Latest Updates
-
అమ్మమ్మల నాటి చిట్కా..గ్యాస్, ఎసిడిటి,అజీర్తి సమస్యలకు చెక్! -
కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? అయితే నీరసం రానివ్వని ఈ సగ్గుబియ్యం వడలు ట్రై చేయండి! -
పెళ్లిళ్లు, పండుగల్లో అమ్మాయిలూ జాగ్రత్త.. మెహందీ పెట్టుకుంటే పొట్ట ఇన్ఫెక్షన్ల ప్రమాదం.! -
ఉప్మా తినడం ఇష్టం లేని వారికి రవ్వతో ఇలా చేసి పెట్టండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.! -
జన్మాష్టమి రోజు ద్వాపర యుగం నాటి అరుదైన సంఘటన.. ఈ ఐదు రాశుల వారిపై కృష్ణయ్య కటాక్షం.! -
వంట చేసే ఓపిక లేదా? కేవలం 10 నిమిషాల్లో ఈ పచ్చిమిర్చి నువ్వుల రైస్ చేసి చూడండి, టేస్ట్ అదుర్స్! -
కుజ-గురు కలయికతో ద్విద్వాదశ యోగం..ఈ 4 రాశులకు అడుగడుగునా అదృష్టమే! -
దక్షిణ భారతదేశంలో అతిపెద్ద జిల్లా ఏదో తెలుసా?.. 90% మంది తప్పుగానే చెప్తారు! -
Jeera Biscuits Recipe:హెల్తీ, టేస్టీ జీరా బిస్కెట్స్..బేకరీని మించిన రుచితో ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
బ్రకోలీ, బాదంతో సూపర్ హెల్తీ పాస్తా..రుచి చూస్తే వదిలిపెట్టరు!
Simha Rasi Ugadi Rasi Phalalu 2022: ‘శుభకృత’ ఏడాదిలో సింహ రాశి వారి జాతకం ఎలా ఉంటుందంటే...!
2022లో ఉగాది పండుగ సందర్భంగా సింహ రాశి వారి జాతకం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మన దేశంలో ఇటీవలే హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నాం.. అదే సమయంలో మనం తెలుగు సంవత్సరంలో చివరి మాసానికి మరికొన్ని రోజుల్లో వీడ్కోలు పలకబోతున్నాం.

2022 సంవత్సరంలో ఏప్రిల్ 2వ తేదీన అంటే శనివారం నాడు మనం తెలుగు నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. 'ఫ్లవ' నామ సంవత్సరానికి ముగింపు పలికి 'శుభకృతు' నామ సంవత్సరానికి స్వాగతం పలుకనున్నాం.

ఇది మన 60 సంవత్సరాల్లో 36వ సంవత్సరంగా పండితులు చెబుతున్నారు. శాస్త్రాల ప్రకారం, 'శుభకృతు' నామ సంవత్సరంలో శుభ ఫలితాలు వస్తాయి. దుఃఖాలు తొలగిపోతాయి. కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురిసి అన్ని పంటలు మనకు లభిస్తాయట. ఆహార పంటలతో పాటు ఇతర పంటల ఉత్పత్తులు కూడా బాగా దొరుకుతాయట. ఇదిలా ఉండగా.. ఈ ఏడాదిలో కొన్ని అశుభ ఫలితాలు కూడా రానున్నాయట. ఈ ఏడాదిలో కొన్ని ఆటంకాలు, దొంగల భయం ఉంటుందని, ముఖ్యంగా సైబర్ నేరాలు ఎక్కువగా పెరుగుతాయని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. 2022 తెలుగు నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతకం ఎలా ఉంటుంది.. ముఖ్యంగా సింహ రాశి వారికి ఈ ఏడాది ఎలాంటి ఫలితాలొస్తాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఆదాయం-8, వ్యయం-14
ఈ రాశి వారికి తెలుగు నూతన సంవత్సరంలో ఆదాయం కంటే ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. మఘ నక్షత్రం 1,2,3,4 నాలుగు పాదాలు లేదా పుబ్బ నక్షత్రం 1,2,3,4 నాలుగు పాదాలు, లేదా ఉత్తర నక్షత్రం ఒకటో పాదంలో మొత్తం తొమ్మిది స్థానాలు ఉంటాయి. సింహ రాశి వారికి గురు గ్రహం వల్ల ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. మీ కుటుంబ జీవితంలో వివాదాలు రావొచ్చు. గురువు అష్టమ భాగంలో సంచారం చేయడం వల్ల వీరికి సంతానానికి సంబంధించిన సమస్యలు రావొచ్చు.

