Latest Updates
-
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.!
నవ్వును బట్టి ఎదుటివారి స్వభావం గురించి ఈజీగా తెలుసుకోవచ్చా?
నవ్వును బట్టి మీ స్వభావం ఎలాంటిదో ఇప్పుడు తెలుసుకుందాం.
నవరసాలలో ప్రతి ఒక్కరికీ నవ్వు తెప్పించేది హాస్య రసమే. అయితే ఆ నవ్వు ఆరోగ్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాంటి నవ్వు మన జీవితంలో కీలక పాత్ర పోషిస్తుందని వైద్యులు, మానసిక నిపుణులు ఎప్పుడూ చెబుతూ ఉంటారు.

అయితే నవ్వు నాలుగు విధాలా చేటు అని కొందరు అంటుంటే... నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం అని కొందరు చెబుతున్నారు.

ఇలా మనస్ఫూర్తిగా నవ్వితే అది మన ఆయుష్షుపై మంచి ప్రభావమే చూపుతుంది. అంతేకాదు నిత్యం మనం ఎదుర్కొనే ఒత్తిడికి మంచి మందు ఏదైనా ఉందంటే అది ఒక్క నవ్వు అని కచ్చితంగా చెప్పొచ్చు.

అయితే అతిగా నవ్వితే మాత్రం కొన్ని అనర్థాలు తప్పవట. సాముద్రిక శాస్త్రం ప్రకారం నవ్వు ద్వారా మన స్వభావం, ప్రవర్తన ఎలాగో తెలిసిపోతుందట.

ఎందుకంటే నవ్వడం ద్వారా ఎదుటివారి మనసులో ఎలాంటి రహస్యాలు కూడా కూడా చాలా సులభంగా తెలుసుకోవచ్చట. అంతేకాదు వారి పర్సనాలిటీని కూడా అంచనా వేయొచ్చు. ఈ సందర్భంగా నవ్వు ఎదుటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ఎలా తెలియజేస్తుందో ఇప్పడు తెలుసుకుందాం పదండి...

గుడ్డిగా నమ్మేయొచ్చు...
సాముద్రిక శాస్త్రం ప్రకారం ఎవరైనా వ్యక్తి పెద్దగా నవ్వితే వారి మనసులో ప్రతి ఒక్కరి మీద ప్రేమ ఒకే విధంగా ఉంటుందని అర్థం. అలాగే వారు ఎంతో దయ, జాలి, ఉదార స్వభావం కలిగి ఉంటారని అంచనా వేయొచ్చు. వీరు దేన్నైనా భరించే గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వీరు ఎవ్వరినీ మోసం చేయరు. ఒక్కమాటలో చెప్పాలంటే వీరిని గుడ్డిగా నమ్మేయచ్చు.

కష్టపడి పని చేస్తారని..
ఎవరైనా వ్యక్తి పెద్ద గొంతుతో గట్టిగా నవ్వుతుంటే, వారిని కష్టపడి పని చేసే వారిగా అర్థం చేసుకోవచ్చు. అలాగే వీరు ఏదైనా పనిని మొదలుపెడితే, అది పూర్తయ్యే వరకు వదిలిపెట్టరు. ఈ స్వభావం కలిగిన వారిలో ఆత్మగౌరవం భావం ఉంటుంది. అయితే వీరిలో ఓ లోపం ఉంది. అది ఏంటంటే.. వీరు ఏదైనా అవకాశాన్ని కోల్పోవడాన్ని అస్సలు తట్టుకోలేరు. ఇలాంటి ప్రవర్తన వల్ల వీరిపై సొంతవారే కోపం పెంచుకుంటారు.

చిన్నగా చిరునవ్వు నవ్వితే..
ఎవరైనా ఒక వ్యక్తి చిన్నగా చిరునవ్వు నవ్వితే..వారు ఎంతో తెలివైన వారని అర్థం చేసుకోవాలి. వీరు పరిస్థితులకు తగ్గట్టు నడుచుకుంటారు. వీరి ప్రత్యేకత ఏంటంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా చాలా సులభంగా అదుపులోకి తెచ్చుకుంటారు. వీరు చుట్టాలతో కూడా చాలా నిజాయితీగా ఉంటారు. వీరి మనసులో అవనసరంగా ఎలాంటి ద్వేషం అనేదే ఉండదు. ముఖ్యంగా వీరు ఎలాంటి వివాదాలకైనా, తగాదాలకైనా దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఒకవేళ ఏదైనా గొడవ జరిగితే, తెలివిగా ఆలోచించి వాటిని సరిచేస్తారు.

గ్యాప్ ఇచ్చి నవ్వితే...
ఎవరైతే వ్యక్తులు గ్యాప్ ఇచ్చి నవ్వుతారో వీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తారు. అలాగే ఏదైనా పని విషయంలో వీరికి ఎలాంటి హాని జరగదు. వీరి జీవితంలోని ప్రతి రంగంలోనూ వీరు అనుకున్న విధంగా ముందుకు సాగుతారు. సమాజంలో గౌరవంతో పాటు ఆదరణ పొందుతారు.

మోసానికి దూరంగా..
వీరికి మేధస్సు చాలా ఎక్కువగా ఉంటుంది. మీరి బ్రెయిన్ చాలా షార్ప్ గా పని చేస్తుంది. వీరు మోసం చేయడం వంటి పనులకు దూరంగా ఉంటారు. అంతేకాదు, ఇతరులకు చాలా సహాయం చేస్తుంటారు. వీరిని చాలా సులభంగా నమ్మొచ్చు.



Click it and Unblock the Notifications