Latest Updates
-
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.!
Shani Uday 2022:ఫిబ్రవరి 24 నుండి ఈ 5 రాశుల వారికి శని దేవుని అనుగ్రహం సంపూర్ణంగా దొరుకుతుందట...!
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, 2022లో జనవరి నెలలో అస్తమించిన శని దేవుడు, తిరిగి ఫిబ్రవరి 24వ తేదీన ఉదయించనున్నాడు.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో శని గ్రహాన్ని అత్యంత ముఖ్యమైన గ్రహంగా పరిగణిస్తారు. శని గ్రహం స్థానంలో ఏ చిన్న మార్పు వచ్చినా అది మన జీవితాలపై పెను ప్రభావం చూపుతుందని నమ్ముతారు.

2022లో సంవత్సరంలో జనవరి నెలలో శని గ్రహం తన సొంత రాశి అయిన మకర రాశిలో సంచారం చేశాడు. ఈ కాలంలో కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు మరియు ఇంకా కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలొచ్చాయి.

శని స్తబ్దత కారణంగా ఇప్పటివరకు కష్టాలు ఎదుర్కొన్న వారికి ఇప్పటినుండి ఉపశమనం లభించనుంది. అంతేకాదు ఆర్థిక పరంగా అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. 2022లో ఫిబ్రవరి 24వ తేదీన అంటే గురువారం నాడు తిరిగి ఉదయించనున్నాడు.

ఇలా శని దేవుడు తిరిగి ఉదయించడం వల్ల ద్వాదశ రాశులలోని కొన్ని రాశుల వారు వారి రంగాల్లో తప్పక విజయం సాధిస్తారు. అంతేకాదు మీ కెరీర్లో కొత్త అవకాశాలను సైతం ప్రారంభిస్తారు. ముఖ్యంగా 5 రాశుల వారు శనిదేవుని అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందనున్నారు. ఈ జాబితాలో మీ రాశి ఉందో లేదో ఇప్పుడే చూసెయ్యండి...

మేష రాశి..
ఈ రాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు. ఈ రాశి నుండి దశమ స్థానం నుండి ఫిబ్రవరి 24వ తేదీన శని దేవుడు ఉదయించడం వల్ల కెరీర్లో విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ సమయంలో ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల ఫలితాలు రానున్నాయి. మీరు కోరుకున్న చోటకు బదిలీ కావొచ్చు లేదా మీరు ఊహించిన ఉన్నత స్థానాన్ని పొందొచ్చు. మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. నిరుద్యోగులు కూడా ఉద్యోగానికి సంబంధించిన శుభవార్తలు వినొచ్చు. వ్యాపారులు మంచి లాభాలను ఆర్జించగలరు.

వృషభ రాశి..
ఈ రాశి నుండి తొమ్మిదో పాదం గుండా ఈ నెల 24వ తేదీన శనిదేవుడు తిరిగి ఉదయించడం వల్ల ఈ రాశి వారి జాతకంలో రాజయోగం ఏర్పడనుంది. ఈ సందర్భంగా మీరు అనేక పనులలో విజయం సాధిస్తారు. రాజకీయాల్లో ఉండే వారు కోరుకున్న పదవిని దక్కించుకోవచ్చు.

కర్కాటక రాశి..
ఈ రాశి నుండి శని దేవుడు ఏడో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. శని భగవానుడు ఇలా ఈ స్థానం నుండి ఉదయించడం వల్ల, ఈ రాశి వారి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు భాగస్వామ్య పనులలో విజయం సాధిస్తారు. మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఇనుము, నూనె, గనులు మొదలైన శనికి సంబంధించిన వ్యాపారాలు చేసే వ్యక్తులు ఈ కాలంలో విశేష ప్రయోజనాలను పొందుతారు. మీ మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. కెరీర్ పరంగా మంచి అవకాశాలు రావొచ్చు. మీరు దూర ప్రయాణాలు కూడా చేయొచ్చు.

తుల రాశి..
ఈ రాశి నుండి శని గ్రహం నాలుగో స్థానం నుండి ఉదయించనున్నాడు. ఈ సమయంలో తుల రాశికి అధిపతిగా ఉండే శుక్రుడు, శని గ్రహాల మధ్య స్నేహ భావం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ రాశుల వారికి కెరీర్ పరంగా మంచి అవకాశాలొస్తాయి. మీరు మంచి పురోగతిని సాధిస్తారు. మీరు కోరుకున్నంత ఆదాయం పెరుగుతుంది. మీ సౌకర్యాలన్నీ పెరుగుతాయి. మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు కార్యాలయంలో ప్రశంసలను పొందుతారు.

మకర రాశి..
ఈ రాశి నుండి శని గ్రహ సంచారం ముగియడంతో.. ఈ రాశి వారు ఈ కాలంలో అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా రాజకీయాల్లో ఉండే వారికి మంచి పదవి రావొచ్చు. ఉద్యోగులకు పురోగతి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు కోరుకున్న పదోన్నతులు రావొచ్చు. మరోవైపు ఈ కాలంలో వ్యాపారులు కూడా మంచి ప్రయోజనాలు పొందొచ్చు. ఈ సమయంలో మీరు స్టాక్ మార్కెట్లో ఏవైనా పెట్టుబడులు పెడితే అద్భుతమైన ప్రయోజనాలు రావొచ్చు. సమాజంలో మీకు మంచి గౌరవం లభిస్తుంది.
గమనిక : ఇక్కడ అందించిన సమాచారం పూర్తిగా వాస్తవమైనది మరియు కచ్చితమైనదని మేము నిర్ధారించడం లేదు. కాబట్టి మీరు వీటి గురించి పూర్తి వివరాలు కావాలంటే, కచ్చితంగా వ్యక్తిగత జ్యోతిష్య నిపుణుడిని సంప్రదించి, తగిన సలహాలు, సూచనలు తీసుకోగలరు.
2022లో ఫిబ్రవరి 24వ తేదీన అంటే గురువారం నాడు తిరిగి ఉదయించనున్నాడు. ఇలా శని దేవుడు తిరిగి ఉదయించడం వల్ల ద్వాదశ రాశులలోని కొన్ని రాశుల వారు వారి రంగాల్లో తప్పక విజయం సాధిస్తారు. అంతేకాదు మీ కెరీర్లో కొత్త అవకాశాలను సైతం ప్రారంభిస్తారు. ముఖ్యంగా 5 రాశుల వారు శనిదేవుని అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందనున్నారు.



Click it and Unblock the Notifications