Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
Solar Eclipse 2020 : ఈ 4 రాశుల వారికి అదృష్టయోగం... మీ రాశి ఉందేమో చూడండి...
సూర్యగ్రహణం సందర్భంగా ఈ 4 రాశుల వారికి చాలా లక్కీ కలిసి వస్తుందట.
జూన్ 21వ తేదీ ఆదివారం నాడు తొలి సూర్యగ్రహణం జరగబోతోంది. ఇది హైదరాబాద్ కాలమానం ఆధారంగా ఉదయం 10:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1.55 గంటలకు పూర్తవుతుంది. అయితే ఇతర ప్రాంతాలను బట్టి ఈ సమయంలో స్వల్పమార్పులు ఉండొచ్చు.

ఈ సూర్యగ్రహణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం దీని ఆధారంగా గ్రహాల స్థితిగతులను అంచనా వేయొచ్చట. అంతేకాదు రాశి చక్రాలు నక్షత్రాలను బట్టి వర్తమాన మరియు భవిష్యత్ కాలాలను అంచనా వేస్తుంటారు జ్యోతిష్యశాస్త్ర పండితులు.

ఈ సూర్య గ్రహణం ఈ ఏడాది తొలిసారి ఏర్పడబోతోంది. గత ఏడాది సూర్య గ్రహణం డిసెంబరులో పూర్తయ్యింది. అయితే అదే నెలలో కరోనా వైరస్ మహమ్మారి కూడా వెలుగులోకొచ్చింది.

దీని గురించి కొందరు జ్యోతిష్య పండితులు అంతకుముందే చెప్పారు. దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని, చాలా మంది ప్రజలు పిట్టల్లా రాలిపోతారని చెప్పారు. వారు చెప్పినట్టు అది అక్షరాల నిజమైంది.

ఈ సూర్యగ్రహణ ప్రభావం ద్వాదశ రాశులపై ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నారు పండితులు. ఇది వరకే ఏ 4 రాశుల వారికి నష్టాలుంటాయో తెలుసుకున్నాం. అయితే ఈ గ్రహణం వల్ల మరో నాలుగు రాశుల వారికి అదృష్టయోగం కూడా ఉంటుందట... దీని వల్ల మీ జీవితాలలో చాలా మార్పులు వస్తాయంట. వీరికి మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా చాలా బలం చేకూరుతుందట. ఇంతకీ ఆ రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ తొలి సూర్యగ్రహణం వల్ల మేషరాశి వారికి సానుకూల ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా మీ ఆర్థిక పరిస్థితి పూర్తిగా మెరుగవుతుంది. ఇప్పటివరకు పెండింగులో ఉన్న పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ కూడా పెరుగుతుంది. ఈ కాలంలో మీరు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. అయితే మీరు ఎలాంటి వివాదాల్లో తలదూర్చకుండా ఉండాలి. ఇది తప్ప మిగిలిన అన్ని సందర్భాల్లో ఈ గ్రహణం వల్ల మీకు సానుకూల ఫలితాలే వస్తాయి.

సింహ రాశి..
ఈ రాశి వారికి ఈ ఏడాదిలో ఏర్పడబోయే తొలి సూర్యగ్రహణం చాలా మంచిగా ఉంటుంది. మీరు చేస్తున్న పనులన్నింటిలో మీకు విజయం లభిస్తుంది. ఈ సమయంలో మీరు మీ ఇల్లు లేదా కారు వంటి వాటి కోసం షాపింగ్ కూడా చేయవచ్చు. అలాగే మీకు అదనపు ఆదాయం సంపాదించేందుకు మంచి అవకాశం దక్కుతుంది. చాలా మంది ప్రజలతో మంచి సఖ్యత ఏర్పడుతుంది. అయితే మీరు వాహనాన్ని ఉపయోగిస్తున్నప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి.

కన్య రాశి..
ఈ రాశి వారికి సూర్యగ్రహణం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ గ్రహణం వల్ల మీకు అన్ని శుభఫలితాలే ఉంటాయంట. దీని వల్ల మీ మనసు సంతోషంగా ఉంటుంది. అంతేకాదు పెండింగులో పడిపోయిన మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. వీటితో మీకు ఆర్థిక ప్రయోజనాలు దక్కుతాయి. మీకు అదనపు ఆదాయం లభించే అవకాశం కూడా ఉంటుంది.

మకర రాశి..
ఈ రాశి వారికి ఈ సూర్య గ్రహణం వల్ల, ఇంతవరకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోయే అవకాశం ఉంటుంది. దీని వల్ల మీకు చాలా ఉపశమనం కలిగి ఉంటుంది. ఈ సమయంలో మీ ఇంట్లో ఏవైనా శుభకార్యాలు కూడా నిర్వహించొచ్చు. అంతేకాదు మీరు ఆర్థికంగా కూడా లాభపడే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు కొన్ని శుభవార్తలను కూడా పొందవచ్చు.
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications