For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Solar Eclipse 2021: సూర్యగ్రహణం వల్ల ఈ 5 రాశుల వారికి ఇబ్బందులు...!

|

2021 సంవత్సరంలో తొలి సూర్యగ్రహణం జూన్ పదో తేదీన ఏర్పడబోతోంది. జ్యేష్ట మాసం క్రిష్ణ పక్షం అమావాస్య రోజున అంటే గురువారం మధ్యాహ్నం 1:42 గంటలకు సూర్య గ్రహణం ప్రారంభమవుతుంది.

తిరిగి సాయంత్రం 6:41 గంటలకు గ్రహణం ముగుస్తుంది. ఖగోళ శాస్త్రం ప్రకారం ఈ సూర్య గ్రహణం మన దేశంలో పాక్షికంగానే కనిపిస్తుంది. అయితే వలయకారంగా ఈ గ్రహణం ఏర్పడుతుంది.

ఈ సమయంలో సూర్యుడిలో 99 శాతం భాగం చంద్రుడు కప్పబడి ఉంటాడు. దీని ఫలితంగానే వలయాకారం ఏర్పడుతుంది. ఈ గ్రహణాన్నే రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా అంటారు. అంటే రింగు మాదిరిగా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. కరోనా కారణంగా ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో ఈ ఏడాది గ్రహణం ఏర్పడబోతోంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ గ్రహణం చాలా ముఖ్యమైనది. ఈసారి సూర్యగ్రహణం వృషభరాశిలో జరగబోతోంది. ఈ నేపథ్యంలో ద్వాదశ రాశులపై ప్రభావం ఉంటుంది.. అయితే ఐదు రాశులపై ఈ సూర్య గ్రహణ ప్రభావం తీవ్రంగా ఉంటుందట. వీరు ఏ పని చేసినా ప్రతికూల ఫలితాలే వస్తాయంట. ఇంతకీ ఆ రాశులేవీ.. అందులో మీ రాశి కూడా ఉందో లేదో ఇప్పుడే తెలుసుకోండి...

Solar Eclipse 2021: తొలి సూర్యగ్రహణం.. ఈ రాశులపై తీవ్ర ప్రభావం...!Solar Eclipse 2021: తొలి సూర్యగ్రహణం.. ఈ రాశులపై తీవ్ర ప్రభావం...!

వృషభ రాశి..

వృషభ రాశి..

సూర్య గ్రహణం వల్ల ఈ రాశి వారికి శుభప్రదంగానే ఉంటుంది. కానీ గ్రహణం సమయంలో ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరంగా కూడా మంచిగా ఉంటుంది. అయితే ఈ సమయంలో మీరు ఎలాంటి రిస్క్ చేయకూడదు. మీ ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. మీరు డబ్బు ఆదా చేయడం చాలా కష్టమవుతుంది. గ్రహణ ప్రభావం వల్ల ఈ ఏడాది చివర్లో మీరు ఆర్థిక విషయాల్లో పెద్ద నష్టాలను చవి చూస్తారు. కాబట్టి దీర్ఘకాలిక పెట్టుబడుల్లో పెద్ద మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టకండి. ప్రేమ విషయంలోనూ ఈ సమయం ప్రతికూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు జర్నీ చేయకపోవడమే మంచిది.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి వారు సూర్య గ్రహణం సమయంలో ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. మీ ఖర్చులు కూడా ఎక్కువగా పెరుగుతాయి. మీకు రుణాల బాధలు చాలా ఎక్కువ కావొచ్చు. కాబట్టి మీరు ఎవరితో అయినా అప్పు తీసుకునేటప్పుడు పది సార్లు ఆలోచించండి. మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తుంటే ప్రస్తుతానికి ఆ ఆలోచనను వదిలేయండి. ఈ సమయంలో ఎక్కడైనా పెట్టుబడి పెట్టడానికి ముందు మీ భాగస్వామిని సంప్రదించాలి. గ్రహణం సమయంలో మీరు మీ మనస్సులో శివుడిని తలచుకుంటే అంతా మంచి జరుగుతుంది.

శని తిరోగమనం వల్ల 12 రాశుల వారిపై ఎలాంటి ప్రభావమంటే..!శని తిరోగమనం వల్ల 12 రాశుల వారిపై ఎలాంటి ప్రభావమంటే..!

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారికి సూర్యగ్రహణం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. గ్రహణం ప్రారంభమైన కొద్ది సేపటికే మీకు ఎముకలకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. అంతేకాకుండా మీ కళ్లకు సంబంధించి కొన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి మీరు మీ కళ్లతో ప్రత్యక్షంగా గ్రహణాన్నిచూడకండి. ఉద్యోగులకు, వ్యాపారులకు ఈ సమయంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా అప్రమత్తంగా ఉండాలి. ఈ సమయంలో డబ్బు ఆదా చేయడం కష్టమవుతుంది. ఈ సమయంలో కొన్ని కోర్టు కేసులలో చిక్కుకోవచ్చు.

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి వారికి సూర్య గ్రహణం వల్ల ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. ఈ సమయంలో గర్భిణులు చాలా అప్రమత్తంగా ఉండాలి. మీ పిల్లలకు ఏదైనా హాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని నివారించేందుకు ఈ సమయంలో మీరు ఇంటి నుండి బయటకు వెళ్లకండి. ఉద్యోగం, వ్యాపారం రెండింటిలోనూ చాలా శ్రద్ధగా పని చేయాలి. ఈ సమయంలో మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు తప్పనిసరిగా ఇంటి పెద్దలను సంప్రదించాలి. మీరు స్నేహితులతో సన్నిహితంగా ఉంటారు. గ్రహణం సమయంలో మీరు కొంత ఒత్తిడిని కూడా ఎదుర్కొంటారు. ఆర్థిక పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. గ్రహణం పూర్తయిన ఒకట్రెండు రోజుల వరకు ఏ పని మీద మీరు శ్రద్ధ పెట్టలేరు.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారు వలయాకార(రింగ్ ఆఫ్ సన్) సూర్య గ్రహణం సమయంలో అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో విద్యార్థులకు చాలా కష్టంగా ఉంటుంది. మీరు ఎంత కష్టపడినా, మీరు కోరుకున్న ఫలితాలు రాకపోవచ్చు. మీ కుటుంబంలో కూడా పరిస్థితులు ప్రతికూలంగా ఉంటారు. ఈ సమయంలో ఉద్యోగులు తమ ఉద్యోగాలను మార్చాలని ఆలోచిస్తుంటే ఈ ఆలోచనను పూర్తిగా వదులుకోవాలి. అలా చేయడం వల్ల మీకు ప్రయోజనం కంటే ఎక్కువ హానికరంగా ఉంటుంది. మరోవైపు ఈ సమయంలో వ్యాపారులు లాభాలు పొందొచ్చు. ఈ ఏడాది మీరు ఆర్థిక పరంగా కొంత లాభాలను పొందుతారు. అయితే మీ పనిని వాయిదా వేసే అలవాటు కారణంగా, మీరు విజయవంతం కాలేరు.

English summary

Solar Eclipse 2021 Is on 10th June, These Zodiac Signs Should Be Careful

Here we are talking about the solar eclipse 2021 is on 10th june, these zodiac signs should be careful. Have a look