Surya Grahan 2021 Effects: సూర్య గ్రహణం సమయంలో ఈ రాశులకు తీవ్ర నష్టం జరుగుతుందట...!

2021లో డిసెంబర్ 4న సూర్య గ్రహణం ఏర్పడే సమయంలో రాశిచక్రాలపై పడే ప్రభావమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Solar Eclipse 2021 Astrology:కరోనా వంటి కాలంలో మనం అప్పుడే 2021 సంవత్సర ముగింపు దశకొచ్చేశాం. మరికొన్ని రోజుల్లో మనం కొత్త సంవత్సరంలోకి సరికొత్తగా అడుగు పెట్టబోతున్నాం. అయితే అంతలోనే ఆకాశంలో ఒక ముఖ్యమైన ఖగోళ సంఘటన జరగబోతోంది.

Solar Eclipse 2021 Astrology: Know Surya Grahan Effects on 12 Zodiac Signs in Telugu

అదేంటంటే 2021 సంవత్సరంలో డిసెంబర్ నాలుగో తేదీన అంటే శనివారం నాడు అమావాస్య సమయంలో సూర్య గ్రహణం ఏర్పడబోతోంది. ఈ సూర్య గ్రహణం మన దేశంలో కనిపించదు. ఈ కారణంగా మనకు సూతక్ కాలం కూడా ఉండదు. ఇదిలా ఉండగా జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. గ్రహణం యొక్క ప్రభావం మనలో ఏదో ఒక రూపంలో కనిపిస్తుంది. ఈ సందర్భంగా డిసెంబర్ 4న ఏర్పడే సూర్యగ్రహణం సమయంలో 12 రాశులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి వారికి డిసెంబరులో ఏర్పడబోయే సూర్యగ్రహణం వల్ల ప్రత్యేకంగా ఏమీ ఉండదు. ఈ సమయంలో మీరు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే పెద్ద సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే విధంగా మీరు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి వారికి చివరి సూర్య గ్రహణం సందర్భంగా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో వ్యాపారులకు మంచి ఆర్థిక లాభాలు రావొచ్చు. సంఘంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి వారికి సూర్యగ్రహణం వేళ కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. ఈ కాలంలో మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు ఏదైనా పాత వివాదాలతో ఇబ్బంది పడినట్లయితే, మీరు వాటి నుండి కూడా బయటపడతారు.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారు సూర్యగ్రహణం సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ మాటల్లో సంయమనం పాటించాలి. లేదంటే మీరు గొడవలు పడాల్సి ఉంటుంది. మరోవైపు మీరు పిల్లల వైపు నుండి ఏదైనా సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారికి చివరి సూర్యగ్రహణం వేళ శుభప్రదంగా ఉండొచ్చు. ఈ సమయంలో మీరు కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంది. దీంతో పాటు మీరు గతంలో ఎదురైన సమస్యలకు పరిష్కారం కూడా పొందొచ్చు.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారు సూర్యగ్రహణం సమయంలో శుభ ఫలితాలను పొందే అవకాశం ఉంది. మీరు ధైర్యం మరియు విశ్వాసాన్ని అనుభవిస్తారు. సమాజంలో మీ హోదా పెరుగుతుంది.

తులా రాశి..

తులా రాశి..

ఈ రాశి వారికి సూర్య గ్రహణం సమయంలో ప్రతికూలంగా ఉండొచ్చు. ఇలాంటి సమయంలో మీరు మీ ప్రసంగాన్ని నియంత్రించుకోవాలి. లేదంటే మీరు మానసిక ఒత్తిడిని అనుభవించొచ్చు.

వృశ్చికరాశి..

వృశ్చికరాశి..

ఈ రాశి వారికి సూర్య గ్రహణం సమయంలో కొన్ని సమస్యలు ఎదురుకావొచ్చు. ఈ కాలంలో మీ పనులు ప్రణాళిక ప్రకారం జరగవు. ఈ కారణంగా మీకు సమస్యలు పెరిగే అవకాశం ఉంది. అలాగే మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి వారికి సూర్య గ్రహణం సమయంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మీరు అనవసరమైన విషయాల గురించి ఇబ్బంది పడొచ్చు. అలాగే, మీ ఖర్చులు పెరగడం వల్ల మీ బడ్జెట్ పాడు కావొచ్చు.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారికి సూర్య గ్రహణం సమయంలో శుభ ప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో ఉద్యోగులు పురోగతి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ కెరీర్లో కూడా సానుకూల మార్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారికి సూర్య గ్రహణం సమయంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు కొత్త ఆదాయ వనరులను పొందడం ద్వారా మీ ఆర్థిక పరిస్థితిలో పెద్ద మెరుగుదల రావొచ్చు.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి వారు సూర్య గ్రహణం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ కాలంలో మీకు ఇంట్లో లేదా ఆఫీసులో అనవసర వివాదాలు వచ్చే అవకాశం ఉంది. దీంతో మీరు మానసికంగా ఒత్తిడికి గురవుతారు. అలాగే ఈ సమయంలో మీరు వాహనాన్ని జాగ్రత్తగా నడపాలి.

Desktop Bottom Promotion