For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సూర్య గ్రహణం 2020 : జూన్ 21న చేయాల్సిన, చేయకూడని పనులేంటో చూడండి...

జూన్ 21వ తేదీన సూర్య గ్రహణం సందర్భంగా ఎలాంటి పనులు చేయాలో, ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

|

ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులను, మానవులను కంపింపచేసే ఏకైక శక్తి ఉన్న వ్యక్తి సూర్యుడు. వెయ్యికిరణాలు కలిగిన భానుడు ఒక్కరోజు రాకపోతే ఆ లోకమంతా చీకటి మయంగా మారిపోతుంది. అలాంటి సూర్యుడిని రాహువు మింగేస్తాడు. ఆ సమయాన్నే సూర్యగ్రహణం అంటారు. అలాంటి ఘట్టం 2020 సంవత్సరంలో జూన్ 21వ తేదీ జరగబోతోంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ గ్రహణం కేవలం అమావాస్య రోజు మాత్రమే వస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం సూర్యగ్రహణం అనేది ఏర్పడదు.

Solar Eclipse 2020: Dos and don’ts

ఈ సూర్యగ్రహణం ఈసారి కూడా అమావాస్య రోజున అదీ ఆదివారం నాడు జరుగుతుంది. పూర్వకాలంలో ఈ గ్రహణాలను ప్రతికూల ఫలితాలకు సంకేతంగా భావించేవారు. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో వీటిని నమ్ముతున్నారు. అకస్మాత్తుగా ఆకాశంలో మబ్బులు ఏర్పడితే, చాలా భయపడుతూ ఉంటారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే ఈ గ్రహణం సందర్భంగా ద్వాదశ రాశులలో నాలుగు రాశుల వారికి మేష, మకర, సింహ, కన్య రాశుల వారికి కనకవర్షం కురవబోతోందని చెబుతున్నారు పండితులు.

Solar Eclipse 2020: Dos and don’ts

మరో నాలుగు రాశుల వారికి మధ్యమ ఫలితాలు ఉంటాయని, మిగిలిన నాలుగు రాశుల వారికి మాత్రం అశుభ ఫలితాలుంటాయని చెబుతున్నారు. ఆ వివరాలన్నీ మనం ఇంతకుముందు ఆర్టికల్ లోనే తెలుసుకున్నాం కదా..

Solar Eclipse 2020: Dos and don’ts

మరి ఇప్పుడు సూర్యగ్రహణం ఏర్పడబోయే ఆదివారం నాడు ఎలాంటి పనులు చేయకూడదు.. ఏయే పనులు చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశముంది. అసలు గర్భిణులపై గ్రహణం ప్రభావం ఎందుకు ఎక్కువగా ఉంటుందని చాలా మంది నమ్ముతారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Solar Eclipse 2020 : ఈ 4 రాశుల వారికి అదృష్టయోగం... మీ రాశి ఉందేమో చూడండి...Solar Eclipse 2020 : ఈ 4 రాశుల వారికి అదృష్టయోగం... మీ రాశి ఉందేమో చూడండి...

గ్రహణ కాలంలో..

గ్రహణ కాలంలో..

హిందూ ధర్మం ప్రకారం సూర్య గ్రహణానికి చాలా విశేషముంది. గ్రహణం పట్టగానే నదీ స్నానం ఆచరించాలి. నది తీరాన జపం చేసుకుంటే ఫలితం ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతారు. అలాగే గ్రహణం విడిచిన తర్వాత స్నానం చేసి, పేదలకు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు.

గర్భిణులకు సూచనలు..

గర్భిణులకు సూచనలు..

ఈ సూర్యగ్రహణ ప్రభావం గర్భిణులపై చాలా ఎక్కువగా ఉంటుందని చాలా మంది నమ్ముతారు. ఇది మూఢనమ్మకమా, లేదా అనేది ఇప్పటికీ తెలియదు. అయితే ఇవన్నీ పక్కనబెడితే గ్రహణం సమయంలో మాత్రం గర్భిణులు కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి. గ్రహణం పట్టడానికి ముందే సుమారు 6 గంటల ముందు భోజనం ముగించాలి. గ్రహణం సమయంలో అస్సలు ఆహారం తీసుకోకూడదు. గర్భిణులు నదీ తీరాన, సముద్ర తీరాన, కాలువల దగ్గర ఎట్టి పరిస్థితుల్లో స్నానం చేయకూడదు. కేవలం ఇంట్లోనే స్నానం చేయాలి.

