Just In
- 4 hrs ago
Today Rasi Phalalu :ఓ రాశి నిరుద్యోగులు ఈరోజు మరింత కష్టపడాలి..!
- 15 hrs ago
Vastu Tips:నిద్రించే వేళ ఇవి అస్సలు దగ్గర ఉంచుకోవద్దు...! ఎందుకంటే చెడు ఫలితాలొస్తాయట...!
- 16 hrs ago
కోవిడ్ సమయంలో భయపెట్టిన మంకీ పాక్స్: ఈ రెండింటి మద్య లక్షణాలు ఇవే..
- 18 hrs ago
స్త్రీలు గర్భస్రావం గురించి మూఢనమ్మకాలు అంటే ఏమిటో తెలుసా? ఇదంతా అపోహా..వాస్తవమా...!
Don't Miss
- Automobiles
విడుదలకు ముందే ప్రారంభమైన Citroen C3 బుకింగ్స్.. ఇక లాంచ్ ఎప్పుడంటే?
- Finance
ఐసీఐసీఐ బ్యాంకు గోల్డెన్ ఇయర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు పెంపు
- Movies
Anchor Manjusha వీడియో క్లిప్ వైరల్.. టాప్ హీరోయిన్‌కు ఏ మాత్రం తగ్గకుండా స్టెప్పులతో జోరు
- News
పోలీసుల చక్రబంధంలో అమలాపురం: బస్సులు తాత్కాలిక రద్దు; కొత్తవారు రాకుండా ఆంక్షలు
- Sports
నిద్రలేని రాత్రులు గడిపా: గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నా: కేరీర్లో ఆ ముగ్గురే కీలకం: హార్దిక్ పాండ్యా
- Technology
హువాయి కొత్త ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది!! ఫీచర్స్ మీద ఓ లుక్ వేయండి...
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Solar Eclipse 2021:చివరి సూర్యగ్రహణం ఎప్పుడు? ఎక్కడ కనిపిస్తుందంటే...
2021 సంవత్సరంలో డిసెంబర్ నెలలో రెండోది మరియు చివరి సూర్య గ్రహణం ఏర్పడనుంది. శాస్త్రవేత్తల ప్రకారం.. సూర్యునికి మరియు భూమికి మధ్య చంద్రుడు వెళ్లినప్పుడు, చంద్రుడు సూర్యుని కాంతిని భూమిని చేరకుండా కొంత సమయం పడుతుంది.
ఈ సమయంలో సూర్యుడి నీడ కనిపించదు. ఇదిలా ఉండగా.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, సూర్య గ్రహణాన్ని చాలా అశుభకరంగా భావిస్తారు. అందుకే గ్రహణం సమయంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు. దేవాలయాలు కూడా పూర్తిగా మూసివేస్తారు.
ఎందుకంటే గ్రహణం సమయంలో సూర్యుడి ప్రభావంతో శక్తిని కోల్పోతారని చాలా మంది నమ్ముతారు. ఈ సందర్భంగా చివరి సూర్యగ్రహణం ఎప్పుడు సంభవిస్తుంది? దీన్ని ఎక్కడ చూడొచ్చు.. భారతదేశంలో సూర్య గ్రహణ ప్రభావం ఎంత మేరకు ఉంటుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
2021లో
డిసెంబర్
నెలలో
వచ్చే
ముఖ్యమైన
పండుగలు,
వ్రతాలివే...

సూర్యగ్రహణ తేదీ, సమయం..
రెండో సూర్య గ్రహణం ఎంత సమయం ఉంటుంది?
2021 సంవత్సరంలో డిసెంబర్ నాలుగో తేదీన అంటే శనివారం నాడు అమావాస్య రోజున ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. అలా ప్రారంభమైన గ్రహణం మధ్యాహ్నం 3:07 గంటల వరకు కొనసాగుతుంది. ఈ గ్రహణం అమావాస్య రోజున శనివారం నాడు రావడం వల్ల దీన్ని పాక్షిక సూర్య గ్రహణంగా భావిస్తారు.

గ్రహణం ఎక్కడ కనిపిస్తుందంటే?
2021 సంవత్సరంలో డిసెంబర్ నాలుగో తేదీన ఏర్పడబోయే సూర్యగ్రహణాన్ని మన దేశంలో నివసించేవారు చూడలేరు. ఎందుకంటే ఇది మన దేశంలో కనిపించదు. అందువల్ల దీని ప్రభావం ఎవరిపైనా ఉండకపోవచ్చు. అయితే ఈ గ్రహణం దక్షిణ అమెరికా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మరియు అంటార్కిటికాల ప్రాంతాల్లో కనిపిస్తుందని నాసా వివరించింది. ఇది భూమి యొక్క ఉపరితలం అంతటా సూర్యగ్రహణం యొక్క మార్గాన్ని చూపుతుందని వెల్లడించింది.

