For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Venus Transit in Capricorn:శుక్రుడు మకరంలోకి ప్రవేశం.. ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావమంటే...!

|

Venus Transit in Capricorn On 08 December 2021 : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో శుక్రుడిని శుభ గ్రహంగా పరగణిస్తారు. ఈ గ్రహాన్ని ప్రేమ, అందం, శృంగారం కారకంగా భావిస్తారు. ఎవరి జాతకంలో అయితే శుక్రుడు బలంగా ఉంటారో.. వారి జీవితంలో ప్రేమకు లోటు అనేదే ఉండదు.

అలాంటి శుక్రుడు 2021 సంవత్సరంలో డిసెంబర్ 8వ తేదీన బుధవారం ఉదయం 12:56 గంటలకు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇదే రాశిలో డిసెంబర్ 30వ తేదీ ఉదయం 9:57 గంటల వరకు నివాసం ఉండనున్నాడు. ఈ సందర్భంగా ద్వాదశ రాశులపై కొంత ప్రభావం పడుతుంది.

ఈ సమయంలో కొన్ని రాశుల వారు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మరికొన్ని రాశుల వారు సానుకూల ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా 12 రాశిచక్రాల వారిపై శుక్రుని రవాణా ఏమేరకు ప్రభావం చూపుతుంది.. ఎలాంటి పరిహారాలు పాటించాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Mars Transit in Scorpio : వృశ్చికరాశిలో కుజుడి సంచారం.. 12 రాశులపై పడే ప్రభావం...!

మేష రాశి..

మేష రాశి..

శుక్రుడి రవాణా వల్ల ఈ రాశి వ్యాపారులకు ఆశించిన లాభాలు రావొచ్చు. మరోవైపు మీరు కొత్త అవకాశాలను పొందొచ్చు. మీ కలలను కూడా నెరవేర్చుకోవచ్చు. మీరు సామాజికంగా చురుకుగా ఉంటారు. మీరు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సత్సంబంధాలను కొనసాగిస్తారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈ సమయంలో మీరు మానసిక ప్రశాంతతను కూడా పొందుతారు. మీకు పెట్టుబడికి ఇది సరైన సమయం. మీరు మీ తల్లితో మంచి సమయం గడుపుతారు.

పరిహారం : ఈ కాలంలో మీకు బాగా ఇష్టమైన వారికి బహుమతి ఇవ్వాలి.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి వారికి శుక్రుడి రవాణా వల్ల జీవిత భాగస్వామితో సంతోషంగా గడిపేందుకు అవకాశం రాకపోవచ్చు. అయితే ఈ సమయంలో మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు. మరోవైపు పిల్లల నుండి శుభవార్తలు పొందుతారు. మీరు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లడంలో విజయం సాధిస్తారు. విద్యార్థులు విద్యపై ఫోకస్ పై పెట్టాలి. ఇంకోవైపు ఈ రాశి చెందిన ఒంటరి వ్యక్తులు భాగస్వామిని పొందొచ్చు.

పరిహారం : మీరు దుర్గా చాలీసా పారాయణం చేయాలి. ఆ దేవతకు తెల్లని పువ్వులు సమర్పిస్తే శుభ ఫలితాలొస్తాయి.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి వారికి శుక్రుడి రవాణా వల్ల మార్పు వస్తుంది. ఈ సమయంలో మీరు ఆర్థిక పరంగా మంచి లాభాలను పొందొచ్చు. మరోవైపు ఈ కాలంలో మీరు ఏదైనా పోటీల్లో పాల్గొంటే తప్పకుండా గెలుస్తారు. ఉద్యోగులకు వేతనం పెరగొచ్చు. మీరు కొన్ని భౌతిక సుఖాలకు అలవాటు పడతారు. మరోవైపు ఆరోగ్య పరంగా ఈకాలంలో కొన్ని సమస్యలు ఎదురుకావొచ్చు. మీ జీవిత భాగస్వామితో అర్థం చేసుకోవచ్చు. దీన్ని అధిగమించాలంటే ఓపికతో పని చేయాలి.

