For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Solar Elclipse 2020 : ఈ 4 రాశుల వారికి కోలుకోలేని దెబ్బ పడుతుందట...!

సూర్య గ్రహణం సందర్భంగా నాలుగు రాశుల వారికి తీవ్రమైన ప్రభావం ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం రండి.

|

ఈ ఏడాది జూన్ 21వ తేదీన అమావాస్య అయిన ఆదివారం నాడు తొలి సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. షష్ఠ గ్రహ కూటమి తర్వాత ఏర్పడబోయే మొట్టమొదటి సూర్యగ్రహణం చాలా ప్రభావంతమైందని జ్యోతిష్యశాస్త్ర పండితులు చెబుతున్నారు.

Solar Elclipse 2020 : These four zodiac signs will be impacted the most during Surya Grahan 2020

సూర్యగ్రహణం ఎప్పుడైనా ఆదివారం నాడు ఎక్కువగా వస్తుంది. కానీ ఆదివారం నాడు అమావాస్య మృగశిర నక్షత్రంలో జ్యేష్ఠ మాసంలో మిధున రాశిలో ఏర్పడబోతోంది. ఇది భారత కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు మొదలై మధ్యాహ్నం సుమారు 1.50 గంటల సమయంలో ముగియబోతోంది.

Solar Elclipse 2020 : These four zodiac signs will be impacted the most during Surya Grahan 2020

జ్యేష్ఠ అంటే ఇంద్రుడి యొక్క నక్షత్రం. దీనినే జ్యేష్ఠా దేవి అని కూడా అంటారు. జ్యేష్ఠ అంటే దరిద్రం(అలక్ష్మి) అని అర్థం. ఈ దేవి పరిపూర్ణమైన ప్రభావం మన దేశంపై చాలా ఎక్కువగా పడబోతోందట.

Solar Elclipse 2020 : These four zodiac signs will be impacted the most during Surya Grahan 2020

ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ కుదేలవడం.. ఎవరు ఎక్కడికి వెళ్లాలన్న భయపడిపోవడం..మరణాలు మరింతగా పెరిగిపోవడం..రోగాలు విపరీతంగా వ్యాపించడం.. ఏదైనా ఆహారం తినాలన్నా కూడా భయం భయంగా ఉండటం వంటివి ఎక్కువగా జరుగుతాయంట. ఇవన్నీ జ్యేష్ఠా దేవికి సంబంధించనవే అని చెబుతున్నారు. అంతేకాదు అందరిలోనూ అభధ్రతా భావం అనేది ఎక్కువగా ఏర్పడుతుంది.

Solar Elclipse 2020 : These four zodiac signs will be impacted the most during Surya Grahan 2020

లక్షల సంఖ్యలో ప్రజలు రోగాల బారిన పడతారంట. అయితే ఫార్మా రంగం మాత్రం మరింతగా పెరిగిపోతుందట. కానీ మిగిలిన రంగాలు మాత్రం చాలా భయంకరంగా పడిపోతాయంట. ఈ సూర్యగ్రహణం ఆదివారం రావడంతో దీనికి చూడమణి అని పేరు పెట్టారు. అంటే అద్భుతమైన మణి అని అర్థం. మిధున రాశిలో మృగశిర, ఆరుద్ర నక్షత్రంలో జరుగుతుంది కాబట్టి సుమారు నాలుగు రాశుల వారిపై దాని ప్రభావం ఉంటుంది. ఆ రాశులలో మీ రాశి కూడా ఉందేమో చూడండి...

Solar Eclipse 2020 : 12 రాశులపై సూర్యగ్రహణం ప్రభావం ఎలా ఉంటుందో చూడండి...Solar Eclipse 2020 : 12 రాశులపై సూర్యగ్రహణం ప్రభావం ఎలా ఉంటుందో చూడండి...

మిధున రాశి....

మిధున రాశి....

ఈ సూర్య గ్రహణం ఇదే రాశిలో ఏర్పడబోతోంది కాబట్టి, వీరిపై తీవ్ర ప్రభావం పడుతుందని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే కొంతమంది ఈ రాశి వారిలో చాలా మంది చనిపోతారని వదంతులు పుట్టిస్తున్నారు. ఇలాంటి వాటిలో ఎలాంటి వాస్తవం లేదు. అదంతా మీరు నమ్మాల్సిన పని లేదు. అయితే ఈ సూర్య గ్రహణం వల్ల మీకు అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. వ్యక్తిగతంగా కూడా అనేక సమస్యలు ఎదురవుతాయి. వీటి నుండి మీరు రక్షణ పొందేందుకు గాయత్రి మంత్రాలు జపించడం, గ్రహణం వీడే సమయంలో ఇంటిని శుభ్రపరచుకుని, స్నానం చేసి తర్వాత పూజలు చేయాలి.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

