Solar Eclipse April 2022 Astrology : ఏప్రిల్ లో తొలి సూర్య గ్రహణం వేళ.. ఏ రాశిపై ఎలాంటి ప్రభావమంటే...!

2022లో ఏప్రిల్ 30న తొలి సూర్య గ్రహణం వేళ, రాశిచక్రాలపై పడే ప్రభావాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఏప్రిల్ నెలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నెలలో మొత్తం 9 గ్రహాలు తమ రాశిచక్రాలను మారనున్నాయి.

Solar Eclipse April 2022 Astrology : Surya Grahan Effects on All Zodiac Signs in Telugu

ఇందులో శని, గురు, రాహు, కేతు గ్రహాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే 2022 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో 30వ తేదీన శనివారం అర్థరాత్రి 12:15 గంటలకు(భారత సమయం ప్రకారం) తొలి సూర్య గ్రహణం కూడా ఏర్పడనుంది.

Solar Eclipse April 2022 Astrology : Surya Grahan Effects on All Zodiac Signs in Telugu

ఆ మరుసటి రోజు అంటే మే ఒకటో తేదీన ఉదయం 4:07 గంటల వరకు ఉంటుది. అంటే ఇది పాక్షిక గ్రహణంగా మేషరాశిలో ప్రారంభమవుతుంది. ఇదిలా ఉండగా.. సూర్య గ్రహణాన్ని కొందరు అశుభకరంగా భావిస్తారు. అందుకే గ్రహణం సమయంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు. దేవాలయాలు కూడా పూర్తిగా మూసివేస్తారు.ఎందుకంటే గ్రహణం సమయంలో సూర్యుడి ప్రభావంతో శక్తిని కోల్పోతారని చాలా మంది నమ్ముతారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే ఏప్రిల్ నెలలో తొలి సూర్య గ్రహణం సమయంలో ద్వాదశ రాశులపై ఎలాంటి ప్రభావం పడుతుంది.. ఎవరెవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి వారికి సూర్య గ్రహణం సమయంలో ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ కాలంలో మీ ఖర్చులు పెరగొచ్చు. అప్పులు తీసుకోవడం మానుకోవాలి. ఉద్యోగం కోసం ఎదురుచూసే వారికి శుభవార్తలు వినిపిస్తాయి. మరోవైపు కుటుంబ నియంత్రణ కోసం ఎదురుచూసే సమయం అనుకూలంగా ఉంటుంది.

వృషభరాశి..

వృషభరాశి..

ఈ రాశి వారికి సూర్య గ్రహణం సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురుకావొచ్చు. మీరు మానసికంగా ఇబ్బంది పడొచ్చు. మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ ఇబ్బంది పడతారు. అయితే మీరు చేసిన కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మంచిగానే ఉంటుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది.

మిధున రాశి..

మిధున రాశి..

సూర్య గ్రహణం వేళ ఈ రాశి వారి ఆరోగ్యం బాగానే ఉంటుంది. అయితే మీరు ఎలాంటి అజాగ్రత్తలు తీసుకోకుండా ఉండాలి. మీరు మానసిక ఒత్తిడితో కూడా ఇబ్బంది పడొచ్చు. మీరు కుటుంబ జీవితంలో కొన్ని శుభవార్తలు వింటారు. స్టాక్ మార్కెట్ తో అనుబంధం ఉన్న వ్యక్తులు మంచి ప్రయోజనాలు పొందొచ్చు. ఈ కాలంలో ఎవరికైనా రుణాలు ఇవ్వడం మానుకోవాలి. వివాహితులకు ఈ సమయం మంచిగా ఉంటుంది.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారు సూర్య గ్రహణం సమయంలో ఆర్థిక పరంగా మంచి లాభాలాను పొందుతారు. మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. కొత్త ఇల్లు కొనేందుకు సమయం మంచిగా ఉంటుంది. వ్యాపారులకు, ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడి పెట్టేందుకు ఇది మంచి సమయం.

సింహ రాశి..

సింహ రాశి..

సూర్య గ్రహణం సమయంలో ఈ రాశి వారు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. మీ మానసిక ప్రశాంతతకు భంగం కలుగుతుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం క్షీణించడం వల్ల మీరు పనిపై ఫోకస్ పెట్టలేరు. మీరు పనిలో మీ సహోద్యోగుల మద్దతు పొందుతారు. సింగిల్ గా ఉండే వారికి వివాహ ప్రతిపాదనలు రావొచ్చు. వ్యాపారులకు ఈ సమయం ప్రత్యేకంగా ఉండదు.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారికి కుటుంబ జీవితంలో ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగులకు, వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు ఖర్చులను నియంత్రించుకోవాలి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ కాలంలో మీరు వివాదాలకు దూరంగా ఉండాలి.

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి వారు కొన్ని వైరస్ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. మీరు పెట్టుబడి పెట్టేందుకు ఈ సమయం సరైనది. పిల్లలతో మీ సంబంధం బలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు మతపరమైన యాత్రలు చేయొచ్చు. ఆస్తికి సంబంధించిన వివాదాల పరిష్కారానికి మరికొంత సమయం పట్టొచ్చు.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి వారు ఈ కాలంలో ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం అశ్రద్ధ వహించకూడదు. మరోవైపు మీరు ఏదైనా ఒప్పందాల పత్రాలపై సంతకం చేసేటప్పుడు దాన్ని పూర్తిగా చదవండి. మీరు పెట్టుబడి నుండి లాభం పొందొచ్చు. మరోవైపు భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులు వారి భాగస్వామితో గొడవ పడొచ్చు. ఉద్యోగులకు ఈ సమయం ప్రత్యేకంగా ఉండదు. ఈ సమయంలో మీరు మీ భాగస్వామి మద్దతును పొందుతారు.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

సూర్య గ్రహణం కాలంలో, ఈ రాశి వారు శత్రువులపై ఆధిపత్యం చెలాయిస్తారు. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. అయితే అజాగ్రత్తగా మాత్రం ఉండొద్దు. మీరు ఒంటరిగా ఉంటే, ఎవరైనా మీ జీవితంలో ప్రవేశించొచ్చు. అదే సమయంలో వివాహితులకు ఆనందంగా ఉంటుంది. మరోవైపు ఉద్యోగులు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారు సూర్య గ్రహణం కాలంలో పిల్లల గురించి కొంత ఆందోళన చెందుతారు. మీరు ఏదైనా పత్రంపై సంతకం చేసే ముందు జాగ్రత్తగా చదివి, ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. మీరు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించాలి. ఉద్యోగులకు ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాలు మారాలనుకునే వారికి ఈ కాలంలో మంచి అవకాశాలు లభిస్తాయి.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారికి సూర్య గ్రహణం సమయంలో చాలా సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందది. మీరు ఈ కాలంలో తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మీరు డబ్బును తెలివిగా ఖర్చు చేయాలి. మీరు స్నేహితులతో మంచి సమయం గడుపుతారు. ఈ కాలంలో పెట్టుబడులు పెట్టడం వల్ల మీకు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం పెరగొచ్చు.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి వారికి ఈ కాలంలో ఆదాయం పెరుగుతుంది. మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. మీరు కొత్త ఆస్తి లేదా భూమిని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేయొచ్చు. ఏదైనా పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చదివి నిర్ణయం తీసుకోవాలి. మరోవైపు తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో మీరు కుటుంబంతో కలిసి మతపరమైన యాత్రకు వెళ్లొచ్చు.

గమనిక : ఈ సమాచారం ఆన్ లైనులో అందుబాటులో ఉన్న ఊహాలు, జ్యోతిష్యుల అభిప్రాయంపై ఆధారపడి ఉంటుంది. దీనికి బోల్డ్ స్కై తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. మీరు ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునేందుకు, మీ వ్యక్తిగత జ్యోతిష్య నిపుణుడిని సంప్రదించి నిర్ణయం తీసుకోగలరు.

FAQs
భారతదేశంలో 2022లో తొలి సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడబోతోంది?

2022 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో 30వ తేదీన శనివారం అర్థరాత్రి 12:15 గంటలకు(భారత సమయం ప్రకారం) తొలి సూర్య గ్రహణం కూడా ఏర్పడనుంది. ఆ మరుసటి రోజు అంటే మే ఒకటో తేదీన ఉదయం 4:07 గంటల వరకు ఉంటుది. అంటే ఇది పాక్షిక గ్రహణంగా మేషరాశిలో ప్రారంభమవుతుంది.

శాస్త్రవేత్తల ప్రకారం.. సూర్యునికి మరియు భూమికి మధ్య చంద్రుడు వెళ్లినప్పుడు, చంద్రుడు సూర్యుని కాంతిని భూమిని చేరకుండా కొంత సమయం పడుతుంది.

2022లో సూర్య గ్రహణం వల్ల ఏ రాశులకు ప్రయోజనాలు?

ఏప్రిల్ నెలలో తొలి సూర్య గ్రహణం సమయంలో ద్వాదశ రాశులలోని కొన్ని రాశులకు ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయట. ద్వాదశ రాశులలో ముఖ్యంగా నాలుగు రాశుల వారికి అద్భుత ఫలితాలు రానున్నాయట. వాటిలో వృషభ రాశి, కర్కాటక రాశి, తుల రాశి, ధనస్సు రాశి ఉన్నాయి.

BoldSky Lifestyle

Story first published: Wednesday, April 20, 2022, 17:05 [IST]
Desktop Bottom Promotion