పుట్టబోయే బిడ్డపై ప్రభావం..

పుట్టబోయే బిడ్డపై ప్రభావం..

ఒకవేళ సూర్యగ్రహణం సమయంలో గర్భిణులు ఆహారం తీసుకుంటే గనుక, అది పుట్టబోయే బిడ్డపై చాలా ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉందని చాలా మంది నమ్ముతారు. ఇది గర్భిణుల పిండంపై ప్రభావం చూపడం వల్ల పుట్టబోయే బిడ్డ ఏదైనా లోపంతో పుడతారని చాలా మంది నమ్మకం. అందుకే గ్రహణం సమయానికి ఆరు గంటలు ముందుగా భోజనాన్ని ముగించాలంట.

సూర్యగ్రహణ ప్రభావం మన దేశంపై ఏ మాత్రం ఉంటుందో తెలుసుకోండి...సూర్యగ్రహణ ప్రభావం మన దేశంపై ఏ మాత్రం ఉంటుందో తెలుసుకోండి...

గర్భిణులు ఏమి చేయాలంటే..

గర్భిణులు ఏమి చేయాలంటే..

గ్రహణం సమయంలో గర్భిణులు అటూ ఇటూ అస్సలు ఎక్కువగా కదలకూడదు. అంటే కడుపులో ఉండే పిల్లవాడికి ఇబ్బందికరంగా ఉండకుండా అన్నమాట. లేదంటే కుర్చీలో కూర్చొని ఏదైనా పుస్తకం చదవడం గానీ.. లేదంటే ఏదైనా తేలికపాటి పని చేయడం లేదా సంగీతం వినడం వంటివి చేయాలి. గురువులతో

సైన్స్ ఏమి చెబుతోందంటే..

సైన్స్ ఏమి చెబుతోందంటే..

అయితే సైన్స్ ప్రకారం గ్రహణం రోజున విడుదలయ్యే అతినీల లోహిత కిరణాల వల్ల ఆహార పదార్థాలపై ఉన్న క్రిమికీటకాలు మరింత పెరిగి, బ్యాక్టీరియా అధికమవుతుంది. ఇలాంటి ఆహారం తీసుకుంటే, ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అలాగే గర్భిణులు గ్రహణం చూడరాదని, ఒక వేళ చూస్తే వారికి పుట్టే పిల్లలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది.

ఉపవాస దీక్ష..

ఉపవాస దీక్ష..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం ప్రభావం 12 రాశి చక్రాలపై కచ్చితంగా ఉంటుందట. అందుకే ఎవరైనా వారి రాశిచక్రం, నక్షత్రాన్ని బట్టి గ్రహణం సమయంలో విశేషంగా పూజలు, జపాలు, దానాలు చేసుకోవాలి. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ గ్రహణం సమయంలో ఉపవాస దీక్షను కచ్చితంగా చేపట్టాలి. దీని వల్ల కచ్చితంగా ఫలితం ఉంటుంది.

ఇవి చేయకూడదు..

ఇవి చేయకూడదు..

  • గ్రహణ సమయంలో పంచాంగం అస్సలు చూడకూడదు.
  • సంస్కృత శబ్దాలు చేయకూడదు.
  • గర్భవతులు బాహ్యాస్నానాలు చేయకూడదు.
  • మూడేళ్ల పిల్లలకు నదులు, సాగరతీరాన స్నానాలు చేయించరాదు.
  • గ్రహణాన్ని నేరుగా చూడకూడదు. ఇది కంటికి ప్రమాదకరం.
  • ఇవి చేయాలి..

    ఇవి చేయాలి..

    • గ్రహణం సమయంలో అందరూ ఇంట్లోనే ఉండటం మంచిది.
    • ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు.
    • తులసి ఆకులను నీటిపై ఉంచడం వల్ల గ్రహణ ప్రభావం తగ్గుతుంది.
    • గ్రహణం తర్వాత కచ్చితంగా స్నానం చేయాలి.
    • చాలా వస్తువులలో గరక వేసుకోవాలి.
    • సూర్య మంత్రాన్ని జపించాలి.
    • గర్భిణులు సంతాన జపం చేయాలి.

English summary

Solar Eclipse 2020: Dos and don’ts

Check out the details what to do and what not to do in solar eclipse.
Desktop Bottom Promotion