం?: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రకటన?
- Automobiles
ఆ రెండు వ్యాపారాలకు మంగళం పాడిన ఓలా ఎలక్ట్రిక్.. ఇక కొత్తగా ఏం రాబోతున్నాయ్
- Movies
Meena Husband Vidyasagar: మీనా భర్త మృతికి ఆ పక్షులే కారణం.. హైదరాబాద్‌లోనూ డేంజర్ బెల్స్
- Technology
ఇండియా లో అన్నింటికీ UPI నే ...! మూడు నెలల్లో UPI ద్వారా ఎంత ఖర్చు పెట్టారో తెలిస్తే ...!
- Sports
Wimbledon 2022 : పునరాగమనంలో సెరెనా విలియమ్స్‌కు ఘోర పరాభవం, తొలి రౌండ్లోనే నిష్క్రమణ
- Finance
రూ.1000 లోపు హోటల్ గదిపై 12% జీఎస్టీ, వీటిలో మినహాయింపులు రద్దు
- Travel
ఆంధ్రప్రదేశ్‌లో ప్రాచుర్యం పొందిన పది జలపాతాలు..
Shani Asta 2022 :రాశి మారడానికి 33 రోజులు ముందే శనిదేవుని అస్తమయం... ఈ రాశులకు ప్రతికూలం...!
Shani Asta 2022 : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో శని గ్రహానికి ఎంతో ప్రత్యేకత ఉంది. శని గ్రహ ప్రభావం వల్ల ఎవరైనా తమ కర్మ ప్రతి చర్యల ప్రకారం ప్రయోజనాలను పొందుతారు. అదే సమయంలో కొన్ని ప్రతికూల ఫలితాలను పొందాల్సి ఉంటుంది.
ఇదిలా ఉండగా.. శని గ్రహ ప్రయాణం అన్ని గ్రహాల కంటే చాలా నెమ్మదిగా ఉంటుంది. ఇలా శనిదేవుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారేందుకు సుమారు రెండున్నర సంవత్సరాల సమయం పడుతుంది. ప్రస్తుతం మకర రాశిలో సంచారం చేస్తున్న శనిగ్రహం.. 2022 సంవత్సరంలో ఏప్రిల్ 29వ తేదీన కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు.
అయితే ఈ కుంభ రాశిలోకి ప్రవేశించడానికి 33 రోజుల ముందే అస్తమయం కానున్నాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 24వ తేదీన శని భగవానుడు ఉదయించనున్నాడు. ఈ సమయంలో ద్వాదశ రాశులలోని కొన్ని రాశులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ సందర్భంగా తీవ్రంగా నష్టపోయే రాశిచక్రాలేవి.. ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మిధునరాశి
ఈ రాశి వారికి శని అస్తమయం వల్ల చాలా ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీరు మీ పనిలో నిరంతర వైఫల్యం కారణంగా చాలా నిరాశకు గురవుతారు. ఇప్పటికే మిథున రాశి వారు శనిగ్రహ ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ సమయంలో వారు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం వల్ల మీ జీవిత భాగస్వామితో గొడవలు వస్తాయి. ఈ రోజుల్లో రుణాలు ఇవ్వడం విసుగు తెప్పిస్తుంది. మీ ఉద్యోగంలో సమస్యలు తలెత్తొచ్చు. ఈ 33 రోజులు వ్యాపారులకు అంత మంచిది కాదు.

కర్కాటక రాశి..
శని అస్తమయం కారణంగా జ్యోతిష్యులకు కొన్ని సమస్యలు వస్తాయి. మీరు ఎంత కష్టపడి పని చేసినా ఒత్తిడి పెరుగుతూనే ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో అధికారులతో విభేదాలు రావొచ్చు. దీంతో మీరు పని చేయకపోవడానికి ఇష్టపడకపోవచ్చు. ఈ కాలంలో మీరు ఆర్థిక పరంగా కూడా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. మీ అజాగ్రత్త వల్ల కొన్ని తీవ్రమైన పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

కన్య రాశి..
33 రోజులు ముందుగా శని అస్తమయం కావడం వల్ల ఈ రాశి వారికి చెడు ఫలితాలు ఎదురుకావొచ్చు. ఈ సమయంలో ఏ పని చేయాలన్నా మీకు అనేక అడ్డంకులు ఎదురవుతాయి. మీకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీ తండ్రితో విభేదాల కారణంగా మీ ఇంటి వాతావరణం అధ్వాన్నంగా ఉంటుంది. అంతేకాకుండా ఏ పనీ మనస్పూర్తిగా చేయలేక బాధపడతారు.

తులా రాశి
ఈ రాశి వారికి శని అస్తమయం వల్ల అశుభ ఫలితాలు రావొచ్చు. ఈ కాలంలో మీ కుటుంబంలో మరియు వ్యాపారంలో, చర్చలు పెరిగేకొద్దీ మనస్సులో ఆందోళనలు పెరుగుతాయి. మీరు న్యాయపరమైన చిక్కుల్లో పడే అవకాశం ఉంది. ఇది అనేక మానసిక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఉద్యోగులకు పై అధికారులతో విబేధాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటాయి.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శనిదేవుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారేందుకు సుమారు రెండున్నర సంవత్సరాల సమయం పడుతుంది. ప్రస్తుతం మకర రాశిలో సంచారం చేస్తున్న శనిగ్రహం.. 2022 సంవత్సరంలో ఏప్రిల్ 29వ తేదీన కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. అయితే ఈ కుంభ రాశిలోకి ప్రవేశించడానికి 33 రోజుల ముందే అస్తమయం కానున్నాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 24వ తేదీన శని భగవానుడు ఉదయించనున్నాడు.