Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Surya Grahan 2022:ఏప్రిల్ లో సూర్య గ్రహణంతో ఈ 4 రాశులకు అద్భుత ఫలితాలు రానున్నాయి...!
2022లో సూర్య గ్రహణం వల్ల ఈ రాశులకు ప్రత్యేక ప్రయోజనాలు.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఏప్రిల్ నెలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నెలలో మొత్తం 9 గ్రహాలు తమ రాశిచక్రాలను మారనున్నాయి.

ఇందులో శని, గురు, రాహు, కేతు గ్రహాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే 2022 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో 30వ తేదీన శనివారం అర్థరాత్రి 12:15 గంటలకు(భారత సమయం ప్రకారం) తొలి సూర్య గ్రహణం కూడా ఏర్పడనుంది.

ఆ మరుసటి రోజు అంటే మే ఒకటో తేదీన ఉదయం 4:07 గంటల వరకు ఉంటుది. అంటే ఇది పాక్షిక గ్రహణంగా మేషరాశిలో ప్రారంభమవుతుంది. ఇదిలా ఉండగా.. సూర్య గ్రహణాన్ని కొందరు అశుభకరంగా భావిస్తారు. అందుకే గ్రహణం సమయంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు. దేవాలయాలు కూడా పూర్తిగా మూసివేస్తారు.ఎందుకంటే గ్రహణం సమయంలో సూర్యుడి ప్రభావంతో శక్తిని కోల్పోతారని చాలా మంది నమ్ముతారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే ఏప్రిల్ నెలలో తొలి సూర్య గ్రహణం సమయంలో ద్వాదశ రాశులలోని కొన్ని రాశులకు ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయట. ఆ రాశుల జాబితాలో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడే చూసెయ్యండి...

వృషభ రాశి..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, 2022లో ఏప్రిల్ 30వ తేదీన శనివారం నాడు మేష రాశిలో సూర్య గ్రహణం ఏర్పడే సమయంలో ఈ రాశి వారికి శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో ఉద్యోగులు కోరుకున్న ఫలితాలను పొందొచ్చు. మరికొందరికి ప్రమోషన్ లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. మీకు కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి.

కర్కాటక రాశి..
ఈ రాశి వారికి సూర్య గ్రహణం సమయంలో సానుకూల ఫలితాలు రానున్నాయి. కర్కాటక రాశి ఉద్యోగులు తమ కెరీర్లో మంచి పురోగతిని సాధిస్తారు. వ్యాపారులు తమ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళిక వేస్తే, అందులో విజయం సాధిస్తారు. మీరు ఈ సమయంలో చేసే ప్రయాణం వల్ల లాభం ఏర్పడుతుంది. ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.

తుల రాశి..
ఈ రాశి వారికి సూర్య గ్రహణం సంభవించే సమయంలో అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ కాలంలో మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగులకు కొత్త కొత్త అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి. వ్యాపారులు కూడా తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు మంచి ఒప్పందాలను చేసుకుంటారు. వ్యాపారులు గతంలో పెట్టిన పెట్టుబడులకు ఈ కాలంలో ఎక్కువ లాభాలను పొందొచ్చు.

ధనస్సు రాశి..
ఈ రాశి వారికి సూర్య గ్రహణం సమయంలో మంచి ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో ప్రభుత్వ శాఖకు సంబంధించి చేసే పనుల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా ఈ సమయంలో అత్యంత అనుకూలంగా ఉంటుంది.
గమనిక : ఈ సమాచారం ఆన్ లైనులో అందుబాటులో ఉన్న ఊహాలు, జ్యోతిష్యశాస్త్ర నిపుణులు తెలిపిన సమాచారంపై ఆధారపడి ఉంటుది. దీనికి బోల్డ్ స్కై తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునే ముందు దయచేసి మీ వ్యక్తిగత జ్యోతిష్య నిపుణులను సంప్రదించగలరు. అప్పుడే తుది నిర్ణయం తీసుకోగలరు.
2022 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో 30వ తేదీన శనివారం అర్థరాత్రి 12:15 గంటలకు(భారత సమయం ప్రకారం) తొలి సూర్య గ్రహణం కూడా ఏర్పడనుంది. ఆ మరుసటి రోజు అంటే మే ఒకటో తేదీన ఉదయం 4:07 గంటల వరకు ఉంటుది. అంటే ఇది పాక్షిక గ్రహణంగా మేషరాశిలో ప్రారంభమవుతుంది.
శాస్త్రవేత్తల ప్రకారం.. సూర్యునికి మరియు భూమికి మధ్య చంద్రుడు వెళ్లినప్పుడు, చంద్రుడు సూర్యుని కాంతిని భూమిని చేరకుండా కొంత సమయం పడుతుంది.
ఏప్రిల్ నెలలో తొలి సూర్య గ్రహణం సమయంలో ద్వాదశ రాశులలోని కొన్ని రాశులకు ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయట. ద్వాదశ రాశులలో ముఖ్యంగా నాలుగు రాశుల వారికి అద్భుత ఫలితాలు రానున్నాయట. వాటిలో వృషభ రాశి, కర్కాటక రాశి, తుల రాశి, ధనస్సు రాశి ఉన్నాయి.



Click it and Unblock the Notifications