Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
శని సొంతరాశియైన కుంభరాశిలో శుక్రడు ఎంట్రీ,శుక్రదశతో ఈ 3రాశులకు అదృష్టం మరియు సంపదకు భారీ అవకాశం!
శని సొంతరాశియైన కుంభరాశిలో శుక్రదశతో, ఈ 3రాశులకు అదృష్టం మరియు సంపదకు భారీ అవకాశం!
నవగ్రహాలలో శుక్ర గ్రహం చాలా ముఖ్యమైనది. జ్యోతిషశాస్త్రం ప్రకారం, శుక్రుడిని ఆడంబరం, కీర్తి, ప్రేమ మరియు సంపదకు మూల గ్రహంగా పరిగణిస్తారు. అందుకే శుక్రదశ అనే పదం కూడా వచ్చింది. ఒకరి జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే , వారు జీవితంలో తర్వాత వెనుదిరిగి చూసే పరిస్థితి ఉండదన్నది నిజం. ఎవరి జీవితంలో అయితే శుక్రదశ ఉంటుందో వారు మంచి పేరు, ప్రతిష్టలు మరియు కీర్తి పొందుతారు. వారి జీవితంలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

శుక్రుడు శుభ స్థానంలో ఉంటే, వారికి విలాసవంతమైన జీవితం అనుభవించడానికి అవకాశం ఉంది. జ్యోతిష్యశాస్త్రంలో ఒక్కో గ్రహానికి ఉన్న ప్రాధాన్యతతో పాటు శుక్రుని ప్రాముఖ్యతను మనం గుర్తించాలి. ఒకరి జీవితంలోకి శుక్రుడు ప్రవేశించాడంటే చాలా ప్రయోజనాలను తెచ్చిపెడతాడు. జనవరి 22 న, శుక్రుడు, శనిసొంతరాశియైన కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఒక వ్యక్తికి జీవితంలో ఆనందాన్ని ఇచ్చే గ్రహంగా శుక్రుడిని పరిగణిస్తారు. శుక్రుని సంచారంలో ఏ రాశుల వారికి అనుకూల ఫలితాలు లభిస్తాయో చూద్దాం.

శుక్రుని సంచారము
జనవరి 22న శుక్రుడు కుంభ రాశిలోకి సంచరించనున్నాడు. మొత్తం 12 రాశుల వారు ఈ సంచారంలో అనుకూల మరియు ప్రతికూల ఫలితాలను పొందుతారు. కానీ శుక్రుని సంచారంలో మూడు రాశుల వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. శుక్రుని సంచారం శని రాశి అయిన కుంభరాశిలో జరుగుతుంది. ఈ రాశి మార్పు చాలా మందిలో చాలా సానుకూల మార్పులను తెస్తుంది. కుంభరాశిలో శుక్రుని సంచారం మూడు రాశులను సుసంపన్నం చేస్తుంది. వారు అన్ని విధాలుగా ప్రయోజనాల పొందడానికి సిద్దంగా ఉన్నారు. మరి ఏ రాశుల వారికి శుక్ర సంచారం అనుకూల ఫలితాలను ఇస్తుందో ఇక్కడ చూద్దాం.

వృషభరాశి
శుక్రుని ఈ సంచార సమయంలో వృషభరాశికి అనుకూల ఫలితాలను ఇస్తుంది, వీరు పనిపరంగా ప్రమోషన్ పొందవచ్చు. మహిళా సహోద్యోగి సహాయంతో, మీరు మీ వ్యాపారంలో పెద్ద లాభాలను ఆర్జిస్తారు. ఈ రాశి స్త్రీలు కొత్త పనులు ప్రారంభించగలరు. ఈ సమయంలో మీరు ఒక మహిళా స్నేహితుని సహాయం కూడా పొందుతారు. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. ఈ శుక్రగోచార సమయంలో వాహానాలు కొనుగోలు చేయవచ్చు. ఇంటిపనిని పున:ప్రారంభించవచ్చు. శుక్రని ఆశీర్వాదంతో ఆర్థింగా స్థిరపడతారు. మీ జీవితంలో చాలా సంతోషకరమైన అవకాశాలు వస్తున్నాయి.

తులారాశి
తులారాశి వారికి శుక్రుడు 8వ ఇంటికి అధిపతి. అందువల్ల, వారి జీవితంలో చాలా సానుకూల మార్పులు ఉంటాయి. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. మరోవైపు ప్రేమలో ఉన్న వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. వివాహ పరంగా, మీకు చాలా అనుకూలమైన సమయం. కళలతో అనుబంధం ఉన్న వారికి ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. అంతేకాదు కమ్యూనికేషన్, రైటింగ్ రంగాల్లో వారికి ఎన్నో అవార్డులు రివార్డులు పొందుతారు. ఉద్యోగంలో ఊహించని మార్పులు వారిని ముందుకు తీసుకువస్తాయి. ఉద్యోగంలో చాలా అవకాశాలు రావచ్చు. అందువల్ల, తులా రాశి వారికి జీవితం ఆనందంగా ఉంటుంది.

కుంభ రాశి
కుంభ రాశి వారికి శుక్ర సంచారము వలన అనేక అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఇది మీ జీవితంలో ఊహించని మార్పులను తీసుకొస్తుంది. వారి వైవాహిక జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయి. ఏ విషయంలోనైనా మీకు మీ భాగస్వామి మద్దతు పూర్తిగా ఉంటుంది. వారి సంబంధంలో భాగస్వాముల మధ్య చాలా సానుకూల మార్పులు ఉన్నాయి. సంతానోత్పత్తికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఒంటరిగా ఉన్నవారికి పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడు చాలా అనుకూలమైన సమయం. ఆర్థిక సంక్షోభం నుంచి కోలుకోవడానికి ఇదే అత్యంత అనుకూలమైన సమయం. కాబట్టి, ఈ మూడు రాశుల వారికి శుక్రుని సంచారాన్ని ఉత్తమ సమయంగా పరిగణించవచ్చు.
నిరాకరణ : ఇక్కడ అందించిన సమాచారం సాధారణ అంచనాలు మరియు ఇంటర్నెట్ నుండి పొందిన సమాచారంపై ఆధారపడి ఉంటుంది. తెలుగు బోల్డ్ స్కై దీనిని ధృవీకరించలేదు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా ముందు నిపుణుల సలహా తీసుకోవాలి



Click it and Unblock the Notifications