Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
Solar Eclipse 2021 Astrology: సూర్య గ్రహణ వేళ ఈ ఆరు రాశుల వారికి అశుభ ఫలితాలు...!
2021లో డిసెంబర్ 4న సూర్య గ్రహణం ఏర్పడే సమయంలో ఆరు రాశిచక్రాలపై అశుభ ఫలితాలు పడనున్నాయట.
Solar Eclipse 2021 Astrology:జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యగ్రహణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శాస్త్రీయ పరంగా కూడా సూర్యగ్రహణానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.

అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, సూర్య గ్రహణాన్ని అశుభకరమైన సంఘటనగా పరిగణిస్తారు. సూర్యుడిని గ్రహాలకు రాజుగా భావిస్తారు. సూర్యుడు కూడా ఆత్మ తండ్రి మరియు ఉన్నత స్థానానికి సంబంధించిన వాడు. ఈ సమయంలో వివాహాది కార్యక్రమాలు నిషేధించారు.

అలాగే ఎలాంటి శుభకార్యాలు కూడా చేయరు. దేవాలయాలను సైతం మూసి వేస్తారు. ఈ నేపథ్యంలో 2021 సంవత్సరంలో డిసెంబర్ నాలుగో తేదీన అంటే శనివారం నాడు అమావాస్య సమయంలో సూర్య గ్రహణం ఏర్పడబోతోంది. ఈ సూర్య గ్రహణం మన దేశంలో కనిపించదు. ఇది దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా వంటి దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది.

ఈ కారణంగా మనకు సూతక్ కాలం కూడా ఉండదు. ఇదిలా ఉండగా జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. గ్రహణం యొక్క ప్రభావం మనలో ఏదో ఒక రూపంలో కనిపిస్తుంది. ఈ సందర్భంగా డిసెంబర్ 4న ఏర్పడే సూర్యగ్రహణం సమయంలో ఆరు రాశుల వారికి అశుభ ఫలితాలు రానున్నాయట. ఆ రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి వారికి డిసెంబరులో ఏర్పడబోయే సూర్యగ్రహణం వల్ల ప్రత్యేకంగా ఏమీ ఉండదు. ఈ సమయంలో మీరు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో మీరు ఏదైనా పెద్ద వ్యాధి బారిన పడొచ్చు. లేదంటే పెద్ద సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే విధంగా మీరు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఏదైనా ప్రమాదాలకు గురి కావాల్సి ఉంటుంది.

కర్కాటక రాశి..
ఈ రాశి వారు సూర్యగ్రహణం సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీకు అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాటల్లో సంయమనం పాటించాలి. లేదంటే మీరు గొడవలు పడాల్సి ఉంటుంది. అలాగే మిత్రులతో కూడా వివాదాలు ఏర్పడొచ్చు. మరోవైపు మీరు పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

సింహ రాశి..
ఈ రాశి వారికి చివరి సూర్యగ్రహణం సందర్భంగా.. ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో మీరు చాలా ఓపికగా ఉండాలి. మరోవవైపు మీరు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రణాళికల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవ్వరికీ రుణాలు ఇవ్వకండి. రుణాలు తీసుకోవడం మానుకోండి.

తుల రాశి..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్య గ్రహణం సమయంలో ఈ రాశి వారు ప్రతికూల ప్రభావాలను పొందొచ్చు. ఈ కాలంలో మీరు కోపంగా ఉండటం మానుకోవాలి. ఎవరినైనా దుర్భాషలాడటం హానికరంగా మారుతుంది. మరోవైపు ఈ సమయంలో మీరు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. లేదంటే మీ ఆరోగ్యం క్షీణించొచ్చు. సరైన సమయానికి ఆహారం తీసుకోవాలి. మీరు ఈ సమయంలో కొంత మానసిక ఒత్తిడిని కూడా అనుభవించొచ్చు..

వృశ్చికరాశి..
ఈ రాశి వారికి సూర్య గ్రహణం సమయంలో కొన్ని సమస్యలు ఎదురుకావొచ్చు. ఈ కాలంలో మీ పనులు ప్రణాళిక ప్రకారం జరగవు. ఈ కారణంగా మీకు సమస్యలు పెరిగే అవకాశం ఉంది. అలాగే మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.

ధనస్సు రాశి..
ఈ రాశి వారికి సూర్య గ్రహణం సమయంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు అనవసరమైన విషయాల గురించి ఇబ్బంది పడొచ్చు. అలాగే, మీ ఖర్చులు పెరగడం వల్ల మీ బడ్జెట్ పాడు కావొచ్చు. మీరు ఏదైనా పనిని ప్రారంభిస్తే వాటిని పూర్తి చేసేందుకు చాలా కష్టపడాల్సి రావొచ్చు.
గమనిక : ఇక్కడ అందించిన రాశిచక్రాల సమచారం కేవలం జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అందించినవి. అలాగే మాకున్న పరిజ్ణానంతో ఊహించి పబ్లిష్ చేయబడినవి.. దీనికి boldskyteluguకు ఎలాంటి సంబంధం లేదు. ఈ సమాచారాన్ని నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం. ఒకవేళ మీకు పూర్తి వివరాలు కావాలంటే వ్యక్తిగత జ్యోతిష్య నిపుణుడిని సంప్రదించగలరు.
2021 సంవత్సరంలో డిసెంబర్ నెలలో నాలుగో తేదీన అంటే శనివారం అమావాస్య రోజున రెండో, చివరి సూర్యగ్రహణం వచ్చింది.
2021 సంవత్సరంలో డిసెంబర్ నాలుగో తేదీన అంటే శనివారం నాడు అమావాస్య రోజున ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. అలా ప్రారంభమైన గ్రహణం మధ్యాహ్నం 3:07 గంటల వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. మన దేశంలోని దేవాలయాన్నింటినీ కూడా మూసివేస్తారు.
2021 సంవత్సరంలో డిసెంబర్ నాలుగో తేదీన ఏర్పడబోయే సూర్యగ్రహణాన్ని మన దేశంలో నివసించేవారు చూడలేరు. ఎందుకంటే ఇది మన దేశంలో కనిపించదు. అందువల్ల దీని ప్రభావం ఎవరిపైనా ఉండకపోవచ్చు. అయితే ఈ గ్రహణం దక్షిణ అమెరికా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మరియు అంటార్కిటికాల ప్రాంతాల్లో కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. 2021 డిసెంబర్ నాలుగో తేదీన ఏర్పడబోయే సూర్యగ్రహణం వల్ల ఆరు రాశుల వారికి అశుభ ఫలితాలు కలగనున్నాయట. ఆ రాశులేవంటే.. మేష రాశి, కర్కాటక రాశి, సింహ రాశి, తుల రాశి, వృశ్చిక రాశి, ధనస్సు రాశులు.



Click it and Unblock the Notifications