పరిహారం : మీరు మీ చిన్నారులకు ఖీర్ లేదా మిఠాయిలను ఇవ్వాలి.

ఈ 6 రాశుల వారు 2022లో సొంత ఇల్లు కొనే అదృష్టవంతులు కావచ్చు... మరి ఇక్కడ మీ రాశి ఉందో లేదో చూసేయండి?

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

శుక్రుడు ధనస్సు నుండి మకరంలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి ఉద్యోగులకు ఆఫీసులో పని భారం పెరగొచ్చు. మీరు చిత్తశుద్ధితో ప్రయత్నించినప్పటికీ, ఫలితం ఆశించినంతగా రాకపోవచ్చు. అపార్థాల కారణంగా, మీ జీవిత భాగస్వామితో సంబంధంలో చీలికలు ఏర్పడొచ్చు. వ్యాపారస్తులు తమ భాగస్వాములతో మంచి సంబంధాలను కొనసాగించాలి. మీ కుటుంబ వ్యవహారాల్లో కొంత ఇబ్బంది ఉండొచ్చు. ఇలాంటి సమయాల్లో తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు.

పరిహారం : పర్ఫ్యూమ్ ఉపయోగించడం వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారు శుక్రుడి రవాణా సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరంగా మీ ఖర్చులపై నియంత్రణ ఉంచుకోవాలి. అనవసర విషయాలకు ఖర్చు పెట్టకండి. మీరు మీ కుటుంబ సభ్యుల పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీ భాగస్వామితో అపార్థం కారణంగా మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. విద్యార్థులు ఈ కాలంలో కొన్ని అడ్డంకులను ఎదుర్కోవచ్చు.

పరిహారం : శివునికి తెల్ల చందనం సమర్పించాలి.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారు శుక్రుడి రవాణా సమయంలో చాలా శ్రద్ధగా ఉండాలి. ముఖ్యంగా మీ ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవాలి. ఈ సమయంలో మీకు సానుకూల ఫలితాలొస్తాయి. ఈ సమయంలో మీరు కొత్త ఉద్యోగ అవకాశాన్ని పొందుతారు. మరోవైపు విద్యార్థులు తమ అకడమిక్ ప్రాజెక్టులలో బాగా రాణిస్తారు. మీరు ఖర్చులలో ఆకస్మిక పెరుగుదలను చూడొచ్చు. ఈ సమయంలో మీ విశ్వాసం ఎక్కువగా ఉంటుంది.

పరిహారం : గోమాతకు పచ్చి మేతను తినిపిస్తే మంచి ఫలితాలొస్తాయి.

2022లో ఏఏ రాశికి ఏ నెల అదృష్ట మాసమో తెలుసా?

తుల రాశి..

తుల రాశి..

శుక్రుడి రవాణా వల్ల ఈ రాశి వారు కార్యాలయంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. మీరు నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున మీరు పెట్టుబడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు ఈ కాలంలో విద్యపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. మరోవైపు మీ పాత ఆరోగ్య సమస్యలు కొన్ని మళ్లీ తలెత్తే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత మరియు వ్రుత్తి జీవితంలో పని భారం పెరుగుతుంది. ఇది మీ ఒత్తిడి మరియు ఆందోళనకు కారణం కావొచ్చు.

పరిహారం : ప్రతి శుక్రవారం ఏదైనా దేవాలయానికి వెళ్లి తెల్లని తీపి పదార్థాన్ని దానం చేయాలి.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

శుక్రుడు మకరంలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. ఇలాంటి సమయంలో మీకు చికాకు కలగొచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో కొత్త కనెక్షన్ల గురించి ఇబ్బంది పడతారు. మీ అభిరుచి లేదా ప్రణాళిక లేదా మీకు ఆసక్తి ఉన్న వాటిపై ఫోకస్ పెట్టాలి.