రాజపూజ్యం-1, అవమానం-9
ఈ ‘శుభకృత' నామ సంవత్సరంలో ఈ రాశి వారికి శని గ్రహ ప్రభావంతో మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి. ఈ కాలంలో మీరు ఆర్థిక పరంగా మంచి ఫలితాలను పొందుతారు. వ్యాపారులకు ఊహించిన మేరకు లాభాలు వస్తాయి. అవివాహితులకు వివాహం యొక్క సమస్యలు పరిష్కారమవుతాయి. అయితే మీ భాగస్వామికి తరచుగా ఆరోగ్య సంబంధిత సమస్యలు ఏర్పడును.

రాహు ప్రభావంతో..
మేష రాశిలో రాహువు సంచారం జరగడం వల్ల తెలుగు నూతన సంవత్సరంలో ఈ రాశి వారికి రాహువు ప్రభావం వల్ల ఆర్థిక పరంగా మంచి ఫలితాలు రావొచ్చు. భూమికి సంబంధించిన లావాదేవీలు ఆశించిన మేరకు జరుగుతుాయి. కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ, మీరు పట్టుదలతో వాటిని అధిగమిస్తారు.

కేతు ప్రభావం వల్ల..
ఈ కాలంలో తులరాశిలో కేతువు సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మీ కుటుంబ జీవితంలో సానుకూల ఫలితాలొస్తాయి. మీ సోదరుడితో అనుబంధాలు తిరిగి బలపడతాయి. రాజకీయ నాయకులకు ఊహంచిన విధంగా ఫలితాలొస్తాయి. ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. జులై నుండి డిసెంబర్ వరకు శని మకరంలో సంచారం చేయడం వల్ల రుణ, రోగ, శత్రువుల సంబంధిత విషయాల్లో విజయం సాధిస్తారు. అయితే ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో సర్పదోషం కలిగి ఉంటే వారికి మాత్రం ప్రతికూల ఫలితాలు వస్తాయి.

ప్రతికూల ఫలితాలిలా..
ఈ సంవత్సరం రవి, కుజుడు, శుక్రుడు, చంద్ర గ్రహాల సంచారం వల్ల ఉద్యోగులకు, వ్యాపారులకు శుభప్రదమైన ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారికి ఈ ఏడాది ప్రతికూల ఫలితాలు ఏమైనా ఉన్నాయంటే.. మీకు గురుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మీ ఆలోచనలు ఏవీ పని చేయవు. ఏ ప్రయత్నంలో అయినా విఫలం అవుతూ ఉంటారు. కాబట్టి మీరు గురు గ్రహం అనుగ్రహం పొందేందుకు గురు చరిత్ర పారాయాణం చేయాలి. అంటే దత్తాత్రేయ జీవిత చరిత్రను ఏడు రోజుల పాటు చదవాలి.

పరిహారాలివే..
ఈ సంవత్సరంలో రాహువు ప్రతికూల ఫలితాలను అధిగమించేందుకు మైసూరులోని చాముండేశ్వరి దేవి గుడిలో కుంకుమ అర్చన చేయించాలి. ఇలా చేయడం వల్ల రాహువు యొక్క దోషం నుండి బయటపడొచ్చు. ఈ పరిహారాలు పాటించడం వల్ల మీకు తప్పకుండా శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications