For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Solar Eclipse 2022 in April:ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఎప్పుడు? మన దేశంలో కనిపిస్తుందా? లేదా?

2022లో ఏప్రిల్ నెలలో సూర్య గ్రహన తేదీ, సమయం మరియు తొలి సూర్యగ్రహణం కనిపిస్తుందా లేదా అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఏప్రిల్ నెలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నెలలో మొత్తం 9 గ్రహాలు తమ రాశిచక్రాలను మారనున్నాయి.

Solar Eclipse 2022 in April : Know Date, Time and First Surya Grahan Visibility in India in Telugu

ఇందులో శని, గురు, రాహు, కేతు గ్రహాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే 2022 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో 30వ తేదీన శనివారం అర్థరాత్రి 12:15 గంటలకు(భారత సమయం ప్రకారం) తొలి సూర్య గ్రహణం కూడా ఏర్పడనుంది.

Solar Eclipse 2022 in April : Know Date, Time and First Surya Grahan Visibility in India in Telugu

ఆ మరుసటి రోజు అంటే మే ఒకటో తేదీన ఉదయం 4:07 గంటల వరకు ఉంటుది. అంటే ఇది పాక్షిక గ్రహణంగా మేషరాశిలో ప్రారంభమవుతుంది. శాస్త్రవేత్తల ప్రకారం.. సూర్యునికి మరియు భూమికి మధ్య చంద్రుడు వెళ్లినప్పుడు, చంద్రుడు సూర్యుని కాంతిని భూమిని చేరకుండా కొంత సమయం పడుతుంది. ఈ సమయంలో సూర్యుడి నీడ కనిపించదు. ఇదిలా ఉండగా.. సూర్య గ్రహణాన్ని కొందరు అశుభకరంగా భావిస్తారు. అందుకే గ్రహణం సమయంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు. దేవాలయాలు కూడా పూర్తిగా మూసివేస్తారు.

Solar Eclipse 2022 in April : Know Date, Time and First Surya Grahan Visibility in India in Telugu

ఎందుకంటే గ్రహణం సమయంలో సూర్యుడి ప్రభావంతో శక్తిని కోల్పోతారని చాలా మంది నమ్ముతారు. ఈ సందర్భంగా తొలి సూర్యగ్రహణాన్ని ఎక్కడ చూడొచ్చు.. భారతదేశంలో సూర్య గ్రహణ ప్రభావం ఎంత మేరకు ఉంటుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

రెండు సూర్యగ్రహణాలు..

రెండు సూర్యగ్రహణాలు..

2022 సంవత్సరంలో తొలి సూర్య గ్రహణం ఏప్రిల్ 30వ తేదీన శనివారం నాడు దక్షిణ మరియు పశ్చిమ అమెరికా, పసిఫిక్ మహా సముద్రం, అట్లాంటిక్, అంటార్కిటిక్ మహాసముద్రంలో సంభవిస్తుంది. 2022లో సంభవించే రెండు సూర్య గ్రహణాలలో ఇది మొదటిది. రెండో సూర్య గ్రహణం 25వ తేదీన ఏర్పడనుంది.

నాలుగు రోజుల ముందు..

నాలుగు రోజుల ముందు..

ఖగోళ శాస్త్రం ప్రకారం, 2022 సంవత్సరంలో మొత్తం రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు ఉంటాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, వీటిని చాలా ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. ఏప్రిల్ 30న సూర్య గ్రహణం చంద్రుడు భూమికి అత్యంత దూరంలో చేరుకోవడానికి కేవలం నాలుగు రోజుల ముందే ఇది సంభవిస్తుంది.

భారత్ లో కనిపిస్తుందా?

భారత్ లో కనిపిస్తుందా?

2022 సంవత్సరంలో తొలి సూర్య గ్రహణం ఏప్రిల్ 30వ తేదీన శనివారం నాడు దక్షిణ మరియు పశ్చిమ అమెరికా, పసిఫిక్ మహా సముద్రం, అట్లాంటిక్, అంటార్కిటిక్ మహాసముద్రంలో ఏర్పడటం వల్ల.. మన దేశంలో సూర్య గ్రహణం కనిపించదు.

సూర్య మంత్రాలను..

సూర్య మంత్రాలను..

* సూర్య గ్రహణం సమయంలో సూర్య మంత్రాలు జపించాలి.

* సూర్య గ్రహణం సమయంలో ఎవరిపై కోపంగా ఉండకూడదు ప్రశాంతంగా ఉండండి.