పరిహారం : మీరు క్రమం తప్పకుండా సూర్య భగవానుడికి నీటిని సమర్పించాలి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి వారికి శుక్రుడి రవాణా సమయంలో కొన్ని పనులు ఆలస్యం కావొచ్చు. మీరు మీ ఖర్చులపై నిఘా ఉంచాలి. మీ వైవాహిక జీవితంలో మంచిగా ఉంటుంది. అయితే మీరు కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఈ సమయంలో మీరు మరింత రెగ్యులర్ చెకప్ ను కలిగి ఉండాలి. ఈ సమయం విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మీ ఖర్చులపై కూడా నిఘా ఉంచాలి.

పరిహారం : మీరు చిన్నారులకు తెల్లని బర్ఫీ లేదా స్వీట్లను పంచాలి.

మకర రాశి..

మకర రాశి..

ఇదే రాశిలోకి శుక్రుడు ప్రవేశించడం వల్ల ఈ రాశి వారు ఆశించిన ఫలితాలను పొందుతారు. ఈ కాలంలో మీ రిలేషన్ బాగుంటుంది. అయితే మీ భాగస్వామి నుండి కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. మరోవైపు మీ ప్రవర్తనతో మీ తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు. మీరు ఫిట్ గా ఉండేందుకు ప్రతిరోజూ వ్యాయామం చేయాలి.

పరిహారం : మీరు శుక్ర బీజ మంత్రాన్ని పఠించాలి.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారు శుక్రుడి రవాణా వల్ల అద్భుతమైన ఫలితాలను పొందే అవకాశం ఉంది. మీరు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి చాలా వస్తువులను ఖర్చు చేయొచ్చు. ఈ రవాణా సమయంలో మీరు కొంత ఆదాయాన్ని కూడా పొందొచ్చు. ఈ సమయంలో మీరు విజయం కోసం మరింత కష్టపడాలి. మీరు కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉండొచ్చు. మీరు మందుల కోసం కొంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీరు ఇతర వ్యక్తులను కలిసినప్పుడు మీ ప్రవర్తనను హుందాగా వ్యవహరించాలి.

పరిహారం : మీరు ఈ కాలంలో స్పటిక మాల ధరిస్తే, మంచి ఫలితాలను పొందుతారు.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి వారు శుక్రుడి రవాణా కాలంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు పెద్దల సలహా తీసుకుని ముందుకు సాగితే.. చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో మీ ఆరోగ్యం బాగుంటుంది. మీకు న్యాయపరమైన విషయాల్లో కొంత జాప్యం ఉండొచ్చు. అయితే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తమ కలలను సాకారం చేసుకోవడానికి విద్యార్థులు ఏకాగ్రతతో ఉండాలి. మీరు ఆధ్యాత్మిక గ్రంథాల్లో పాల్గొనొచ్చు. పేద ప్రజలకు సహాయం చేయడం ద్వారా మీరు డబ్బు ఖర్చు చేయొచ్చు. మీరు రిలాక్స్ గా మరియు ప్రశాంతంగా ఉంటారు.

పరిహారం : మీరు హనుమంతుడిని పూజించాలి.

శుక్రుడు డిసెంబర్ నెలలో ఏ రాశిలోకి ప్రవేశించనున్నాడు?

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శుక్రుడు 2021 సంవత్సరంలో డిసెంబర్ 8వ తేదీన బుధవారం ఉదయం 12:56 గంటలకు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇదే రాశిలో డిసెంబర్ 30వ తేదీ వరకు నివాసం ఉండనున్నాడు.

English summary

Shukra Rashi Parivartan Venus Transit in Capricorn On 08 December 2021 Effects on Zodiac Signs and Remedies in Telugu

Shukra rashi parivartan december 2021 in Makara Rashi; Venus Transit in Capricorn Effects on Zodiac Signs in Telugu: The Venus Transit in Capricorn will take place on 08 December 2021. Learn about remedies to perform in Telugu
Story first published: Tuesday, December 7, 2021, 14:49 [IST]