చూడమణి అనే పేరు గల సూర్యగ్రహణం అమావాస్య నాడు అది కూడా ఆదివారం నాడు రావడంతో ఈ రాశి వారిపై కొంత ఎక్కువ ప్రభావం ఉంటుంది. వీరికి సూర్యగ్రహణం కారణంగా కొన్ని అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అలాగే ఆర్థిక పరమైన సమస్యలు ఎదురుకావచ్చు. అనవసరమైన ఖర్చులు లేదా ఏదైనా నష్టం సంభవించే అవకాశం ఉంటుంది. ఈ సూర్యగ్రహణం మీరు రక్షణ పొందేందుకు గాయత్రి మంత్రాలు జపించడం, గ్రహణం వీడే సమయంలో ఇంటిని శుభ్రపరచుకుని, స్నానం చేసి తర్వాత పూజలు చేయాలి.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

అమావాస్య రోజున ఆదివారం నాడు ఏర్పడబోయే సూర్య గ్రహణం వల్ల ఈ రాశి వారికి చెడు ఫలితాలు ఎదురవుతాయి. వీరికి కూడా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అలాగే శారీరక ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. కాబట్టి మీరు తగిన జాగ్రత్తలు పాటించాలి. మీరు ఈ సూర్య గ్రహణం నుండి రక్షణ పొందేందుకు గాయత్రి మంత్రాలు జపించడం, గ్రహణం వీడే సమయంలో ఇంటిని శుభ్రపరచుకుని, స్నానం చేసి తర్వాత పూజలు చేయాలి.

మీ ఇంట్లో ధనం ఎల్లప్పుడూ నిల్వ ఉండాలంటే... ఈ వాస్తు చిట్కాలను పాటించండి...మీ ఇంట్లో ధనం ఎల్లప్పుడూ నిల్వ ఉండాలంటే... ఈ వాస్తు చిట్కాలను పాటించండి...

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి వారిపై సూర్య గ్రహణ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి ఆదివారం నాడు ఎక్కువగా అశుభ ఫలితాలే వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారు సూర్యగ్రహణాన్ని చూడకపోవడమే మంచిది. అలాగే అనేక జాగ్రత్తలు తీసుకోవాలి.మీరు ఈ అతిపెద్ద సూర్యగ్రహణం నుండి రక్షణ పొందేందుకు గాయత్రి మంత్రాలు జపించడం, గ్రహణం వీడే సమయంలో ఇంటిని శుభ్రపరచుకుని, స్నానం చేసి తర్వాత పూజలు చేయాలి.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ సూర్య గ్రహణం వల్ల ఈ రాశి వారికి మధ్యమ ప్రభావం ఉంటుంది. ఈ సారి గ్రహణం ఏకంగా ఆరు గంటల పాటు జరగనుండటంతో ఈ రాశి వారిపై కూడా కొంత ఎక్కువ ప్రభావం ఉంటుంది. అయితే ఈ గ్రహణం వల్ల వ్యాపారులకు కొన్ని ప్రయోజనాలు చేకూరే అవకాశముంది.

తులా రాశి..

తులా రాశి..

ఈ సూర్య గ్రహణం వల్ల ఈ రాశి వారికి మధ్యమ ప్రభావం ఉంటుంది. ఈ రాశి వారు గ్రహణం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లకూడదు. అలాగే భోజనం కూడా చేయకూడదు. గ్రహణం తర్వాత స్నానం చేసి సూర్యదేవుడికి మంత్రోచ్ఛరణ చేయడం ద్వారా సూర్య గ్రహణ ప్రభావం నుండి కొంత ఉపశమనం పొందవచ్చు.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఇలా చేస్తే కోరుకున్న కొలువులు గ్యారంటీ...!జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఇలా చేస్తే కోరుకున్న కొలువులు గ్యారంటీ...!

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ సూర్య గ్రహణం వల్ల ఈ రాశి వారికి మధ్యమ ప్రభావం ఉంటుంది.

ఈ సూర్యగ్రహణం వల్ల ధనస్సు రాశిలో ఉండే మూలా నక్షత్రం, పూర్వఅషాడ, ఉత్తర ఆషాడ నక్షత్రాల వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి తులసి ఆకుల నుండి నీరు, పాలు, పెరుగు, నెయ్యి వంటి వాటితో గ్రహణ ప్రభావం నుండి తప్పించుకోవచ్చు.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ సూర్య గ్రహణం వల్ల ఈ రాశి వారికి మధ్యమ ప్రభావం ఉంటుంది. ఈ రాశి వారు గ్రహణం సమయంలో దేవుని విగ్రహాలను కూడా అస్సలు తాకకూడదు. అయితే గ్రహణం అనంతరం స్నానం చేయాలి. తర్వాత సూర్యదేవుడిని స్మరించుకుంటూ ప్రార్థనలు చేస్తే ఈ గ్రహణం నుండి కొంత ఉపశమనం లభిస్తుంది.

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Solar Elclipse 2020 : These Four Zodiac Signs Will Be Impacted the Most

Here we talking about solar Elclipse 2020 : These four zodiac signs will be impacted the most during surya grahan 2020. Read on.
Desktop Bottom Promotion