Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Shani Shukra Gochar 2023: 30 ఏళ్ల తర్వాత శని, శుక్రుల కలయిక.. ఈ రాశుల వారికి కష్టాలు తప్పవు
మకరరాశి నుండి కుంభ రాశిలోకి శుక్ర, శని సంయోగం జరుగుతుంది. ఈ శని, శుక్ర సంయోగం కొందరికి శుభం, కొందరికి అశుభం. శని, శుక్ర కలయిక ఏయే రాశుల వారికి కష్టాలు తీసుకురానుందో ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. గ్రహాల కదలికతో జరిగే రాశుల మార్పు జీవితాలపై ప్రభావం చూపిస్తుంది. గ్రహాల కదలిక వల్ల కొంత మందికి అదృష్టం కలిసి వస్తే మరికొందరికి మాత్రం అశుభం కలుగుతుంది. జ్యోతిష్యశాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన శుక్ర, శని కలయిక ఇప్పుడు ఏర్పడనుంది. దాదాపు 30 ఏళ్ల తర్వాత శని గ్రహం, శుక్ర గ్రహం కుంభరాశిలో కలవనున్నాయి.

జ్యోతిష్య శాస్త్రంలో, శుక్ర గ్రహం సౌఖ్యం, ఆనందం మరియు శ్రేయస్సుకు కారకుడుగా పరిగణిస్తారు. మరోవైపు, శని గ్రహం శుభకార్యాల ఫలాలను ఇచ్చే గ్రహంగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో, తరువాతి 8 రోజులు (జనవరి 17 వరకు) శని, మకరరాశిలో శుక్రుడు కలిసి నాలుగు రాశుల స్థానికులను ధనవంతులను చేయవచ్చు. .
మకరరాశి నుండి కుంభ రాశిలోకి శుక్ర, శని సంయోగం జరుగుతుంది. ఈ శని, శుక్ర సంయోగం కొందరికి శుభం, కొందరికి అశుభం. శని, శుక్ర కలయిక ఏయే రాశుల వారికి కష్టాలు తీసుకురానుందో ఇప్పుడు తెలుసుకుందాం.

శుక్ర, శని కలయిక ఎప్పుడంటే..
జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం జనవరి 22వ తేదీ సాయంత్రం 4.03 నిమిషాలకు శుక్రుడు కుంభరాశిలోకి సంచరించబోతున్నాడు. అప్పటికే కుంభరాశిలో ఉన్న శనితో కలవనున్నాడు. ఫిబ్రవరి 15వ తేదీ రాత్రి 8.12 గంటల వరకు కుంభరాశిలోనే ఉంటాడు. ఆ తర్వాత మీనరాశిలో ప్రవేశించనున్నాడు.

మేషరాశి:
మేషరాశి వారికి శుక్ర, శని కలయిక అంతగా కలిసి రాకపోవచ్చు. వృత్తిపరంగా ఈ సమయంలో ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. కొత్త మిత్రులు అవుతారు. వారితో సమయం గడపడం వల్ల కుటుంబసభ్యులతో టైం గడపలేకపోవచ్చు. ఆర్థికం బాగున్నప్పటికీ చిన్న చిన్న తప్పుడు నిర్ణయాలు విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తాయి.

వృషభ రాశి:
భాగస్వామితో సఖ్యత ఉండదు. దంపతుల మధ్య గొడవలు జరుగుతాయి. జీవిత భాగస్వామితో వాదనల వల్ల ఒత్తిడి ఉంటుంది. ఈ ఒత్తిడి వృత్తి జీవితంలోనూ పడే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో జీవిత భాగస్వామికి ఏమాత్రం సమయం ఇవ్వలేరు. దీని వల్ల గొడవలు, కలహాలు వాటి వల్ల దూరం పెరుగుతుంది.

కర్కాటకరాశి:
శుక్రుడు మకరరాశిలోకి ప్రవేశించిన సమయంలో కర్కాటక రాశి వారు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. వ్యాపారంలో భాగస్వామితో సమస్యలు వస్తాయి. వ్యాపారంలో కలహాలకు తోడు నష్టాలు కూడా వస్తాయి. ఇది ఆర్థికంగా ప్రభావం చూపిస్తుంది. ఈ సమయంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే సమస్యలు తప్పవు. మోకాలి నొప్పు, ఒంటి నొప్పులు, నడుం నొప్పి సమస్యలు బాధిస్తాయి.

సింహరాశి:
వ్యాపారంలో ఉన్న సింహరాశి వారికి ఈ సమయంలో ఏమాత్రం కలిసిరాదు. ఆలోచించకుండా పెట్టే పెట్టుబడుల వల్ల తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామతితో కలహాలు రావొచ్చు. వీలైనంత ఎక్కువ సమయం వారితో గడపడానికి ప్రయత్నించండి.

తులారాశి:
శుక్రుడు, శని కలయిక తులారాశి వారికి పెద్ద కలిసి వచ్చే సూచనలు లేవు. వ్యాపారం సాఫీగానే సాగుతుంది. తీవ్ర నష్టాలు, భారీ లాభాలు వచ్చే అవకాశం లేదు. ఆరోగ్యంపై శ్రద్ధ పెడితే ఎలాంటి సమస్యలు రావు.

వృశ్చిక రాశి:
శుక్ర సంచారం వృశ్చిక రాశి వారిపై బాగానే ఉంటుంది. వృత్తిలో బిజీ అయిపోతారు. కుటుంబసభ్యులకు, జీవితభాగస్వామికి సమయం కేటాయించలేరు. సొంతం వ్యాపారం చేసుకునే వారు లాభాలు పొందాలంటే కొన్ని మార్పులు చేసుకోవాల్సిందే. ఆరోగ్యం దృష్ట్యా ఈ సమయంలో సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారికి శుక్ర సంచారం ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. ఈ సమయంలో ధనుస్సు రాశి వారి కొత్త సమస్యలను కూడా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. వ్యక్తిగత జీవితం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. జీవిత భాగస్వామితోనూసమస్యలు ఉంటాయి.

మీనరాశి:
ఉద్యోగంలో ఉన్న వారు ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది. దీని వల్ల శారీరక, మానసిక ఒత్తిడి ఉంటుంది. కార్యాలయంలో తీవ్ర పని వల్ల జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపలేకపోతారు. ఆరోగ్యపరంగా మాత్రం అనుకూలంగానే ఉంటుంది.



Click it and Unblock the Notifications