* సూర్య గ్రహణానికి ముందు స్నానం చేయండి.

*గ్రహణం సమయంలో కత్తెర, కత్తులు వంటి పదునైన వస్తువులను వాడకూడదు.

* సూర్య గ్రహణం సమయంలో ఏదైనా పని చేసే ముందు జ్యోతిష్యులను సంప్రదించండి.

గ్రహణాన్ని ఇలా చూడండి..

గ్రహణాన్ని ఇలా చూడండి..

* బాక్స్ పిన్ హోల్ ప్రొజెక్టర్ సూర్యగ్రహణాన్ని సురక్షితంగా చూడటంలో సహాయపడుతుంది.

* దీర్ఘచతురస్రకారంలో ఉండే పొడవైన బాక్సుకు ఒకవైపున పిన్ హోల్ గుచ్చండి.

* బాక్స్ యొక్క మరో చివరి భాగంలో తెల్లని కాగితాన్ని అంటించండి

* కాగితంపై పడే చిత్రాన్ని చూసేందుకు పెట్టే దిగువన ఒక రంధ్రం పెట్టండి.

* అప్పుడు సూర్యుని వైపు మీ వెనుకభాగంలో నిలబడి,పెట్టెను మీ తలపై ఉంచండి. పిన్ హోల్ ను సూర్యుని వైపు ఉంచాలి.

* బాక్సు లోపలి కాగితంపై గ్రహణం పట్టిన సూర్యుని ప్రొజెక్షన్ కనిపించే వరకు మీ స్థానాన్ని సర్దుబాటు చేస్తూ ఉండండి.

FAQ's
  • భారతదేశంలో 2022లో తొలి సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడబోతోంది?

    2022 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో 30వ తేదీన శనివారం అర్థరాత్రి 12:15 గంటలకు(భారత సమయం ప్రకారం) తొలి సూర్య గ్రహణం కూడా ఏర్పడనుంది. ఆ మరుసటి రోజు అంటే మే ఒకటో తేదీన ఉదయం 4:07 గంటల వరకు ఉంటుది. అంటే ఇది పాక్షిక గ్రహణంగా మేషరాశిలో ప్రారంభమవుతుంది.

    శాస్త్రవేత్తల ప్రకారం.. సూర్యునికి మరియు భూమికి మధ్య చంద్రుడు వెళ్లినప్పుడు, చంద్రుడు సూర్యుని కాంతిని భూమిని చేరకుండా కొంత సమయం పడుతుంది.

  • 2022లో సూర్య గ్రహణాన్ని ఎక్కడ చూడొచ్చు?

    2022 సంవత్సరంలో తొలి సూర్య గ్రహణం ఏప్రిల్ 30వ తేదీన శనివారం నాడు దక్షిణ మరియు పశ్చిమ అమెరికా, పసిఫిక్ మహా సముద్రం, అట్లాంటిక్, అంటార్కిటిక్ మహాసముద్రంలో ఏర్పడటం వల్ల.. మన దేశంలో సూర్య గ్రహణం కనిపించదు.

  • సూర్యగ్రహణాన్ని ఎలా చూడాలి?

    * బాక్స్ పిన్ హోల్ ప్రొజెక్టర్ సూర్యగ్రహణాన్ని సురక్షితంగా చూడటంలో సహాయపడుతుంది.

    * దీర్ఘచతురస్రకారంలో ఉండే పొడవైన బాక్సుకు ఒకవైపున పిన్ హోల్ గుచ్చండి.

    * బాక్స్ యొక్క మరో చివరి భాగంలో తెల్లని కాగితాన్ని అంటించండి

    * కాగితంపై పడే చిత్రాన్ని చూసేందుకు పెట్టే దిగువన ఒక రంధ్రం పెట్టండి.

    * అప్పుడు సూర్యుని వైపు మీ వెనుకభాగంలో నిలబడి,పెట్టెను మీ తలపై ఉంచండి. పిన్ హోల్ ను సూర్యుని వైపు ఉంచాలి.

    * బాక్సు లోపలి కాగితంపై గ్రహణం పట్టిన సూర్యుని ప్రొజెక్షన్ కనిపించే వరకు మీ స్థానాన్ని సర్దుబాటు చేస్తూ ఉండండి.

English summary

Solar Eclipse 2022 in April : Know Date, Time and First Surya Grahan Visibility in India in Telugu

Solar Eclipse 2022: The first Surya Grahan of the year 2022 will occur on April 30, Saturday. Know Date, Time and First Surya Grahan Visibility in India in Telugu
Desktop Bottom Promotion