సూతక్ కాల ప్రభావం ఉండదు..
2021 సంవత్సరంలో డిసెంబర్ నాలుగో తేదీన ఏర్పడబోయే సూర్యగ్రహణాన్ని మన దేశంలో కనిపించదు, కాబట్టి దీన్ని పాక్షిక లేదా పెనుంబ్రల్ గ్రహణం అంటారు. ఈ కారణంగా భారతదేశంలో సూతక్ కాలం ప్రభావం ఉండదు. అయితే సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించినప్పుడు మాత్రం సూతక్ కాలం 12 గంటల ముందే ప్రారంభమవుతుంది. నవంబర్ నెలలో 19వ తేదీన చంద్ర గ్రహణం తర్వాత కొద్ది రోజుల్లోనే సూర్య గ్రహణం సంభవిస్తోంది. అందుకే దీన్ని జ్యోతిష్యులు అశుభకరమైనదిగా భావిస్తారు. పురాణాల ప్రకారం.. సూర్య దేవుడు శని దేవుడికి తండ్రి కాబట్టి సింహం, మకరం, కుంభ రాశి వ్యక్తులు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
Margasira
Month
2021:
ఈ
మాసం
శ్రీక్రిష్ణుడికి
ఎందుకు
అంకితం
చేయబడిందో
తెలుసా...

గర్భిణులు జాగ్రత్త..
మన దేశంలో సూర్య గ్రహణ ప్రభావం కనిపించనప్పటికీ.. జ్యోతిష్య పండితుల ప్రకారం.. గర్భిణులు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి.
* సూర్య గ్రహణం సమయంలో గర్భిణులు ఎలాంటి పదార్థాలు తినడం గానీ.. తాగడం గానీ చేయకండి.
* సూర్య గ్రహణాన్ని మీ కళ్లతో నేరుగా చూడకండి. ఎందుకంటే దీని వల్ల మీ కళ్లు దెబ్బ తినొచ్చు.
* సూర్య గ్రహణం సమయంలో ఎలాంటి పూజలు చేయకండి. * ఎందుకంటే సూర్యుడు దేవుని విగ్రహాలను అపవిత్రం చేస్తాడని చాలా మంది నమ్ముతారు.
* సూర్య గ్రహణం చూడటానికి సాధారణ సన్ గ్లాసెస్ లేదా డార్క్ సన్ గ్లాసెస్ ఉపయోగించొద్దు.
* గ్రహణాన్ని చూసేందుకు ప్రత్యేక సోలార్ ఫిల్టర్లను ఉపయోగించాలి. * గ్రహణాన్ని సంగ్రహించేందుకు బైనాక్యులర్లు, టెలిస్కోప్ లు, కెమెరాలను వాడుతున్నప్పుడు, లైన్స్ పై రక్షిత సోలార్ ఫిల్టర్ ని వాడండి.

ఎలా చూడాలంటే..
* బాక్స్ పిన్ హోల్ ప్రొజెక్టర్ సూర్యగ్రహణాన్ని సురక్షితంగా చూడటంలో సహాయపడుతుంది.
* దీర్ఘచతురస్రకారంలో ఉండే పొడవైన బాక్సుకు ఒకవైపున పిన్ హోల్ గుచ్చండి.
* బాక్స్ యొక్క మరో చివరి భాగంలో తెల్లని కాగితాన్ని అంటించండి
* కాగితంపై పడే చిత్రాన్ని చూసేందుకు పెట్టే దిగువన ఒక రంధ్రం పెట్టండి.
* అప్పుడు సూర్యుని వైపు మీ వెనుకభాగంలో నిలబడి,పెట్టెను మీ తలపై ఉంచండి. పిన్ హోల్ ను సూర్యుని వైపు ఉంచాలి.
* బాక్సు లోపలి కాగితంపై గ్రహణం పట్టిన సూర్యుని ప్రొజెక్షన్ కనిపించే వరకు మీ స్థానాన్ని సర్దుబాటు చేస్తూ ఉండండి.

గ్రహణానికి ముందు..
సూర్య గ్రహణానికి ముందు స్నానం చేయండి.
* సూర్య గ్రహణం సమయంలో సూర్య మంత్రాలు జపించండి.
* సూర్య గ్రహణం సమయంలో ఎవరిపై కోపం పడొద్దు. ప్రశాంతంగా ఉండండి.
*గ్రహణం సమయంలో కత్తెర, కత్తులు వంటి వాటిని అస్సలు వాడకండి.
* సూర్య గ్రహణం సమయంలో ఏదైనా పని చేసే ముందు జ్యోతిష్యులను సంప్రదించండి.
2021 సంవత్సరంలో డిసెంబర్ నెలలో నాలుగో తేదీన అంటే శనివారం అమావాస్య రోజున రెండో, చివరి సూర్యగ్రహణం వచ్చింది.
2021 సంవత్సరంలో డిసెంబర్ నాలుగో తేదీన అంటే శనివారం నాడు అమావాస్య రోజున ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. అలా ప్రారంభమైన గ్రహణం మధ్యాహ్నం 3:07 గంటల వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. మన దేశంలోని దేవాలయాన్నింటినీ కూడా మూసివేస్తారు.
2021 సంవత్సరంలో డిసెంబర్ నాలుగో తేదీన ఏర్పడబోయే సూర్యగ్రహణాన్ని మన దేశంలో నివసించేవారు చూడలేరు. ఎందుకంటే ఇది మన దేశంలో కనిపించదు. అందువల్ల దీని ప్రభావం ఎవరిపైనా ఉండకపోవచ్చు. అయితే ఈ గ్రహణం దక్షిణ అమెరికా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మరియు అంటార్కిటికాల ప్రాంతాల్లో కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.